MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • DJ Tillu Review:'డీజే టిల్లు' రివ్యూ

DJ Tillu Review:'డీజే టిల్లు' రివ్యూ

సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా విమల్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డీజే టిల్లు’.ఇప్పటికే రిలీజైన పాటలు అందరినీ ఆకట్టుకోగా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో పుట్టుమచ్చల వ్యవహారం సినిమాపై మరింత హైప్‌ను తీసుకొచ్చింది. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం శనివారం (ఫిబ్రవరి 12న) విడుదలైంది. డీజే టిల్లు బాక్సాఫీస్‌లో సౌండ్‌ మోగిస్తున్నాడా? లేదా?  చూద్దాం..

3 Min read
Author : Surya Prakash
Published : Feb 12 2022, 03:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18


లోకల్ భాషకు,యాసకు, వేషానికి ఎప్పుడూ ఓ గుర్తింపు ప్రత్యేకత ఉంటుంది. అలాంటిదే హైదరాబాదీ గల్లీ కుర్రాళ్ల స్పెషల్ అప్పీరియన్స్..లైఫ్ స్టైయిల్. అక్కడ కనిపించే చిచ్చోరా పోరగాళ్ల కథలు పెద్దగా మనకు తెరకెక్కలా. అయితే ఈ మధ్యకాలంలో తెలంగాణా యాసలో వచ్చే సినిమాలు, దక్కన్ సినిమాలు సైతం అందరి ఆమోదం పెద్ది పెద్ద ఎత్తున విజయవంతం అవుతూండటంతో డిజే టిల్లూ ధైర్యం చేసాడు. హైదరాబాద్ లోకల్ ని నరనరాల్లో నింపుకున్న క్యారక్టర్ తో మన ముందుకు వచ్చాడు. అయితే ఆ పాత్రకు సరైన ఆర్క్, మార్క్ వేయటంలో తడబడ్డాడు... ఇంతకీ ఈ టిల్లు ఎవరు...వాడి కథేంటి?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28


కథ

డీజే టిల్లు(సిద్ధూ జొన్నల‌గ‌డ్డ‌)లోకల్ గా ఫేమస్. ఏ పెళ్లిలో,పేరంటంలో అయినా అతని డిజే కొట్టాల్సిందే. అయితే టిల్లు కు ఓ తీరని కోరిక...ఓవర్ నైట్ ఓ పెద్ద మ్యూజిక్ డైరక్టర్ అయ్యివాలని. ఈలోగా సింగ‌ర్ రాధిక (నేహాశెట్టి)తో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటాడు. అయితే ఆమెకు ఆల్రెడీ ఓ బోయ్ ప్రెండ్ ఉన్నాడు. ఆ బోయ్ ప్రెండ్ మరో అమ్మాయితో క్లోజ్ గా ఉంటాడు. దాంతో రాధిక నేనేం తక్కువ తిన్నానా అన్నట్లు మన టిల్లుకు దగ్గరవుతుంది. ఇది తెలిసిన ఆ బోయ్ ప్రెండ్ డైరక్ట్ యుద్దం ప్రకటించేస్తాడు. ఫైనల్ గా రాధిక చేతిలో చనిపోతాడు. ఈ మర్డర్ కేసులో టిల్లు కూడా ఇరుక్కునే సిట్యువేషన్ క్రియేట్ అవుతుంది.సరే జరిగిందేదో జరిగిందని  ఆ శవాన్ని ఇద్దరు కలిసి మాయం చేద్దామంటే.... ఓ బ్లాక్ మెయిలర్, పోలీస్ లు వెంటనబడతారు. అప్పుడు టిల్లు ఏం చేసాడు. మర్డర్ కేసు నుంచి ఎలా బయిటపడ్డారు. అందుకు ఏం ప్లాన్ చేసారు. చివరకు ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

38

 
ఎనాలసిస్ ...

క్యారక్టర్ నడిపించే కథనం ఇది. మొదట క్యారక్టర్ డిజైన్ చేసుకుని అందులోంచి పుట్టే సమస్యలను ఫన్ గా డీల్ చేస్తూ ముందుకు వెళ్లే క్రైమ్ కామెడీగా తీర్చిదిద్దాలనుకున్నారు. సాధారణంగా ఈ క్యారక్టర్ డ్రైవరన్ కథల్లో మెయిన్ ఫోకస్ అంతా క్యారక్టర్ ఆలోచలు, ఆహార్యం, ఆర్క్, ఇంటర్నెల్ ఛేంజ్ లు వంటివాటి చుట్టూ ఉంటాయి. అంతేకానీ ఈవెంట్స్ ఉండవు.  అయితే డీజే టిల్లులో అటువంటిదేమీ కనపడదు. ఓ టపోరి క్యారక్టర్ అనుకున్నారు. దాన్ని ముందుకు బాగానే తీసుకెళ్ళారు. సమస్యలో పడేసారు. అయితే ఆ సమస్య నుంచి బయిటపడే మార్గం మాత్రం కనుక్కోలేకపోయారు. దాంతో సెకండాఫ్ మొత్తం ఎటునుంచి ఎటు వెళ్తోందో అర్దం కానట్లు తయారైంది. ఫస్టాఫ్ లో వచ్చిన ఫన్ అంతా సెకండాఫ్ లో తగ్గిపోయి డౌన్ అయ్యిపోయింది .

48

 కాకపోతే క్యారక్టర్ డ్రైవన్ కథలతో ఓ సుఖం ఉంటుంది. అవి పట్టాయా తెగ నచ్చేస్తాయి. పెద్దగా లోపాలను హైలెట్ కానివ్వవు. ఆ క్యారక్టర్ లోకి చూసేవాడు పరకాయ ప్రవేశం చేసే అవకాసం ఇస్తాయి. చూసేవాళ్లు స్వయంగా ఎక్సపీరియన్స్ చేయలగుతారు. టిల్లు కొంతవరకూ ఆ విషయంలో సక్సెస్ అయ్యింది.  అయితే ఈ కథలో హిరోకు వచ్చే స్ట్రగుల్స్ చాలా సిల్లీగా అనిపిస్తాయి. అలాగే ఈ సినిమాలో క్యారక్టర్ ఆర్క్ కూడా లేకపోవటం, ప్రారంభంలో ఎలా ఉన్న పాత్ర చివరకు వచ్చేసరికీ అలాగే ఉండటంతో ఏమీ జరిగినట్లు అనిపించదు. ముఖ్యంగా క్లైమాక్స్ ఏదో ముగించాలి కాబట్టి ముగించేసారు అనిపిస్తుంది. కాకపోతే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఓ విషయం అర్దమవుతుంది. సిద్దు కూడా విఙయదేవరకొండ, విష్వక్ సేన్, నవీన్ పోలిశెట్టి తరహాలో తనకంటూ ఓ స్టెయిల్ ని ఏర్పాటు చేసే పనిలో ఉన్నాడు. అందులోంచి పుట్టిన వాడే డిజే సిద్దు అని.  ఆ యాంగిల్ లో చూస్తే సిద్దు సక్సెస్ అయ్యాడనిపిస్తుంది.

 

58


ఫెరఫార్మెన్స్

ఇది సంపూర్తిగా సిద్దు జొన్నలగడ్డ సినిమా. అతను నటన, క్యారక్టరైజేషన్, డైలాగులే సినిమాకు ప్రాణం. . నేహాశెట్టి రొమాన్స్  బాగా పండించింది.  బ్రహ్మాఙీ, నర్రా శ్రీను వంటి క్యారక్టర్ ఆర్టిస్ట్ లు ఎప్పటిలా చేసుకుంటూ పోయారు.  కామెడీ మాత్రం పండించలేకపోయారు.

టెక్నికల్ గా...
డైరక్టర్ గా ఇలాంటి కథలు డైరక్ట్ చేయటం అంటే మాటలు కాదు. విమల్ కృష్ణ కొత్తవాడైనా గట్టివాడే అనిపించుకున్నాడు. క్యారక్టరైజేషన్, డైలాగులు, లోకల్   నేటివిటిపై దృష్టి పెట్టాడు. సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల పాసైపోయాడు. అతను పాటలు డిసెంట్ హిట్. ముఖ్యంగా టైటిల్ సాంగ్ అయితే మామూలుగా లేదు. సాంగ్స్ మేకింగ్ కూడా బాగుంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కానీ అఖంఢ స్దాయిలో హోరెత్తించేయటం ఇబ్బందిగా ఉంది. సినిమాటోగ్రఫీ,  ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
 
 

68

 

హైలెట్స్

సిద్దు జొన్నల గడ్డ యాక్టింగ్
టిల్లు క్యారక్టరైజేషన్
డైలాగ్స్,
ఫస్టాఫ్

మైనస్ లు

సెకండాఫ్
ఎటెటో వెళ్లిపోయే స్క్రీన్ ప్లే
క్లైమాక్స్

 

78
DJ Tillu

DJ Tillu


ఫైనల్ థాట్

కథ,స్క్రీన్ ప్లే వంటివి పెట్టుకోకుండా  కేవలం హీరో  క్యారక్టరైజేషన్  తో సినిమా నడిపించేయాలనుకోవటం మాత్రం సాహసమే.

---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.5

88
DJ Tillu Review

DJ Tillu Review


తెర వెనక..ముందు
నటీనటులు: సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి, ప్రిన్స్‌, బ్రహ్మాజీ, ప్రగతి, తదితరులు;
సినిమాటోగ్రఫీ: సాయిప్రకాశ్‌;
ఎడిటర్‌: నవీన్‌ నూలీ;
 నేపథ్య సంగీతం: తమన్‌;
నిర్మాత:  సూర్యదేవర నాగవంశీ;
 సంస్థ: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌;
కథ, రచన: విమల్‌ కృష్ణ, సిద్ధూ జొన్నలగడ్డ;
దర్శకత్వం: విమల్‌ కృష్ణ;
విడుదల తేదీ: 12-02-2022

 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bobbili Brahmanna Review: బాలకృష్ణకు చుక్కలు చూపించిన కృష్ణంరాజు సినిమా.. బొబ్బిలి బ్రహ్మన్న రివ్యూ
Recommended image2
#Cult Movie Review: కల్ట్ మూవీ రివ్యూ.. విశ్వక్‌ సేన్‌ ఇండియా తొలి స్లాషర్‌ సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
Aadarsha Kutumbam Movie Review: ఆదర్శ కుటుంబం మూవీ రివ్యూ, వెంకటేష్‌, త్రివిక్రమ్‌ సినిమా హిట్టా ? ఫట్టా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved