ఇంత ఘోరం అవుతుందనుకోలేదు.. అది నన్ను తీవ్రంగా బాధించిందిః సోహైల్ ఆవేదన
First Published Jan 9, 2021, 4:58 PM IST
బిగ్‌బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్‌గా పాపులర్ అయిన సోహైల్ అసలైన విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తాను ముందుగానే మెహబూబ్ ఇచ్చిన సిగ్నల్‌తో 25లక్షల ఆఫర్ తీసుకుని వెళ్లిపోవడం వివాదంగా మారింది. దీనిపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు సోహైల్. దీనికి సంబంధించిన ఇప్పుడు మరిన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారాయన.

బిగ్‌బాస్4లో బాగా పాపులారిటీని, క్రేజ్‌ని సొంతం చేసుకున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది సోహైల్ చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆయన తన మేనరిజంతో అందరికి దగ్గరయ్యారు.

`కథ వేరేలా ఉంటది..`, `సింగరేణి ముద్దు బిడ్డ` అనే పదాలు, `నైట్ తొమ్మిది తర్వాత షెడ్‌కి వెళ్లడం` అనే విషయం అటు హౌజ్‌లోని కంటెస్టెంట్లకి, ఇటు టీవీ ఆడియెన్స్ కి తెగ నచ్చేశాడు. తన బోళా ప్రవర్తన బాగా ఆకట్టుకుంది. బిగ్‌బాస్4 ఫైనల్‌లో టాప్ 3లో నిలిచారు సోహైల్. కానీ అందరిచేత అసలైన విన్నర్ అనిపించుకున్నారు.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?