MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Ameer Log Movie Review: అమీర్‌ లోగ్‌ మూవీ రివ్యూ.. పాతబస్తీ పోరగాళ్ల బిర్యానీ కథ ఎలా ఉందంటే?

Ameer Log Movie Review: అమీర్‌ లోగ్‌ మూవీ రివ్యూ.. పాతబస్తీ పోరగాళ్ల బిర్యానీ కథ ఎలా ఉందంటే?

Ameer Log Movie Review: పాతబస్తీ నేపథ్యంలో రూపొందించిన చిత్రం `అమీర్‌ లోగ్‌`. బిర్యానీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉంది? ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

4 Min read
Author : Aithagoni Raju
| Updated : Aug 21 2026, 07:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
అమీర్‌ లోగ్‌ మూవీ రివ్యూ
Image Credit : X/@Awwal_Films

అమీర్‌ లోగ్‌ మూవీ రివ్యూ

పాతబస్తీ నేపథ్యంలో చాలా అరుదుగా సినిమాలు వస్తుంటాయి. ఆ స్లాంగ్‌, కల్చర్‌, నేటివిటీ నేపథ్యాన్ని ఆవిష్కరిస్తూ ఎప్పుడో ఒకసారి వస్తుంటాయి. అలా చాలా రోజుల తర్వాత అలాంటి కథతో ఇప్పుడు `అమీర్‌ లోగ్‌` అనే చిత్రం తెరకెక్కింది. ఇందులో వేద జలంధర్‌, హరి మున్నంగి, మనోజ్‌ ఆవుల, శశిధర్‌ కొచ్చర్ల కోట, రావణ్‌ నిట్టూరు, విశ్వేశ్వర్‌ రెడ్డి, పవన్‌ రమేష్‌ వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించారు. రమణారెడ్డి సోమ దర్శకత్వం వహించారు. అవాళ్‌ నెంబర్‌ ప్రొడక్షన్స్ పతాకంపై మాధవి రెడ్డి సోమ నిర్మించారు. ఈ చిత్రం నేడు శుక్రవారం (ఆగస్ట్ 21)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
అమీర్‌ లోగ్‌ కథ ఏంటంటే?
Image Credit : X/@Awwal_Films

అమీర్‌ లోగ్‌ కథ ఏంటంటే?

శ్రీను(హరి మున్నంగి), మల్లేష్‌(శశిధర్‌ కొచ్చర్ల కోట), రఫీక్‌(మనోజ్‌ ఆవుల) పాత బస్తీలో చిన్నప్పట్నుంచి మంచి ఫ్రెండ్స్. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వీరికి చదువు పెద్దగా అబ్బలేదు. దీంతో పాతబస్తీలో అవారాగా తిరుగుతుంటారు. క్రికెట్‌ గ్రౌండ్‌ కోసం గొడవలు పడుతుంటారు. ఏదైనా పని చేసుకోమ్మని చెబుతూ ఇంట్లో పేరెంట్స్ రోజూ తిడుతుంటారు. కానీ వినరు. వీళ్లకి గీత(వేద జలంధర్‌) అక్కలాగా ఉంటుంది. మంచి చెడు చెబుతుంది. ఆమె సాఫ్ట్ కంపెనీలో పనిచేస్తుంటుంది. ఆమె మాట విని శ్రీను వాళ్ల కంపెనీలోనే ఆఫీస్‌ బాయ్‌గా చేరతాడు. ఆ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుంటాడు. మిగిలిన ఇద్దరు శ్రీనుని వ్యతిరేకిస్తారు. ఆ తర్వాత బోర్‌ గా ఫీలవుతారు. నెమ్మదిగా వాళ్లు కూడా తమకి నచ్చిన పనులు చేస్తుంటారు. రఫీక్‌ బైక్‌ మెకానిక్‌ చేస్తుంటే, మల్లేష్‌ క్యాబ్‌ నడిపిస్తుంటారు. అయితే ఓ రోజు శ్రీను ఆఫీస్‌లోని సాఫ్ట్ వేర్‌ ఉద్యోగులతో.. క్రికెట్‌ విషయంలో శ్రీను బెట్టింగ్‌ కడతాడు. మాతో మీరు ఆడలేరని చెప్పి శ్రీను వాళ్ల ముందు పోజులు కొడతాడు. తమ పాతబస్తీ పోరగాళ్లు, సాఫ్ట్ వేర్‌ టీమ్‌లు కలిసి క్రికెట్‌ ఆడతారు. ఇందులో పాతబస్తీ పోరగాళ్లు ఓడిపోతారు. దీంతో తమకు డబ్బులు వద్దు మంచి బిర్యానీ తినిపించమని చెబుతారు ఉద్యోగులు. బిర్యానీ చేయడంలో చాచా ఫేమస్‌. ఆయన వండిన బిర్యానీ తిని సాఫ్ట్ వేర్‌ బ్యాచ్‌ ఫిదా అవుతారు. ఆ సమయంలోనే ఉద్యోగుల హెడ్‌ రవికి బిర్యానీ పాయింట్‌ పెట్టాలనే ఆలోచన వస్తుంది. ఈ ముగ్గురుతోనే `కిర్రాక్‌ బిర్యానీ` పాయింట్‌ స్టార్ట్ చేస్తాడు. మరి ఈ బిర్యానీ బిజినెస్‌ సక్సెస్‌ అయ్యిందా? రవిలో వచ్చిన మార్పేంటి? దానికి ముగ్గురు ఏం చేశారు? రవి ఇచ్చిన ట్విస్ట్ ఏంటి? చివరికి బిర్యానీ కథ ఎలాంటి మలుపులు తీసుకుందనేది సినిమా.

Related Articles

Related image1
Jagamae Sangeetham: సుష్మిత కొణిదెల నిర్మించిన క్రేజీ సిరీస్ ఓటీటీలోకి.. ఎందులో, ఎప్పటి నుంచి అంటే..
Related image2
Irumudi Movie Review: ఇరుముడి మూవీ ఫస్ట్ రివ్యూ, రవితేజ దెబ్బకు పూనకాలు గ్యారెంటీ..
37
అమీర్‌ లోగ్‌ మూవీ విశ్లేషణ
Image Credit : X/@Awwal_Films

అమీర్‌ లోగ్‌ మూవీ విశ్లేషణ

మన నేటివిటీ(ప్రాంతం ఏదైనా) ఆవిష్కరించే సినిమాలు తక్కువగా వస్తున్నాయి. కానీ ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. ఇటీవల తెలంగాణ కల్చర్‌ని ఆవిష్కరించే సినిమాలు బాగా వస్తున్నాయి. అందులో భాగంగానే హైదరాబాద్‌ కల్చర్‌ని ఆవిష్కరించే కథతో `అమీర్‌లోగ్‌` వచ్చింది. పాతబస్తీలో హిందూ, ముస్లిం అనే తేడా లేదు. అందరు కలిసే ఉంటారు. స్నేహంగా ఉంటారు. ఒకరికొకరు తోడుగా, అండగా ఉంటారు. ఇటీవల కొన్ని పార్టీలు మతం పేరుతో విడగొట్టే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఆ యాంగిల్‌లో ఈ మూవీ వారికి చెంపపెట్టులాంటిదని చెప్పొచ్చు. ఇది పక్కన పెడితే, పాతబస్తీ రియాలిటీని ఆవిష్కరించిన మూవీ ఇది. వాళ్లు ఎలా ఉంటారు? ఎలా బిహేవ్‌ చేస్తారు, ఎలా ఎంజాయ్‌ చేస్తారు? స్వచ్ఛమైన మనసులను, నిజాయితీగా ఆవిష్కరించిన మూవీ `అమీర్‌ లోగ్‌`. అయితే రియాలిటీగా, జెన్యూన్‌గా, కష్ట పడి సినిమా చేస్తే సరిపోదు, అంతే ఆకట్టుకునేలా, ఎంగేజ్‌ చేసేలా, నవ్వించేలానో, ఫీల్‌ అయ్యేలానో చేయాలి. అప్పుడే సినిమా ఆకట్టుకుంటుంది. సక్సెస్‌ అవుతుంది. కానీ ఇందులో అదే లోపించింది. రియాలిటీగా చేసుకుంటూ వెళ్లారు, కానీ ఆకట్టుకునేలా తీయడంలో ఫెయిల్‌ అయ్యారు. సినిమా ప్రారంభంలో.. పాత బస్తీలో నేటివిటీలో బాగా ఎస్టాబ్లిష్‌ చేశారు, దానికి అరగంటకుపైగానే తీసుకున్నారు. ఊ అంటే టీ తాగడం, అవారాగా తిరగడం, పేరెంట్స్ చెప్పే మాట వినకపోవడం, గొడవలు పడటం వంటివి రియాలిటీగా చూపించారు. ఆ తర్వాత శ్రీను జాబ్‌ లో చేరడం, ఆ తర్వాత ఇద్దరిలోనూ మార్పు రావడం వంటివి చూపించారు. ఇంటర్వెల్‌ పార్ట్ సాఫ్ట్ వేర్‌ టీమ్‌తో క్రికెట్‌ ని చూపించారు. అందులో ఎవరు గెలిచారనే ట్విస్ట్ ఇచ్చారు. సెకండాఫ్‌ సినిమా మొత్తం బిర్యానీ వైపు టర్న్ తీసుకుంటుంది. ఫస్ట్ పార్ట్ కి, ద్వితీయార్థానికి సంబంధం లేదనేలా ఉంటుంది. టేస్టీ బిర్యానీ, హైదరాబాద్‌ బిర్యానీకి యాడ్‌ లాగా చేశారు. బిజినెస్‌ స్టార్ట్ చేయడం, వంటలు చేయడం వంటి ప్రాసెస్‌ని మరీ డిటెయిలింగ్‌గా చూపించారు. అదే సినిమాకి పెద్ద మైనస్‌గా మారింది. బోర్‌ తెప్పిస్తుంది. క్లైమాక్స్ కొంత ఎమోషనల్‌గా ఉంటుంది. చాచా పాత్రలోని ట్విస్ట్ కూడా ఎమోషనల్‌కి గురి చేస్తుంది.

47
అమీర్‌ లోగ్‌లో ప్లస్‌, మైనస్‌లు
Image Credit : X/@Awwal_Films

అమీర్‌ లోగ్‌లో ప్లస్‌, మైనస్‌లు

సినిమా పాతబస్తీ జీవితాలను ఆవిష్కరించింది. వారి స్వచ్ఛమైన మనసులను ఆవిష్కరించింది. పాత్రల తీరుతెన్నులు ఆకట్టుకుంటాయి. అక్కడక్కడ ఫన్‌ వర్కౌట్ అయ్యింది. హైదరాబాద్‌ భాష కొంత వరకు ఆకట్టుకుంటుంది. రియాలిటీగా చూపించడం బాగుంది. మ్యూజిక్‌, పాటలు బాగున్నాయి. పిక్చరైజేషన్‌ ఫర్వాలేదు. కానీ సినిమా చాలా స్లోగా ఉంటుంది. కథ అక్కడే తిరుగుతుంది. ప్రారంభం ఒకలా, ఎండింగ్‌ మరోలా మారిపోతుంది. ఏం చెప్పాలనుకున్నారనేది క్లారిటీ లేదు, కామెడీ పెద్దగా వర్కౌట్‌ కాలేదు. సాగదీత ఎక్కువగా ఉంది. సినిమాలో ఎమోషన్స్ మిస్‌ అయ్యాయి. సోల్‌ మిస్‌ అయ్యింది. దీంతో టేస్ట్ లేని బిర్యానీలా మారిపోయింది. షార్ట్ ఫిల్మ్స్, వెబ్‌ సిరీస్‌లు బాగా ఎంగేజింగ్‌గా తీస్తున్నారు. ఇది వాటితో పోటీపడలేకపోయిందని చెప్పొచ్చు.

57
అమీర్‌ లోగ్‌ లో నటీనటులు ఎలా చేశారంటే?
Image Credit : X/@Awwal_Films

అమీర్‌ లోగ్‌ లో నటీనటులు ఎలా చేశారంటే?

ముగ్గురు కుర్రాళ్లు.. శ్రీనుగా హరి మున్నంగి, రఫీక్‌గా మనోజ్‌ ఆవుల, మల్లేష్‌గా శశిధర్‌ కొత్త కుర్రాళ్ల అయినా చాలా బాగా నటించారు. పాత్రల్లో జీవించారు. జెన్యూన్‌గా, రియాలిటీగా చేసి మెప్పించారు. ఈ మూడు పాత్రలే సినిమాకి మెయిన్‌. ముఖ్యంగా శ్రీనుగా హరి ఆకట్టుకున్నాడని చెప్పొచ్చు. గీతగా వేద జలంధర్‌ ఆకట్టుకుంది. గత చిత్రంతో పోల్చితే వేరియేషన్‌ చూపించి మెప్పించింది. చాచాగా విశ్వేంధర్‌ రెడ్డి అదరగొట్టారు. ఆయన పాత్రలోని ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. రవి పాత్రలో నటించిన రావన్‌ మెప్పించారు. సాయి యోగి ఆకట్టుకున్నాడు. పేరెంట్స్ గా చేసిన ఆర్టిస్ట్ లు కూడా పాత్రల్లో జీవించారు. నటీనటులు సినిమాకి ప్లస్‌ అని చెప్పొచ్చు. దర్శకుడు వాళ్ల నుంచి అంతే సహజమైన నటనని తీసుకున్నారు. ఆ విషయంలో సక్సెస్‌ అయ్యాడు.

67
అమీర్‌ లోగ్‌ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?
Image Credit : X/@Awwal_Films

అమీర్‌ లోగ్‌ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

స్మరణ్‌ సాయి మ్యూజిక్‌ బాగుంది. పాటలు ఆకట్టుకున్నాయి. పాత బస్తీ జీవితాలను ఆవిష్కరించేలా ఉంది. సలిగంటి విజయ్‌ కుమార్‌ కెమెరా పనితీరు కూడా ఫర్వాలేదు. రోహిత్‌ ఎడిటింగ్‌ స్పీడ్‌ చేయాల్సింది. మాధవి రెడ్డి సోమ నిర్మాణ విలువలు ఫర్వాలేదు. దర్శకుడు రమణారెడ్డి సోమ ఎంచుకున్న కథ బాగుంది. జెన్యూన్‌గా, రియాలిటీగా తెరపై ఆవిష్కరించారు. కానీ ఆకట్టుకునేలా, కమర్షియల్‌గా మెప్పించేలా చేయడంలో విఫలమయ్యాడు. స్లోగా తీసుకెళ్లారు. డెక్కన్‌ సినిమా స్టయిల్‌లో రూపొందించారు. కొంత ఆర్ట్ స్టయిల్‌ కనిపిస్తుంది. సినిమా ఎలా తీశామనేది కాదు, ఆడియెన్స్ కి ఆకట్టుకునేలా ఉందా లేదా అనేది చాలా ముఖ్యం. ఈ మూవీ విషయంలో ఆ మీటర్‌ తేడా కొడుతుందని చెప్పొచ్చు. ఫన్‌, ఎమోషన్స్ ని బలంగా ఆవిష్కరిస్తే బాగుండేది.

77
ఫైనల్‌ నోట్‌, రేటింగ్‌
Image Credit : X/@Awwal_Films

ఫైనల్‌ నోట్‌, రేటింగ్‌

పాతబస్తీ జీవితాలను ఆవిష్కరించిన మూవీ. జెన్యూన్‌ అటెంప్ట్. పాతబస్తీ వాళ్లని ఆకట్టుకునే మూవీ అవుతుంది.

రేటింగ్‌: 2.75

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
The Red Bag Movie Review: ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ, మహిళా నేపథ్యంలో సాగే క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?
Recommended image2
Pahalgam Love Story Review: 'పహల్‌గామ్ లవ్ స్టోరీ' మూవీ రివ్యూ..లవ్ స్టోరీలో దేశభక్తి
Recommended image3
Irumudi Review: ఇరుముడి మూవీ రివ్యూ... రవితేజకి ఎట్టకేలకు హిట్‌ పడిందా?
Related Stories
Recommended image1
Jagamae Sangeetham: సుష్మిత కొణిదెల నిర్మించిన క్రేజీ సిరీస్ ఓటీటీలోకి.. ఎందులో, ఎప్పటి నుంచి అంటే..
Recommended image2
Irumudi Movie Review: ఇరుముడి మూవీ ఫస్ట్ రివ్యూ, రవితేజ దెబ్బకు పూనకాలు గ్యారెంటీ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved