Beauty tips: బొగ్గుతో అందమైన ముఖం కోసం.. ఈ టిప్స్ పాటిస్తే సరి?
Beauty tips: సౌందర్య సాధనాలలో ఇప్పుడు బొగ్గు కూడా చేరింది. ప్రాసెస్డ్ చార్కోల్ ని ఉపయోగించి ముఖాన్ని మరింత అందంగా తయారు చేసుకోవచ్చు అంటున్నారు సౌందర్య నిపుణులు. అయితే ఆ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చార్ కోల్ ని ఉపయోగించడం ద్వారా మీ ముఖ సౌందర్యం మరింత మెరుగ్గా కనిపిస్తుంది. మార్బుల్ వాడకం ఇప్పుడు ట్రెండ్గా మారింది చారుకోల్ తో క్లీన్సర్లు షాంపూలు, సబ్బులు మరియు స్క్రబ్ లు కూడా చార్కోల్ వి దొరుకుతున్నాయి. వాటి యొక్క పనితీరు కూడా మెరుగ్గా ఉండటం వలన వీటికి మరింత డిమాండ్ పెరిగింది.
చారుకోల్ తో ముఖాన్ని ఏ విధంగా మెరుగుపరచుకోవచ్చు ఇక్కడ చూద్దాం. ఆక్సిజన్ వాయువుతో అధిక ఉష్ణోగ్రత వద్ద పౌడర్ చేసిన బొగ్గుని యాక్టివేటెడ్ చార్కోల్ అంటారు. ఈ యాక్టివేటెడ్ చార్కోల్ అనేక రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ లో వినియోగిస్తున్నారు.
చార్కోల్ చర్మాన్ని కాలుష్యం నుంచి కాపాడుతుంది యాక్టివేటెడ్ చార్కోల్ చర్మం లోని టాక్సిన్స్ ను గ్రహిస్తుంది మరియు ముఖాన్ని పూర్తిగా శుభ్రపరుస్తుంది. అందుకే రాత్రిపూట బొగ్గు ఆధారిత ఫేస్ వాష్ తో ముఖాన్ని కడుక్కొని పడుకోవటం వలన చర్మం యవ్వనంగా మరియు తాజాగా ఉంటుంది.
అలాగే ఒక టేబుల్ స్పూన్ యాక్టివేటెడ్ చార్కోల్ కొంచెం కొబ్బరి నీళ్లు కలిపి ముఖానికి రాసుకోవడం వలన చర్మం మీద ఉన్న రంధ్రాలు తెరుచుకునే లాగా చేసి చర్మ గ్రందులలో ఉన్న మురికి తొలగిపోయేలాగా చేస్తుంది. చార్కోల్ ని ముఖానికి మాస్క్ గా పెట్టుకోవడం వలన ముఖం మీద ఉండే జుట్టు తొలగిపోయి ముఖం కాంతివంతంగా ఉండేలాగా కనిపిస్తుంది.
అలాగే యాక్టివేటెడ్ చార్కోల్ లో కొంచెం నీటిని కలిపి ముఖానికి రాసుకోవడం వలన చర్మం మీద పేరుకుపోయిన దుమ్ము దులిక కణాలను శుభ్రపరిచి మొటిమలను రాకుండా చేయవచ్చు. అలాగే కొన్నిసార్లు ముఖం యొక్క రంధ్రాలు బాగా తెరుచుకుంటాయి.
దీనివలన మొఖం చూడటానికి ఇబ్బంది కరంగా కనబడుతుంది. అటువంటి సమయంలో ఉత్తేజిత బొగ్గు మీ ముఖం యొక్క రంధ్రాలను తిరిగి నిరోధించడంలో మీకు సహాయపడుతుంది. లోపల నుంచి వాటిని శుభ్రం చేయడం ద్వారా ఓపెన్ రంధ్రాలను తగ్గిస్తుంది.