World Breastfeeding Week 2022: పిల్లలకు ఎన్నేండ్ల వరకు తల్లి పాలివ్వాలి..?
World Breastfeeding Week 2022: ఆరు నెలల వరకు పిల్లలకు తల్లిపాలే ఆహారం. తల్లిపాలతోనే పిల్లలు బలంగా తయారవుతారు. అయితే పిల్లలకు ఎన్ని నెలల వరకు తల్లిపాలివ్వాలో మీకు తెలుసా..?

తల్లిపాలే పిల్లలకు సంపూర్ణ ఆహారం. అందులో డెలివరీ అయిన మొదటి గంటలోపలే బిడ్డకు ఖచ్చితంగా పాలివ్వాలి. దీనివల్ల బిడ్డ రక్తంలో చర్కెర స్థాయిలను నిర్వహించానికి ఉపయోగపడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా డెలివరీ అయిన ఐదుగురు మహిళల్లో మొదటి గంటలో ముగ్గురు స్త్రీలు బిడ్డకు పాలివ్వడం లేదట. యూనిసెఫ్ ప్రకారం.. 77 మిలియన్ల నవజాత శిశువులు.. పుట్టిన మొదటి గంటలో తల్లిపాలు పట్టడం లేదట. లేట్ గా తల్లిపాలు పట్టించడం వల్ల నవజాత శిశువుల మరణ ప్రమాదం 80 శాతం వరకు పెరుగుతుందట.
జంతుపాల కంటే తల్లిపాలే బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతాయి. అందులోనూ తల్లిపాలు చాలా తొందరగా జీర్ణం అవుతాయి. తల్లిపాలతోనే బిడ్డ బలంగా ఎదుగుతాడు.
మొదటి ఆరు నెలల వరకు పిల్లలకు తల్లిపాలను ఖచ్చితంగా ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పిల్లలకు కావాల్సిన పోషకాలు తల్లిపాల ద్వారానే అందుతాయి. ఆ వయసులో తల్లిపాలను తప్ప వారేమీ జీర్ణం చేసుకోలేరు. అందులోనూ.. ఆవు పాలు కూడా 6 నెలలపోపు పిల్లలకు పట్టించకూడదు. వీటివల్ల పిల్లలకు సరిపడా పోషకాలు అందవు. తల్లిపాలే పిల్లలకు ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. ఆరు నెలల తర్వాత తల్లిపాలతో పాటుగా డాక్టర్ల సలహాను తీసుకుని ఇతర ఆహారాలను కొద్ది కొద్దిగా పెట్టొచ్చు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. పిల్లలకు 6 నెలల తర్వాతే కాదు.. 2 సంవత్సరాలు లేదా.. అంతకంటే ఎక్కువ కాలం కూడా తల్లిపాలను ఇవ్వొచ్చు. దీనివల్ల పిల్లలకు పండ్ల రసాలు, నీరు వంటి అదనపు పోషణ అవసరం లేదు.
ఎందుకంటే పిల్లలకు తల్లిపాల ద్వారే ఎన్నో పోషకాలు అందుతాయి. 6 నెలల ప్రత్యేకమైన బ్రెస్ట్ ఫీడ్ ల తరువాత పనికి వెళ్లి వచ్చే తల్లులు, ఆఫీసుకు వెళ్లే ముందు ఉదయం ఒకసారి, ఇంటికి తిరిగి వచ్చిన తరువాత సాయంత్రం ఒకసారి, రాత్రి రెండుసార్లు బిడ్డలకు తల్లిపాలు ఇవ్వొచ్చు.
ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒకవేళ తల్లి పాలివ్వలేనట్టైతే.. ఫార్ములా పాలను.. ఒక కప్పు పట్టించొచ్చు. బాటిల్ పాలను కాదు. ఇది మీ బిడ్డ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుంది. డయేరియా, న్యుమోనియా ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే అలర్జీ రుగ్మతలు, ఊబకాయం, మధుమేహం వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే పిల్లలకు పది నెలల వయస్సుకు ముందు వరకే ఫార్ములా పాలను, జంతువుల పాలను తాగించడం ఆపేయాలి.
Breast feeding
పాలిచ్చే తల్లుల్లో చనుమొనల నొప్పి, రొమ్ము ఎంగోర్జ్ మెంట్, పొదుగువాపు వంటి కొన్నిసాధారణ సమస్యలు వస్తుంటాయి. వైద్యుడి సలహాలు తీసుకుంటే ఈ సమస్యలు తగ్గుతాయి.