Valentine's day: అబ్బాయిలు ఇలా ఉంటే అమ్మాయిలకు అస్సలు నచ్చరు తెలుసా?
అమ్మాయిలు, అబ్బాయిల మధ్య ప్రేమ సహజం. కానీ అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలను ఇష్టపడతారనేదే ముఖ్యం. కొన్ని అలవాట్లు, లక్షణాలున్న అబ్బాయిలను.. అమ్మాయిలు అస్సలు ఇష్టపడరట. మరి అవెంటో తెలుసుకోండి.

సాధారణంగా అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలను ఇష్టపడుతారంటే చాలా సమాధానాలే ఉంటాయి. కానీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రతి ఒక్కరూ ప్రత్యేకమే. వారి అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేక అలవాట్లు ఉంటాయి. కానీ అబ్బాయిలలో సాధారణంగా కనిపించే కొన్ని అలవాట్లు, లక్షణాల వల్ల అమ్మాయిలు వారిని ఇష్టపడరట. అవెంటో తెలుసుకోండి.
సంబంధాలపై అవగాహన
సంబంధాలపై అవగాహన, పారదర్శకత చాలా ముఖ్యం. చాలామంది అబ్బాయిలకు ఈ విషయం తెలియక తమ అభిమాన అమ్మాయిని అసంతృప్తికి గురిచేస్తుంటారు.
బలమైన సంబంధం కోసం
సంబంధం ఎక్కువ కాలం బలంగా ఉండాలంటే చిన్నచిన్న విషయాలపై కూడా దృష్టి పెట్టాలి. అబద్ధాలు చెప్పడం, అతిగా నియంత్రించడం సంబంధాన్ని బలహీనపరుస్తాయి. అలా చేయకపోవడం మంచిది.
అబద్ధాలు చెప్తే?
అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం ఎవరికీ నచ్చదు. అమ్మాయిలు ఈ విషయంలో చాలా క్లియర్ గా ఉంటారు. అమ్మాయిలు నిజాయితీపరులైన అబ్బాయిలనే ఎక్కువగా ఇష్టపడతారు.
అతిగా పొగడటం
సాధారణంగా అమ్మాయిలు పొగడ్తలకు పడిపోతారు అంటారు. కానీ, ప్రతి అమ్మాయిని పొగుడుతూ తిరిగే అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడరు. ఇది వారి ప్రవర్తనపై అనుమానం కలిగేలా చేస్తుంది.
అతిగా చూపించుకోవడం
తమ డబ్బు, ఖరీదైన వస్తువులను అతిగా చూపించుకునే అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడరు. వారు ఆత్మవిశ్వాసం ఉన్నవారిని ఇష్టపడతారు.
అతిగా నియంత్రించడం
కొంతమంది అబ్బాయిలు తమ భాగస్వామిని అతిగా నియంత్రించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అమ్మాయిలు దీనిని అస్సలు ఇష్టపడరు.
తేలికగా తీసుకోవడం
అబ్బాయి తన భాగస్వామిని తేలికగా తీసుకుంటే అమ్మాయికి అస్సలు నచ్చదు. ఆమె భావాలను నిర్లక్ష్యం చేస్తే, ఆమెకు చాలా బాధ కలుగుతుంది.