చలికాలంలో జుట్టుకు కొబ్బరి నూనె పెడితే ఏమౌతుందో తెలుసా?
చాలా మంది జుట్టు జిడ్డుగా అవుతుందని కొబ్బరినూనెనే పెట్టరు. కానీ చలికాలంలో మన జుట్టుకు అదనపు నూనె చాలా అవసరం. ఇదే మన జుట్టును తేమగా ఉంచుతుంది. పొడిబారకుండా చేస్తుంది. అసలు చలికాలంలో జుట్టుకు నూనె పెట్టడం వల్ల ఏయే లాభాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
hair oiling
మన జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే నూనె ఖచ్చితంగా పెట్టాలి. నూనెనే మన జుట్టుకు ఎంతో రక్షణ. కానీ నేటి కాలంలో చాలా మంది జుట్టుకు నూనె పెట్టడమే లేదు. దీనివల్ల చుట్టు చివర్లు చీలిపోవడం, వెంట్రుకలు తెగిపోవడం, రాలిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. అంతేకాదు నూనె పెట్టకపోవడం వల్ల జుట్టు బాగా పొడిబారుతుంది. జీవం లేనట్టుగా కనిపిస్తుంది. ఈ సమస్యలేమీ రావొద్దంటే మాత్రం ఖచ్చితంగా జుట్టుకు కొబ్బరి నూనెను పెట్టాలి.
hair oiling
ముఖ్యంగా చలికాలంలో జుట్టుకు కొబ్బరి నూనె చాలా అవసరం. ఎందుకంటే చలికాలంలోనే చుండ్రు, హెయిర్ ఫాల్, డ్రై హెయిర్ వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. అందుకే ఈ సమస్యల నుంచి బయటపడాలంటే మాత్రం వారానికి ఒక్కసారైనా జుట్టుకు కొబ్బరి నూనెను పెట్టాలి. చలికాలంలో కూడా జుట్టుకు కొబ్బరినూనెను పెట్టాలా? అని చాలా మందికి డౌట్ వస్తుంటుంది. కానీ చలికాలంలోనే మన జుట్టుకు అదనపు నూనె అవసరమవుతుంది. అదెందుకో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చలికాలంలో జుట్టుకు నూనె పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు
జుట్టుకు కొబ్బరి నూనె ఎందుకు అవసరం
నిపుణుల ప్రకారం.. చలికాలం మన జుట్టు సహజ తేమను బాగా తగ్గిస్తుంది. దీనివల్ల వెంట్రుకలు బాగా పొడిబారుతాయి. అంతేకాదు వెంట్రుకలు ఎక్కువగా తెగిపోతాయి. జుట్టు రాలుతుంది. అందుకే చలికాలంలో జుట్టుకు ఖచ్చితంగా కొబ్బరి నూనెను పెట్టాలి. నిపుణుల ప్రకారం.. వారానికి ఒకసారి జుట్టుకు కొబ్బరినూనెను పెట్టడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
చలికాలపు గాలులు ఎక్కువ పొడిగా ఉంటాయి. ఈ పొడిదనం మన నెత్తిని, జుట్టును ప్రభావితం చేస్తుంది. దీనివల్ల చాలా మందికి చుండ్రు ఎక్కువగా ఏర్పడుతుంది. అయితే కొబ్బరి నూనె మన జుట్టు కోల్పోయిన తేమను తిరిగి నింపడానికి సహాయపడుతుంది. అలాగే జుట్టును సిల్కీగా, స్మూత్ గా చేస్తుంది.
తల దురదను తగ్గిస్తుంది
చలికాలంలో నెత్తి పొడిగా, పొలుసులుగా మారుతుంది. ఈ సమస్య చలికాలంలో కామన్. ఎందుకంటే నెత్తిమీద తేమ లేకపోవడం వల్ల దురద పెడుతుంది. చికాకు కలుగుతుంది. మీరు గనుక చలికాలంలో కొబ్బరి నూనెను క్రమం తప్పకుండా నెత్తికి పెడితే నెత్తిమీద ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. అలాగే చర్మానికి పోషణ అందుతుంది. నెత్తి అసౌకర్యం , పొలుసులు, చుండ్రు తగ్గుతుంది.
జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది
మన జుట్టులోని తేమ పూర్తిగా పోయినప్పుడు వెంట్రుకలు బలహీనపడతాయి. అలాగే వెంట్రుకల చివర్లు చీలిపోయి, తెగిపోతాయి. జుట్టుకు నూనె పెట్టడం వల్ల జుట్టు తేమగా ఉంటుంది. వెంట్రుకలు తెగిపోవడం తగ్గుతుంది. కొబ్బరి లేదా ఆర్గాన్ నూనె వంటి కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే నూనెలు జుట్టు తంతువులను బలంగా చేయడానికి సహాయపడతాయి.
జుట్టును షైనీగా చేస్తుంది
చలికాలంలో మన జుట్టు జీవం లేనట్టుగా మారిపోతుంది. అయితే కొబ్బరినూనె మన జుట్టుకు సహజ ప్రకాశాన్ని అందిస్తుంది. అలాగే జుట్టును మందంగా, ఆరోగ్యంగా చేస్తుంది. గోరువెచ్చని కొబ్బరి నూనె పెడితే మన జుట్టుకు మంచి పోషణ అందుతుంది. దీంతో జుట్టు పెరుగుతుంది. బలంగా అవుతుంది. చల్ల గాలి, వెచ్చదనం వంటి ఉష్ణోగ్రతల మార్పుల వల్ల జుట్టు దెబ్బతింటుంది. అయితే నూనె ఈ ఉష్ణోగ్రత హెచ్చుతగ్గుల వల్ల కలిగే నష్టం రాకుండా కాపాడుతుంది.