MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • పొట్ట ఆరోగ్యం కోసం ఈ ఫుడ్స్ బెస్ట్....

పొట్ట ఆరోగ్యం కోసం ఈ ఫుడ్స్ బెస్ట్....

ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ వల్ల ఆహారం నుండి పోషకాలు సంబంధిత శరీర భాగాలకు బదిలీ చేయడానికి దోహదపడుతుంది. శరీరం నుండి అన్ని విషపదార్థాలు విసర్జించడానికి సహాయపడుతుంది. ఆయుర్వేదంలో జీర్ణక్రియ, పొట్ట ఆరోగ్యం గురించి చాలా ప్రాముఖ్యత ఉంది. 

3 Min read
Bukka Sumabala
Published : Aug 16 2021, 05:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

పొట్ట ఆరోగ్యంగా ఉంటే ఏ జబ్బులూ దరిచేరవు. ఎలాంటి అనారోగ్యానికీ గురి కారు. అందుకే ఈ మధ్య కాలంలో 'గట్ హెల్త్' కి చాలా ప్రాధాన్యత పెరిగింది. జీర్ణాశయాంతర పేగులు మానవ శరీరానికి చాలా ముఖ్యమైనది. మీరు తినే ఆహారం పేగుల ద్వారా రవాణా అవుతుంది. ఆహారాన్ని శరీరంలోకి శోషించదగిన పోషకాలుగా మారుస్తుంది. ఆ తరువాత మీ శరీరం నుండి అన్ని వ్యర్థాలను బయటకు పంపుతుంది.

29

జీర్ణశయాంతర ప్రేగులోని వివిధ భాగాలలో బ్యాక్టీరియాను సంతులనం చేయడం.. దాని పనితీరు మీదే గట్ హెల్త్ ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ వల్ల ఆహారం నుండి పోషకాలు సంబంధిత శరీర భాగాలకు బదిలీ చేయడానికి దోహదపడుతుంది. శరీరం నుండి అన్ని విషపదార్థాలు విసర్జించడానికి సహాయపడుతుంది. ఆయుర్వేదంలో జీర్ణక్రియ, పొట్ట ఆరోగ్యం గురించి చాలా ప్రాముఖ్యత ఉంది. పొట్ట ఆరోగ్యానికి మనసుకు లింక్ పెడుతుంది. 

39

పొట్ట అనారోగ్యానికి గురికావడం అంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎలాంటి సంకేతాలు ఉంటాయి.ఆరోగ్యకరమైన గట్‌లో రోగనిరోధక కణాలు, ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉంటాయి. వైరస్‌లు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు వంటి అంటు వ్యాధులకు చికిత్స చేయడంలో ఇవి మంచి పాత్ర పోషిస్తాయి. అలాగే, ఇది మీ హార్మోన్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అతిసారం, మలబద్ధకం మొదలైన కొన్ని జీర్ణ సమస్యలను నివారిస్తుంది.

పొత్తి కడుపు నొప్పి,  మలం నల్లగా ఉండడం, దీర్ఘకాలిక మలబద్ధకం, విరేచనాలు, ఉబ్బరం, బరువు తగ్గడం లేదా పెరగడం, తినాలనిపించకపోవడం, తామర లాంటి చర్మరోగాలు, అలసటగా ఉండడం ఇవన్నీ పొట్ట అనారోగ్యానికి సూచికలు.  

49

అనారోగ్యకరమైన గట్ వల్ల అధిక ఒత్తిడి స్థాయిలు, నిద్ర లేకపోవడం, ప్రాసెస్ చేయబడిన చక్కెర కలిగిన ఆహారాలు లేదా యాంటీబయాటిక్స్ అధిక వినియోగం ఇవన్నీ దీనికి దోహదం చేస్తాయి. దీన్నుంచి బయటపడాలంటే మీ పొట్టను అనారోగ్యానికి గురిచేసే లక్షణాలకు చికిత్స చేయాలి. పేలవమైన ఆహారం, నిశ్చల జీవనశైలి, ఒత్తిడి, కొన్ని ఔషధాల దుష్ప్రభావాలు, పనికిరాని లేదా అతిగా పనిచేసే థైరాయిడ్ గ్రంథి, తగినంత నిద్ర తీసుకోకపోవడం, ఏదైనా తింటే పడకపోడం లాంటి కారణాల వల్ల పొట్ట ఆరోగ్యం దెబ్బ తింటుంది.  దీనికోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 

59

ఒత్తిడి స్థాయిలను తగ్గించుకోవాలి. పొట్టకు, మెడదుకు లింక్ ఉంటుంది. మీ భావోద్వేగాల ప్రభావం వాటిమీద పడుతుంది. కాబట్టి,  భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. ఒత్తిడి మీ గట్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మీ ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి యోగా లేదా ధ్యానం సాధన చేయండి. నెమ్మదిగా తినాలి. సరిగ్గా నమలుతూ నెమ్మదిగా తినాలి. దీనివల్ల ఆహారం నుండి శరీరం  పోషకాలను గ్రహించడానికి సహాయపడుతుంది. కడుపు ఉబ్బరం లేదా మలబద్ధకం ఉన్నట్లయితే,  ఆహారంపై సరైన శ్రద్ధ పెట్టాలని గుర్తుంచుకోవాలి. 

69

సరిగా నిద్రపోవడం:  కనీసం 7-8 గంటలు నిద్రపోవడం ముఖ్యం. సరైన నిద్ర లేకపోవడం హార్మోన్లకు భంగం కలిగిస్తుంది. మీ ఒత్తిడి స్థాయిలను పెంచుతుంది. గట్‌ను నేరుగా ప్రభావితం చేస్తుంది. దీనికోసం బాగా నిద్రపోవాలి. ఎక్కువ గంటల విశ్రాంతి తీసుకునేలా జాగ్రత్త పడాలి. గట్‌లో మంచి బ్యాక్టీరియాను సమతుల్యం చేయాలనుకుంటే, తగినంత నీరు తాగాలి. మీరు ప్రతిరోజూ 7-8 గ్లాసుల నీటిని తాగేలా చూసుకోండి. హైడ్రేషన్ వల్ల అనేక సమస్యలు పరిష్కరించబడతాయి.

మీ శరీరానికి పడనివి ఏమిటో గుర్తించి వాటిని అవాయిడ్ చేయాలి. ఏ ఆహారంతో మీకు అలెర్జీ వస్తుందో తెలుసుకోవాలి. సాధారణ ఆహార అలెర్జీలలో పాల ఉత్పత్తులు, గింజలు, గ్లూటెన్ మొదలైన వాటితో వస్తాయి. దేనివల్ల మీకు సమస్య ఉందో తెలుసుకోవాలంటే ఆయా ఆహారపదార్థాలను కొద్ది రోజులు మానేసి గమనించాలి. అప్పుడు మీ పొట్ట బాగుంటే.. వాటిని పూర్తిగా దూరం పెట్టాల్సిందే. 

79

మీరు తీసుకునే ఆహారం మీ జీవనశైలిని పట్టిస్తుంది. గట్ ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, రిఫైన్డ్ షుగర్, అధిక ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం తగ్గించాలి.
అలాగే, వారానికి కనీసం 3-4 సార్లు వ్యాయామం చేయాలి.  యోగా, వాకింగ్, రన్నింగ్, వెయిట్-ట్రైనింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్ లాంటివి చేయవచ్చు. మరి పొట్ట ఆరోగ్యాన్ని సరిచేసే ఆహారపదార్థాలు ఏవీ అంటే.. 

మీ గట్‌ను నయం చేయడానికి వెంటనే పరిష్కారం లేదు, కానీ కొన్ని రకాల ఆహారాలు మీ పొట్టను చికిత్స చేయడానికి సహాయపడవచ్చు. లీన్ ప్రోటీన్, బీన్స్, చిక్కుళ్ళు, బెర్రీలు, పచ్చి ఆకు కూరలు, ఓట్స్, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు మీ భోజనంలో ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన గట్‌ కోసం ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ కూడా ముఖ్యమైనవి. కిమ్చి, పెరుగు, కేఫీర్ లాంటి పులియబెట్టిన ఆహారాలు ప్రోబయోటిక్స్ కు బెస్ట్ సోర్సెస్.

89

ప్రీబయోటిక్ ఆహారాలలో వోట్స్, తృణధాన్యాలు, సోయాబీన్స్, బార్లీ, ఇసాబ్గోల్ (సైలియం), అవిసె గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, మెంతి గింజలు, క్యారెట్లు, సిట్రస్ పండ్లలాంటివి ఉన్నాయి. 

ఇక మీరు దీర్ఘకాలిక జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నట్లయితే, వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. వీలైనంత త్వరగా చికిత్స తీసుకోవాలి. సమస్య మీరు మూల కారణాన్ని గుర్తించి, ఆపై చికిత్స చేయడం ద్వారా పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనికి చాలా సమయం పడుతుంది. కొన్నిసార్లు నెలల తరబడి చికిత్స అవసరమవ్వచ్చు. ఓపికగా ఉండాలి. 

99

ప్రీబయోటిక్ ఆహారాలలో వోట్స్, తృణధాన్యాలు, సోయాబీన్స్, బార్లీ, ఇసాబ్గోల్ (సైలియం), అవిసె గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, మెంతి గింజలు, క్యారెట్లు, సిట్రస్ పండ్లలాంటివి ఉన్నాయి. 

ఇక మీరు దీర్ఘకాలిక జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నట్లయితే, వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. వీలైనంత త్వరగా చికిత్స తీసుకోవాలి. సమస్య మీరు మూల కారణాన్ని గుర్తించి, ఆపై చికిత్స చేయడం ద్వారా పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనికి చాలా సమయం పడుతుంది. కొన్నిసార్లు నెలల తరబడి చికిత్స అవసరమవ్వచ్చు. ఓపికగా ఉండాలి. 

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Ragi Java: చలికాలంలో రాగి జావ తాగితే ఏమౌతుంది?
Recommended image2
Simple Muggulu: వాకిట్లో నిండుగా మెలికల ముగ్గులు, ఇవిగో సింపుల్ రంగోలీ
Recommended image3
ఉదయమా లేదా రాత్రా..? చల్లని బీర్ తాగడానికి మంచి సమయం ఏది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved