ఫ్రిజ్ లో నిమ్మకాయ పెడితే ఏమౌతుందో తెలుసా?
ఫ్రిజ్ లో మనం పండ్లు, కూరగాయలతో పాటుగా మిగిపోయిన చపాతీలు, కూరలను కూడా పెట్టేస్తుంటాం. ఇదంతా బానే ఉన్నా చాలా సార్లు ఫ్రిజ్ లో ఉన్నవాటిని చూడకపోయే సరికి అవి మురిగిపోయి వాసన వస్తుంటుంది.
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్ ఖచ్చితంగా ఉంటుంది. కొంతమంది ఫ్రిజ్ లో ఏవి పెట్టాలో అవే పెడుతుంటే.. మరికొంతమంది దాన్ని ఖాళీ లేకుండా పండ్లు, కూరగాయలు, వంటింటి సామాన్లతో నింపేస్తుంటారు. కానీ ఫ్రిజ్ లో ఏవి పడితే అవి పెట్టకూడదు. ఇకపోతే చాలా మంది ఫ్రిజ్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటారు. మరికొంతమంది దాంట్లోంచి వాసన వచ్చినప్పుడే శుభ్రం చేస్తుంటారు. కానీ ఫ్రిజ్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడమే మంచిది. లేదంటే మీ ఫ్రిజ్ తొందరగా పాడవడమే కాకుండా.. మీరు తినే ఫుడ్ ను కూడా పాడు చేస్తుంది.
నిపుణుల ప్రకారం.. ఫ్రిజ్ లో నిమ్మకాయ ముక్కను పెట్టడం చాలా మంచిదని చెప్తారు. నిజానికి నిమ్మకాయలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అందుకే వీటిని మనం ఆరోగ్యంగా ఉండటానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నో విధాలుగా ఉపయోగిస్తుంటాం. అలాగే దీన్ని శుభ్రం చేయడానికి కూడా వాడుతుంటాం. అయితే ఫ్రిజ్ లో ఒక చిన్న నిమ్మకాయ ముక్కను ఫ్రిజ్ లో పెడితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
fridge
ఫ్రిజ్ వాసనను పోగొడుతుంది
ఫ్రిజ్ లో మనం ఏవేవో పదార్థాలను పెట్టేస్తుంటాం. అలాగే వాటిని చాలా రోజుల వరకు చూడకుండా వదిలేస్తుంటాం. దీనివల్లే ఫ్రిజ్ నుంచి దుర్వాసన వెదజల్లుతుంటుంది. కానీ ఫ్రిజ్ లోంచి వచ్చే ఘాటైన మురికి వాసన దాని దగ్గరకు కూడా రానీయదు. అయితే ఈ దుర్వాసనను పోగొట్టడానికి నిమ్మకాయ బాగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఫ్రిజ్ లో నిమ్మకాయ ముక్కను ఎలా పెట్టాలి?
ఫ్రిజ్ లో నుంచి వచ్చే దుర్వాసనను పోగొట్టడానికి ముందుగా ఒక నిమ్మకాయను తీసుకుని దానిని మధ్యలోకి కట్ చేయండి. ఈ నిమ్మకాయ ముక్కను ఫ్రిజ్ లో ఉంచండి. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది ఫ్రిజ్ నుంచి వచ్చే దుర్వాసనను, చెడు వాసనలను పోగొట్టడానికి బాగా సహాయపడుతుంది.
fridge
ఫ్రిజ్ ను శుభ్రంగా ఉంచుకోవాలి
ఫ్రిజ్ లో నుంచి దుర్వాసన రాకూడదంటే మాత్రం ఇంట్లో ఉన్న ఇతర వస్తువుల మాదిరిగానే ఫ్రిజ్ ను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. అలాగే దానిలో ఎప్పుడూ ఒక ఫ్రెష్ నిమ్మకాయ ముక్కను ఉంచాలి. నిమ్మకాయ ఫ్రిజ్ నుంచి ఫ్రెష్ స్మెల్ వచ్చేలా చేయడానికి సహాయపడుతుంది.
సంక్రమణ నుంచి రక్షిస్తుంది
నిమ్మకాయ మన ఆరోగ్యానికి కాపాడటానికి కూడా బాగా సహాయపడుతుంది. నిమ్మకాయలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అన్ని రకాల ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అంటే నిమ్మకాయ ముక్కను ఫ్రిజ్ లో పెట్టడం వల్ల ఫ్రిజ్ లోకి చెడు బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు రాకుండా చేస్తుంది. అలాగే నిమ్మకాయ ముక్కఫ్రిజ్ ను మురికికి దూరంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది.
Image Courtesy: YinYang/Getty Images
ఆహారాన్ని తాజాగా ఉంచుతుంది
ఫ్రిజ్ లో ఉన్న పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారాలు ఎక్కువ రోజులు తాజాగా, నిల్వ ఉండటానికి కూడా నిమ్మకాయ సహాయపడుతుంది. ఒక చిన్న నిమ్మకాయ ముక్కను ఫ్రిజ్ లో పెట్టడం వల్ల అందులో ఉన్న ఆహారం ఎక్కువ సేపు తాజాగా ఉంటుంది. నిమ్మకాయలో ఉండే లక్షణాలు ఆహారం కుళ్లిపోకుండా చేస్తుంది.
refrigerate
సంక్రమణ నుంచి రక్షిస్తుంది
ఫ్రిజ్ లో పెట్టిన చిన్న నిమ్మకాయ ముక్క ఫ్రిజ్ లో ఉన్న ఆహారాన్ని బ్యాక్టీరియా నుంచి రక్షించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అలాగే దీనివల్ల ఆహారంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ ను వ్యాప్తి చేయదు. వీటిని తింటే మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు.
ఫ్రిజ్ లోని గాలిని శుభ్రం చేస్తుంది
ఫ్రిజ్ లో గాలి శుభ్రంగా ఉండదు. కానీ మీరు గనుక ఒక చిన్న నిమ్మకాయ ముక్కను ఫ్రిజ్ లో పెడితే.. లోపల గాలి శుభ్రపడుతుంది. దీనికి కారణం నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటమే.