రాత్రి సమయంలో వీటిని తీసుకుంటే సులువుగా బరువు తగ్గుతారు తెలుసా..?
Weight Loss Tips : బరువు తగ్గాలనుకునే వారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అప్పుడే అధిక బరువు నుంచి తొందరగా బయటపడగలుగుతారు.

weight loss
ఈ ఆధునిక కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది అధిక బరువు సమస్య బారిన పడుతున్నారు. దీనికి తోడు కరోనా మహమ్మారి నుంచి అధిక బరువు సమస్య బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. ఈ సమస్య వల్ల ఎంతో మంది అర్దాంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అధిక బరువు కారణంగా ఊబకాయం, గుండె జబ్బులు వంటి ప్రమాదకరమైన వ్యాధులు సోకే ప్రమాదం ఉంది.
అందుకే అధిక బరువుతో బాధపడేవారు వ్యాయామాలు చేస్తూ ప్రత్యేకమైన డైట్ ను ఫాలో అవుతుంటారు. అయితే ఈ డైటింగ్ లో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే బరువు తగ్గడమేమో గానీ ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
weight loss
బరువు తగ్గడం కోసం డైట్ ను ఫాలో అవుతున్న వాళ్లు ఎక్కువగా పీచు పదార్థాలను, సలాడ్లను తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా మంది సలాడ్లను పక్కన పెట్టేస్తూ నోటికి రుచిగా ఉండే ఆహారాలను తీసుకుంటూ ఉంటారు. వాటిలో ఉండే కొవ్వులు బరువు ను మరింత పెంచుతాయి కానీ.. తగ్గించవు.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. డైటింగ్ సమయంలో చాలా తక్కువగా ఆహారాన్ని తీసుకుంటారు. అప్పుడు మీ శరీరానికి కావాల్సిన శక్తి అందదు. దాంతో మీరు నీరసంగా మారిపోయే ప్రమాదం ఉంది. అందుకే డైటింగ్ చేసేవారు 80 నుంచి 120 కేలరీల ఆహారపదార్థాలను తీసుకోవడం మర్చిపోకూడదు.
ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలు, సలాడ్లు బరువు తగ్గేందుకు ఎంతో సహాయపడతాయి. కానీ బయట లభించే సలాడ్లలో కొన్ని ఆయిల్స్ ను కలుపుతుంటారు. దాంతో మీ బరువు తగ్గే ప్రాసెస్ మధ్యలోనే ఆగిపోవచ్చు. ముఖ్యంగా ఇతరులు తయారుచేసిన ఆహారాలను తరచుగా తీసుకోవడం మానేయండి. వీటిని తీసుకోవడం వల్ల మీరు బరువు తగ్గకపోవచ్చు.
ఇతర ఆహారాలకంటే పండ్లను ఎక్కువగా తినండి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని బాగా నమిలి తింటే మంచిది. ముఖ్యంగా ఆహార పదార్థాలను తినేటప్పుడు ఫోన్ కానీ, టీవీ కానీ చూడటం మానేయండి. వీటిని చూస్తూ తింటే మీరు మరింత బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
మీ రోజు వారి ఆహారంలో ప్రోటీన్, ఫైబర్ ఖచ్చితంగా ఉండేట్టు చూసుకోవాలి. పండ్లు మంచివని మోతాదుకు మించి తింటే మాత్రం విపరీతంగా బరువు పెరిగే అవకాశం ఉంది. ఆకు కూరలను కూడా అతిగా తినకూడదు. కడుపు నిండుగా ఎప్పుడూ తినకూడదు. మీ కడుపు 20 శాతం ఖాళీగా ఉండేట్టు తింటేనే మీ బరువు నియంత్రణలో ఉంటుంది.
రాత్రి భోజనంలో పచ్చి ఆకు కూరగాయలతో తయారుచేసిన సలాడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మీ శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది కూడా. కానీ చాలా మంది ఇది నిజం కాదని అపోహపడిపోతుంటారు.