వోడ్కా తో జుట్టుకు బోలెడు లాభాలు.. దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా?
వోడ్కాలో మనకు తెలియని ఎన్నో ప్రయోజనాలు దాగున్నాయి. దీన్ని ఉపయోగించి ఎన్నో జుట్టు సమస్యలను పోగొట్టుకొచ్చంటున్నారు నిపుణులు. ఈ వోడ్కా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. చుండ్రును తగ్గిస్తుంది. అలాగే సిల్కీగా కూడా మారుస్తుంది.

hair care
చాలా మంది వోడ్కాను ఇష్టంగా తాగుతారు. అయితే దీన్ని తాగడానికే కాకుండా.. ఇతర ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించొచ్చంటున్నారు నిపుణులు. అవును వోడ్కా జుట్టు సంరక్షణ కోసం ఉపయోగపడుతుంది. ఇది మీ జుట్టును షైనీగా చేస్తుంది. అలాగే చుండ్రును తగ్గిస్తుంది. అంతేకాదు ఇది మీ జుట్టు ఆరోగ్యంగా, పొడుగ్గా పెరిగేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అసలు వోడ్కాతో జుట్టుకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
hair care
హెయిర్ వాష్ గా..
వోడ్కా ఒక అద్భుతమైన హెయిర్ వాష్. ఇది మీ జుట్టులోని మలినాలను తొలగించడానికి సహాయపడుతుంది. ఇందుకోసం రెండు టేబుల్ స్పూన్ల వోడ్కాను ఒక కప్పు నీటిలో మిక్స్ చేయండి. మీ జుట్టును షాంపూతో కడిగిన తర్వాత చివరి వాష్ గా ఈ వోడ్కాను ఉపయోగించండి. వోడ్కాలోని ఆల్కహాల్ ఏదైనా ఇతర మలినాలను తొలగించడానికి సహాయపడుతుంది. మీ జుట్టును శుభ్రంగా, అందంగా మెరిసేలా చేస్తుంది.
hair care
స్కాల్ప్ ట్రీట్ మెంట్ గా..
మీకు చుండ్రు లేదా నెత్తిమీద ఏదైనా సమస్య ఉందా? అయితే మీరు వోడ్కాను ఖచ్చితంగా ఉపయోగించాల్సిందే.. ఎందుకంటే వోడ్కా సమర్థవంతమైన చికిత్స. ఇందుకోసం వోడ్కా, నీటిని సమాన భాగాలుగా చేసి రెండింటినీ కలపండి. దీన్ని నేరుగా మీ నెత్తికి అప్లై చేయండి. తర్వాత తలను కాసేపు మసాజ్ చేసి 30 నిమిషాల పాటు అలాగే  వదిలేయండి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. 
 
hair care
హెయిర్ మాస్క్ గా..
మీ జుట్టుకు పోషకాలను అందించడానికి, బలోపేతం చేయడానికి హెయిర్ మాస్క్ లో వోడ్కాను కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో ఒక గుడ్డు పచ్చసొన, ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ వోడ్కా ను కలపండి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టు, నెత్తిమీద అప్లై చేసి 20 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.
 
Image: Getty Images
అందమైన జుట్టుకు..
వోడ్కా జుట్టును అందంగా మార్చడానికి కూడా సహాయపడుతుంది. ఇందుకోసం ఒక కప్పు నీటిలో రెండు టేబుల్ స్పూన్ల వోడ్కా మిక్స్ చేసి జుట్టు మూలాలపై స్ప్రే చేయండి. వోడ్కాలోని ఆల్కహాల్ మీ జుట్టు మూలాలను ఎత్తడానికి సహాయపడుతుంది. ఇది మీ జుట్టు ఒత్తుగా, గుబురుగా కనిపించడానికి సహాయపడుతుంది. 
 
జుట్టు రాలడాన్ని నివారించడానికి..
జుట్టుకు వోడ్కాను ఉపయోగించడం వల్ల కూడా మీ జుట్టు రాలే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. ఇందుకోసం రెండు టీస్పూన్ల ఆముదం నూనెలో ఒక టీస్పూన్ వోడ్కా మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని తలకు పెట్టి మసాజ్ చేయండి. ఒక గంట పాటు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.