Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi mynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • పప్పులకు పురుగు పట్టకూడదంటే ఏం చేయాలి?

పప్పులకు పురుగు పట్టకూడదంటే ఏం చేయాలి?

ఒక్క బియ్యానికే కాదు.. పప్పు దినుసులకు కూడా పురుగు పడుతుంటుంది. ఇక ఈ పురుగును పోగొట్టేందుకు ఎంతో తిప్పులు పడుతుంటారు ఆడవారు. అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో పప్పు దినుసులకు అసలు పురుగే పట్టకుండా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.  

Shivaleela Rajamoni | Updated : Feb 09 2024, 10:56 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Pulses

Pulses

బియ్యం, మసాలా దినుసుల నుంచి పప్పు దినుసుల వరకు.. వంటింట్లో ఉండే కొన్ని ఆహార పదార్థాలకు పురుగులు పడుతుంటాయి. కొన్ని రోజుల వరకు వీటిని చూడలేదంటే.. పురుగులు పప్పును మొత్తం తినేస్తాయి. అలాగే పనికి రాకుండా చేస్తాయి. కానీ ఒక్కసారి వీటికి పురుగుపట్టిందంటే.. వీటి సంఖ్య పెరిగిపోతూనే ఉంటుంది. ఎంత చేసినా ఈ పురుగును మాత్రం వదిలించలేం. అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో పప్పు దినుసులకు పురుగులు, కీటకాలు పట్టకుండా చేయొచ్చు. ఎలాగంటే? 

27
Asianet Image

వేపాకులు

వేపాకుల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆకులు కీటకాలను తరిమి కొట్టడానికి ఎంతో ఉపయోగపడతాయి. అందుకే వీటిని ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. పప్పు ధాన్యాలను పురుగులు పట్టకుండా ఉండాలంటే వేపాకులను ఉపయోగించండి. ఇందుకోసం పప్పు దినుసుల డబ్బాలో ఎండిపోయిన వేపాకులను వేయండి. ఒక్క పప్పు దినుసుల్లోనే కాదు, ఎండు వేప ఆకులను  కూడా అల్మారాల్లో ఉంచొచ్చు. వీటివల్ల మీ బట్టలు దెబ్బతినవు. 

37
Asianet Image

వెల్లుల్లి

వెల్లుల్లి కూడా పురుగులను తరిమేయడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం పప్పు డబ్బాలో కొన్ని పచ్చి వెల్లుల్లి రెబ్బలను వేయండి. ఒక పప్పు డబ్బాలో 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలను వేయొచ్చు. వెల్లుల్లి రెబ్బలు పప్పులోకి పురుగు రాకుండా చేస్తుంది.

47
Asianet Image

లవంగాలు

లవంగాలను చాలా ఆహారాల్లో ఉపయోగిస్తుంటారు. ఇవి ఫుడ్ రుచిని పెంచడమే కాదు..  కీటకాల నుంచి పప్పు దినుసులను కాపాడటానికి కూడా సహాయపడుతుంది. ఇందుకోసం మీరు చేయవలసిందల్లా.. పప్పు డబ్బాలో 8 నుంచి 10 లవంగాలను వేయండి. అయితే ఈ డబ్బాలోకి గాలి వెళ్లకుండా చూసుకోవాలి. 
 

57
Asianet Image

ఎండ

పప్పు దినుసుల్లో పురుగును గమనించినట్టైతే ఒక పెద్ద ప్లేట్  లేదా గుడ్డను తీసుకుని ఎండలో పరిచి పప్పును పోయండి.  2 నుంచి 3 రోజులు ఈ పప్పును ఎండలోనే ఉంచండి. మీక తెలుసా? చల్లని, చీకటి ప్రదేశాల్లో కీటకాలు బాగా పెరుగుతాయి. అందుకే పప్పును ఎండలో ఉంచండి. పప్పు దినుసులకు కీటకాలు పట్టకుండా నెలకొకసారి ఎండలో పెడుతూ ఉండండి. 
 

67
Asianet Image

ఎండు మిరపకాయలు

అవును ఎండు మిరపకాయలు కూడా పప్పు దినుసులకు పురుగు పట్టుకుండా చేస్తుంది. ఇందుకోసం మీరు 2 నుంచి 3 ఎండు మిరపకాయలను తీసుకుని పప్పు డబ్బాలో వేయండి. 
 

77
Fridge Clean

Fridge Clean

ఫ్రిజ్

మీ ఫ్రిజ్లో ప్లేస్ ఉంటే పప్పు ధాన్యాలను పెట్టేయండి. తక్కువ మొత్తంలో పప్పును ఫ్రిజ్ లో నిల్వ చేయొచ్చు. దీనివల్ల పప్పుకు పురుగులు అస్సలు పట్టవు. అలాగే పప్పు దినుసులు కూడా తాజాగా ఉంటాయి. కానీ  గాలి వెళ్లని కంటైనర్ లోనే స్టోర్ చేయాలి. 

Shivaleela Rajamoni
About the Author
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు. Read More...
ఆరోగ్యం
 
Recommended Stories
Top Stories