మొటిమలు, నల్ల మచ్చలు తగ్గాలా? అయితే ఈ టమాటా ఫేస్ ప్యాక్ లను ట్రై చేయండి
టమాటాలు యాంటీ ఆక్సిడెంట్లకు, విటమిన్ సి కి గొప్ప వనరు. టమాటాలు చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. టమాటా ఫేస్ ప్యాక్ వల్ల మొటిమలు, మొటిమల మచ్చలు తగ్గిపోతాయంటున్నారు నిపుణులు.
- FB
- TW
- Linkdin
Follow Us

టమోటాల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి 6, ఫోలేట్, థియామిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో మాంగనీస్, పొటాషియం, భాస్వరం, మెగ్నీషియం, రాగి, ఫైబర్స్, ప్రోటీన్, లైకోపీన్ వంటి సేంద్రీయ సమ్మేళనాలు కూడా ఉంటాయి.
టమాటాలు విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లకు గొప్ప మూలం. టమోటాలు చర్మ ఆరోగ్యానికి ఎంతో మంచిది. టమోటాలతో చేసిన ఫేస్ ప్యాక్ వల్ల ఎన్నో చర్మ సమస్యలు తగ్గిపోతాయి. ఇది చర్మ సంరక్షణకు ఎంతో సహాయపడుతుంది. మొటిమలు, మొటిమల మచ్చలు, ముడతలు, బ్లాక్ హెడ్స్ వంటి నల్లటి మచ్చలను నివారించడానికి టమోటా ఫేస్ ప్యాక్ బాగా సహాయపడుతుంది. టమాటా ఫేస్ ప్యాక్ లను ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
టమాటా రసం, కీరదోసకాయ రసం
ఒక టేబుల్ స్పూన్ టమోటా జ్యూస్ లో ఒక టేబుల్ స్పూన్ కీరదోసకాయ రసాన్ని, ఓట్ మీల్ వేసి బాగా కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి కొద్దిసేపు మసాజ్ చేయండి. 10 నిమిషాల తర్వాత ముఖాన్ని నీట్ గా కడిగేసుకోండి. ఈ ప్యాక్ మొటిమల నల్ల మచ్చలను తొలగించడానికి సహాయపడుతుంది.
టమాటా జ్యూస్, పంచదార
టొమాటో జ్యూస్ లో ఒక టీస్పూన్ పంచదారను వేసి కలగలపండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి కాసేపు రుద్దండి. 15-20 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడిగేయండి. బయటకు వెళ్లినప్పుడు ఇలా చేయడం వల్ల ముఖంపై మొటిమలు తొలగిపోతాయి. ముఖం తాజాగా కూడా కనిపిస్తుంది.
టమాటా రసం, పెరుగు
పెరుగులో రెండు టేబుల్ స్పూన్ల టమోటా రసాన్ని కలిపి ముఖానికి అప్లై చేయండి. ఇది ఆరిన తర్వాత ముఖాన్ని కడగండి. ఈ ఫేస్ ప్యాక్ ముఖంపై ఉన్న ఎరుపుదనాన్ని తొలగించి బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది.
tomato face pack
టమాటా జ్యూస్, నిమ్మరసం
రెండు టేబుల్ స్పూన్ టొమాటో జ్యూస్ లో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడగండి. ఈ ఫేస్ ప్యాక్ నల్ల మచ్చలను పోగొడుతుంది. మొటిమలను తగ్గిస్తుంది.