Coronavirus Vs Allergies: ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్ట్ చేయించుకోండి.. లేదంటే..?
Coronavirus Vs Allergies: తీవ్రమైన తలనొప్పి, ముక్కు కారడం, తుమ్ములు, ముక్కు దిబ్బడ, కళ్ల నుంచి నీళ్లు కారడం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా టెస్ట్ చేయించుకోండి.

Coronavirus Vs Allergies: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. కరోనా వైరస్ మనల్ని పూర్తిగా వదిలిపోలేదన్న సంగతి మనం మర్చిపోకూడదు. రోజువారిగా చూసుకున్నట్టైతే కోవిడ్ -19 కేసులు జనవరిలో నమోదైన విధంగా ఇప్పుడు నమోదు కావడం లేదు. ఇక ఇప్పటికి వచ్చిన కొత్త వేరియంట్లు సరిపోవన్నట్టుగా రోజు రోజుకు కొత్త కొత్త వేరియంట్లు వచ్చి ప్రజలను తీవ్ర భయ భ్రాంతులకు గురిచేస్తున్నాయి.
ప్రస్తుతం కొత్త వేరియంట్ అయిన స్టెల్త్ ఒమిక్రాన్ ( Stealth Omicron) గా పిలువబడే ఒమిక్రాన్ యొక్క బిఎ.2 సబ్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఈ వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వేరియంట్ లక్షణాలు కొన్ని అలెర్జీని పోలి ఉన్నాయి. దీంతో జనాలు తీవ్రమైన గందరగోళానికి గురవుతూ.. ఏటూ తేల్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు.
Coronavirus మరియు springtime allergy..
కరోనా వైరస్ ఇన్ఫెక్షన్, స్ప్రింగ్ టైమ్ అలెర్జీ రెండూ కూడా శ్వాసకోస వ్యవస్థకు సంబంధించిన సమస్యలే. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కరోనా వైరస్ కుటుంబానికి చెందిన వైరస్ తో సోకితే.. స్ప్రింగ్ టైమ్ అలెర్జీ మాత్రం చెట్లు లేదా పొప్పొడి వల్ల సోకుతుంది. అయితే రెండు సమస్యల వల్ల సాధారణంగా ఈ లక్షణాలు కనిపిస్తాయి.
తలనొప్పి
అలసట
తుమ్ములు రావడం
దగ్గు రావడం
దురద పెట్టడం
కళ్ల నుంచి నీళ్లు కారడం
ముక్కు దిబ్బడ లేదా ముక్కు కారడం
కరోనా టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలి..
కరోనా వైరస్ ఇన్ఫెక్షన్, స్ప్రింగ్ టైమ్ అలెర్జీ రెండింటి లక్షణాల మధ్య తేడాను గుర్తించడం చాలా కష్టమైన పనే. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ లక్షణాలు, కాలానుగుణంగా వచ్చే అలెర్జీ యొక్క లక్షణాలు సాధారణంగా ఒకేలా ఉన్నాయి. అయితే అలెర్జీ కొన్ని రోజుల తర్వాత తగ్గుముఖం పడుతుంది. అదే కొవిడ్ రానురాను తీవ్రమైన ఆనారోగ్య సమస్యగా మారుతుంది. దీనికి సకాలంలో చికిత్స తీసుకోకపోతే ఫ్యూచర్ లో మీరు ధీర్ఘకాలిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ ప్రమాదం పిల్లలకు, వృద్ధులకు ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు టెస్ట్ తప్పక చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఒకప్పుడు కరోనా ఎక్కడ సోకుతుందోనన్న భయంతో జనాలు ఇండ్ల నుంచి బయటకు రావడానికి భయపడిపోయే వారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పెళ్లిళ్లు, ఫంక్షన్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, షాపింగ్ వంటి మాల్స్ వంటి రద్దీగా ఉండే ప్లేసెస్ లో తిరుగుతున్నారు. ఇటువంటప్పుడు మీరు కరోనా జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నా కానీ ఇంటికి వెళ్లిన తర్వాత మీకు మీరుగా ముందస్తు జాగ్రత్తగా కరోనా టెస్ట్ ను చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
చిన్నపిల్లలకు, వృద్ధులకు ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది. వీరికి అంటువ్యాధులు సులభంగా సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది. అటువంటప్పుడు వారు బయటకు వెళ్లివచ్చినప్పుడు ఖచ్చితంగా టెస్టులు చేయించుకోవాలి.
శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతూ ట్యాబ్లెట్లను వేసుకున్నా.. తగ్గకపోతే వెంటనే వైధ్యుడిని సంప్రదించి ఆర్టిపీసీఆర్ టెస్ట్ ను చేయించుకోవడం ఉత్తమం. లక్షణాలు తీవ్రస్థాయిలో కనిపించకపోయినా.. టెస్ట్ ను తప్పనిసరిగా చేయించుకోండి. పరిస్థితి విషమించేదాకా చూడొద్దు..