Temple: గుడికి వెళ్లి వచ్చేటప్పుడు ఈ పనులు చేస్తే.. పూజ చేసినా పుణ్యం దక్కదటా!
గుడి.. మనసుకు హాయిని, ప్రశాంతతను ఇచ్చే చోటు. ఎన్ని కష్టాలున్నా, బాధలున్నా దేవాలయంలో కూర్చుంటే చాలు.. మనసుకు ఆనందంగా ఉంటుంది. సాధారణంగా మనం గుడికి వెళ్లేటప్పుడు పూజకు కావాల్సిన వస్తువులు తీసుకెళ్తుంటాం. కానీ వచ్చేటప్పుడు గుడి నుంచి ఏం తీసుకురావాలో? తీసుకురాకూడదో మీకు తెలుసా? అయితే తెలుసుకోండి మరి.
- FB
- TW
- Linkdin
Follow Us

గుడి చాలా పవిత్రమైన, ప్రశాంతమైన ప్రదేశం. చాలా మంది వారంలో 2, 3 సార్లు గుడికి వెళ్తుంటారు. కొందరైతే ఉదయం, సాయంత్రం కూడా దగ్గర్లోని గుడికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకొని కాసేపు అలా గడిపి వస్తుంటారు. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం దేవాలయం నుంచి ఇంటికి తిరిగి రావడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గుడినుంచి ఖాళీ కుండను తెస్తే?
బిందెలోగాని, కుండలోగాని నీరు తీసుకొని గుడికి వెళ్తే, పూర్తి భక్తితో ఆ నీటిని దేవుడికి అర్పించిన తర్వాత ఖాళీ కుండను ఇంటికి తీసుకువెళ్లకండి. దానికి బదులుగా గుడి నుంచి బయలుదేరే ముందు ఆ కుండలో ఒక పండు లేదా పువ్వును ఉంచాలి. దేవాలయం నుంచి ఖాళీ కుండను ఎప్పుడూ ఇంటికి తీసుకురాకూడదని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు.
గుడినుంచి దీపాన్ని తీసుకువస్తే?
దేవాలయంలో దేవుని ముందు మట్టి దీపం వెలిగిస్తే తప్పులేదు. కానీ ఇత్తడి లేదా రాగి దీపం వెలిగిస్తే దానిని అక్కడే వదిలివేసి వెళ్లాలి. కావాలంటే మరుసటి రోజు వచ్చి దీపాన్ని తీసుకెళ్లడం మంచిది. ఎందుకంటే దేవాలయంలో వెలిగే దీపం శక్తిని తనవైపు ఉంచుకుంటుంది. అలాంటి పరిస్థితిలో దీపాన్ని ఇంటికి ఎప్పుడూ తీసుకురాకూడదట.
గుడి నుంచి చెప్పులు వేస్కొని రావచ్చా?
గుడికి వెళ్లేటప్పుడు కొందరు చెప్పులు వేసుకెళ్తారు. మరికొందరు వేసుకొనిపోరు. చెప్పులు లేదా షూస్ శనికి సంబంధించినవి. జాతకంలో శని, దానికి సంబంధించిన దోషాలుంటే.. శని కోపం నుండి విముక్తి పొందడానికి గుడికి వేసుకెళ్లిన చెప్పులు అక్కడే వదిలేసి రావడం మంచిది.
చెడు లక్షణాలు:
దేవాలయం నుంచి ఇంటికి తిరిగి వచ్చే ముందు కోపం, అసూయ, దురాశ లాంటి అన్ని రకాల చెడు లక్షణాలను అక్కడే వదిలివేసి ఇంటికి తిరిగి రండి. ఈ లక్షణాలను మనసులో ఉంచుకొని దేవాలయానికి వెళ్లి, తిరిగి అదే లక్షణాలతో ఇంటికి వస్తే, చేసిన పూజ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.