అమ్మాయిలకు ఈ క్వాలిటీస్ ఉన్నఅబ్బాయిలు అస్సలు ఇష్టముండదట..
అమ్మాయిలకు ఎలాంటి అబ్బాయిలు ఇష్టం? వారు ఇష్టపడాలంటే తమలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అన్న డౌట్స్ చాలా మంది అబ్బాయిల్లో ఉంటాయి. ఇంతకీ అమ్మాయిలకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాలంటే ఇష్టముంటుందో తెలుసా..
ఇదైతే నిజం కాదు: అందంగా ఉండాలి. ధనవంతుడై ఉండాలి. ఉద్యోగం, పెద్ద ఇల్లు, కారు లాంటి వసతులున్న అబ్బాయిలనే అమ్మాయిలు ఇష్టపడుతుంటారని చాలా మంది భావిస్తుంటారు. కానీ ఇది అస్సలు నిజం కాదు.
ఇలా ఉంటే చాలు: స్వచ్ఛమైన ప్రేమకు ఓటమి ఉండదు. ఈ స్వచ్ఛమైన ప్రేమనే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడేది. వారిని ప్రాణంగా ప్రేమిస్తూ, వారికోసం కాస్త సమయాన్ని కేటాయిస్తూ.. వారితో టైం స్పెండ్ చేస్తే చాలు అమ్మాయిల ప్రేమను గెలుచుకుంటారు.
గొప్ప అనే ఫీలింగ్: మగవారే తోపు, తురుము, గొప్ప అనే ఫీలింగ్ ఉన్న అబ్బాయిలంటే అమ్మాయిలకు అస్సలు ఇష్టం ఉండదు . ముఖ్యంగా ఆడవారిని చిన్నచూపు చూస్తూ వారిపై ఆదిపత్యం చెలాయించే అబ్బాయిలను అమ్మాయిలు అస్సలు ఇష్టపడరు. ఇలాంటి లక్షణాలున్న అబ్బాయిలకు అమ్మాయిలు దూరంగానే ఉంటారు.
తలూపుతూ ఉండే: అమ్మాయిలు చెప్పే ప్రతి విషయానికి కూడా ఓకే ఓకే అంటూ తలూపుతూ ఉండే అబ్బాయిలను అమ్మాయిలు దూరం పెడుతుంటారట. సొంత నిర్ణయాలు, అభిప్రాయాలు కలిగుండే అబ్బాయిలనే అమ్మాయిలు ఇష్టపడతారట.
లేజీ ఫెలోస్: ఏ పనిచేయడానికి ఇష్టపడని వారిని, బద్దకంగా ప్రవర్తించే అబ్బాయిలంటే అమ్మాయిలకు అస్సలు ఇష్టముండదు. ఇలాంటి వారిని తమ పార్టనర్ గా వారు ఎట్టిపరిస్థితిలో అంగీకరించరు. అమ్మాయిలకు ఎప్పుడూ యాక్టీవ్ గా , హుషారుగా ఉండే అబ్బాయిలంటేనే తెగ ఇష్టం.
క్లాసులు పీకితే: నీకసలు ఎలా ప్రవర్తించాలో తెలియదు. నువ్ అలా చేయడం తప్పు, ఇది తప్పు అంటూ.. తరచుగా వారిని తిడుతూ.. వారికి నీతి సూత్రాలు బోధించే అబ్బాయిలకు దూరంగా ఉంటారు. క్లాసులు పీకి, నీతులు భోదించే అబ్బాయిలంటే అమ్మాయిలకు తెగ చికాకట.
డామినేట్ చేయడం: నా ఆధిపత్యం కిందే బతకాలి. నేను చెప్పినట్టే చేయాలి. వినాలి అంటూ రూల్స్ పెట్టే అబ్బాయిలకు అమ్మాయిలు దూరంగా ఉండాలనుకుంటారట. ఒక రిలేషన్ షిప్ ఎక్కువ కాలం నిలవాలంటే అందులో డామమినేషన్ అస్సలు ఉండకూడదు.
వీరంటే తెగ ఇష్టం: ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే అబ్బాయిలంటే అమ్మాయిలకు చాలా ఇష్టమట. ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇచ్చే అబ్బాయిలు వారిని బాగా చూసుకుంటారని, ప్రేమిస్తారని అమ్మాయిలు నమ్ముతుంటారు.