ఈ పండ్లతో కీళ్ల నొప్పులు ఇట్టే తగ్గుతాయి..
Knee Pain Remedies: కీళ్ల నొప్పులను శాశ్వతంగా వదిలించుకోవడం కష్టమైన పనే. కానీ కొన్ని రకాల చిట్కాలతో వీటి నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేంటంటే..

Knee Pain Remedies: ఒకప్పుడు కీళ్ల నొప్పులు, వాపులు వయసు మీద పడుతున్న వారికే వచ్చేవి. కానీ ఇప్పుడు చిన్న వయసు వారు సైతం కీళ్ల నొప్పులు, వాపు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. మన ఆహారపు అలవాట్లు, మారిన జీవన శైలి వంటి కారణాల వల్ల ఈ సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఏ కారణం చేత ఈ నొప్పులు వచ్చినా.. వీటిని వదిలించుకోవడం అంత సులభమైతే కాదు. ఎన్ని హాస్పటల్లు తిరిగినా.. ఎన్ని గోలీలను మింగినా.. కీళ్ల నొప్పులు తగ్గని వారు చాలా మందే ఉన్నారు. కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలను రెగ్యులర్ గా తినడం వల్ల ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం పదండి..
నారింజ పండు: నారింజ్ పండు లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన రోగ నిరోధకతను పెంచడంతో పాటుగా మన ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కీళ్ల నొప్పులను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కీళ్ల నొప్పులున్న వారు ఈ పండును రెగ్యులర్ గా తినండి.
పుచ్చకాయ: పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఇందులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ , కెరోటినాయడ్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు బలంగా ఉండేందుకు ఎంతో సహాయపడతాయి. ముఖ్యంగా వీటిని తరచుగా తినడం వల్ల మోకాళ్ల నొప్పులు ఇట్టే తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
ద్రాక్షపండు: ద్రాక్షపండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్థరైటిస్ సమస్య నుంచి బయటపడేస్తుంది. ఈ పండును రెగ్యులర్ గా తినడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గుముఖం పడతాయని నిపుణుల చెబుతున్నారు.