రక్తం తక్కువగా ఉందా..? అయితే వీటిని తినండి
మన దేశంలో చాలా మంది తక్కువ రక్తంతో ఎన్నో ఇబ్బందులను పడుతున్నారు. ముఖ్యంగా ఈ సమస్యను ఆడవారే ఎక్కువగా ఫేస్ చేస్తున్నాయి. అయితే కొన్ని రకాల ఫుడ్స్ ను తింటే హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రక్తహీనత ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఈ సమస్య మగ వారితో పోల్చితే ఆడవారిలోనే ఎక్కువగా కనిపిస్తుంది. హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉండటం వల్ల తొందరగా అలసిపోవడంతో పాటుగా ఎన్నో ప్రమాదకరమైన రోగాలు వస్తాయి. అయితే హిమోగ్లోబిన్ పెరిగేందుకు ఐరన్ రిచ్ ఫుడ్స్ సహాయపడతాయి. ఇందుకోసం ఎలాంటి ఆహారాలను తినాలో తెలుసుకుందాం పదండి.
తోటకూర
తోటకూరను తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. దీనిలో ఉండే ఔషదగునాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనిలో రకరకాల విటమిన్లు, పొటాషియం, సోడియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన అనవసరమైన కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. ఒకరకంగా చెప్పాలంటే తోటకూర కూడా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది కూడా. దీనిలో ఆకలిని తగ్గించే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక తోటకూరని రోజూ తినడం వల్ల హైపర్ టెన్షన్ సమస్య తగ్గుతుంది. ఈ కూర తక్షణ శక్తిని కూడా అందిస్తుంది. తోటకూరలో పుష్కలంగా ఉండే ఐరన్ కంటెంట్ హిమోగ్లోబిన్ ను పెంచడంతో పాటుగా ఎర్రరక్తకణాల సంఖ్యను కూడా పెంచుతుంది. తోటకూరతో రకరకాల వంటలను చేసుకుని తినొచ్చు. మొత్తంగా తోటకూర వల్ల ఒకటికాదు రెండు కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు. అందుకే రక్తం తక్కువగా ఉండేవారే కాదు ఇతరులు కూడా దీన్ని తరచుగా తింటూ ఉండండి.
ఖర్జూరం
ఖర్జూరాల్లో ఎన్నో ఔషద గుణాలుంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. ఈ చిన్నపండును తినడం వల్ల శరీరంలో రక్తం స్థాయిలు బాగా పెరుగుతాయి. ఈ పండును తినడం వల్ల శరీరానికి కావాల్సిన తక్షణ శక్తి అందుతుంది. అంతేకాదండోయ్ ఈ పండు మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది. ఈ పండును తినడం వల్ల రోజంతా మీరు ఎనర్జిటిక్ గా పనిచేస్తారు. ఈ పండులో మెగ్నీషియం, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. ఈ పండు ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది. ఖర్జూర పండ్లను తింటే వాతం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఐరన్ లోపం పోతుంది. అందుకే రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఈ పండ్లను రెగ్యులర్ గా తింటూ ఉండండి.
ఎండు ద్రాక్ష
ఎండు ద్రాక్షలో విటమిన్ ఎ, బీటా కెరోటిన్లతో పాటుగా ఇతర పోషకాలు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటిని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి కూడా సహాయపడతాయి. వీటిని నీటిలో నానబెట్టి తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. అంతేకాదు మలబద్దకం సమస్య కూడా తొలగిపోతుంది. దీనిలో ఉండే పొటాషియం కండరాలను, నరాలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. దీనిలో క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడే యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా ఉంటాయి. వీటిలో ఉండే ఐరన్ కంటెంట్ ఎర్ర రక్తకణాలను పెంచడానికి ఎంతో సహాయపడతాయి.
తృణధాన్యాలు
తృణధాన్యాలను మీరోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తం పెరగడమే కాదు మరెన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. అందుకే వీటిని మీ రోజువారి ఆహారంలో చేర్చండి.
నువ్వులు
నువ్వులో ఎన్నో పోషకవిలువలు ఉంటాయి. ఈ నువ్వులను రెగ్యులర్ గా తినడం వల్ల శరీరంలో రక్తం స్థాయిలు బాగా పెరుగుతాయి. దీనిలో ఉండే పీచు పదార్థం తొందరగా జీర్ణం అవుతుంది. నువ్వులు శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కూడా తగ్గించడానికి సహాయపడతాయి. మీకు తెలుసా.. క్రమం తప్పకుండా నువ్వులను తినడం దీనిలో ఉండే మెగ్నీషియం అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. నువ్వుల్లో విటమిన్ బి6, ఐరన్, కాపర్, జింక్, సెలీనియం , ఫోలెట్ వంటివి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంధిని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే ఎముకలను బలంగా ఉంచుతాయి. నువ్వుల్లో ఉండే ఈ పోషకాలు రక్తహీనత సమస్యను పోగొడుతాయి. అందుకే కొంత పరిమాణంలో వీటిని రోజూ తింటూ ఉండండి.
పల్లీలు, చింతపండు గుజ్జు, నేరుడు పండు, ఆప్రికాట్ వంటి ఆహారాలు కూడా రక్తాన్ని పెంచడానికి సహాయపడతాయి. అందుకే వీటిని కూడా రోజువారి డైట్ లో చేర్చండి.