గోధుమపిండితో టేస్టీ కేక్.. ఈజీగా ఇంట్లోనే కేక్ తయారు చేసుకొండిలా!
పుట్టిన రోజులకు, పార్టీలకు, చిన్న చిన్న ఫంక్షన్ లకు కేక్ (Cake) కటింగ్ చేయడం మామూలే. అయితే గోధుమపిండితో కేకును ఇంట్లోనే సులువైన పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ (Article) ద్వారా తెలుసుకుందాం.

కేక్ ను సాధారణంగా మైదా పిండితో (Maida) తయారు చేస్తారు. కానీ మైదా ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే ఇప్పుడు మనం మైదాపిండికి బదులుగా గోధుమపిండిని (Wheat flour) ఉపయోగించి కేక్ తయారు చేసుకుందాం. గోధుమపిండి ఆరోగ్యానికి మంచిది. నిజం చెప్పాలంటే మైదా పిండితో చేసిన కేక్ కంటే గోధుమ పిండితో చేసిన కేక్ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం గోధుమ పిండితో చేసుకునే కేక్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు:
ఒక కప్పు గోధుమపిండి (Wheat flour), 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ (Baking powder), 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా (Baking soda), చిటికెడు ఉప్పు (Salt), రెండు కోడిగుడ్లు (Eggs), అర కప్పు పంచదార (Sugar), పావు కప్పు నూనె (Oil), పావు కప్పు పాలు (Milk), వెనిలా ఎసెన్స్ (Vanilla Essence), డ్రై ఫ్రూట్స్ (Dry Fruits).
తయారుచేయు విధానం: ముందుగా రెండు గుడ్లు గిన్నెలో (Bowl) తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. గుడ్లను (Eggs) బాగా బీట్ చేసుకున్నాక ఇందులో అరకప్పు పంచదార పొడి వేసి బాగా కలపాలి. ఇందులో పావు కప్పు నూనె, పావు కప్పు కాచి చల్లార్చిన పాలు వేసి బాగా బీట్ చేసుకోవాలి. మరొక గిన్నెలో ఒక కప్పు గోధుమపిండి, ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్, సగం టీ స్పూను బేకింగ్ సోడా చిటికెడు ఉప్పు వేసి బాగా జల్లెడ పట్టాలి.
ఇలా జల్లెడ పట్టిన పిండిని గుడ్లు మిశ్రమంలో కలిపి బాగా కలుపుకోవాలి. రెండు నిమిషాల పాటు ఒకే డైరెక్షన్ లో పిండిని మిక్స్ (Mix) చేసుకోవాలి. ఇందులో మీకు ఇష్టమైన డ్రైఫ్రూట్స్ ను వేసుకోవచ్చు. కేక్ మంచి ఫ్లేవర్ రావడానికి వెనీలా ఎసెన్స్ కొన్ని రెండు చుక్కల డ్రాప్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నింటిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక అల్యూమినియమ్ గిన్నె (Aluminium bowl) తీసుకొని అడుగున కొంచెం ఆయిల్ పట్టించి గోధుమ పిండి చల్లి కలుపుకున్న మిశ్రమాన్ని ఈ గిన్నెలో తీసుకోవాలి.
ఇప్పుడు బేక్ (Bake) చేసుకోవడం కోసం ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో స్టాండ్ (Stand) పెట్టి మూతపెట్టి ఐదు నిముషాలు గిన్నెను ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఇలా ఫ్రీ హిట్ చేసుకున్న గిన్నెలో అల్యూమినియం గిన్నెను పెట్టి తక్కువ మంట మీద 30-45 నిమిషాలు బేక్ చేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత కేక్ బేక్ అవ్వడం మొదలవుతుంది.
అప్పుడు కేకు పైకి పొందుతున్నట్టు ఉంటుంది. 30 నిమిషాల తర్వాత టూత్ పిక్ తో పొడిచి చూడాలి. టూత్ పిక్ కు కేక్ మిశ్రమం అంటకపోతే కేక్ రెడీ (Ready) అయినట్టే. కేక్ చల్లారాక పైన ప్లేట్ (Plate) పెట్టి రివర్స్ చేస్తే కేక్ వస్తుంది. ఈ కేక్ ను ఒక ప్లేట్ లో పెట్టి కట్ చేసి మీ పిల్లలకు ఇవ్వండి.