Steam Vs Ice: ముఖానికి ఐస్ మంచిదా? ఆవిరి మంచిదా? వీటిలో ఏది అందంగా మారుస్తుంది?
Steam Vs Ice: కొంతమంది ముఖానికి ఐస్ పెడితే.. మరికొంతమంది ఆవిరి పడుతుంటారు. ఈ రెండింటి వల్ల ముఖం అందంగా మారుతుందనేది వాస్తవమే. కానీ..

ముఖాన్ని ఎంత క్లీన్ గా ఉంచుకుంటే.. ముఖం అంత ఆరోగ్యంగా, కాంతివంతంగా మెరిసిపోతుంది. ముఖ్యంగా బయటతిరిగే వారు ముఖాన్ని చాలా శుభ్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వారి ముఖంపై దుమ్ము దూళి పేరుకుపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు ఇంటికి చేరుకోగానే సబ్బుతో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. అంతేకాదు యూవీ కిరణాల వల్ల ముఖ చర్మానికి హానీ కలగకూడదంటే.. సన్ స్క్రీన్ లోషన్ ను తప్పకుండా వాడాలి. అయితే కొంతమంది ముఖంపై పేరుకుపోయిన డస్ట్ ను తొలగించేందుకు ఐస్ క్యూబ్స్ ను పెడితే.. మరికొంతమంది ఆవిరి పడుతుంటారు. వీటివల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. కానీ ఆవిరి వల్ల కొన్ని లాభాలున్నా.. చాలా నష్టాలు ఉన్నాయి. ఈ రెండు పద్దతుల వల్ల ఎలాంటి లాభాలున్నాయో తెలుసుకుందాం పదండి..
ఐస్ లేదా చల్ల నీళ్లతో ముఖాన్ని కడిగితే కలిగే ప్రయోజనాలు.. ముఖాన్ని చల్ల నీటితో కడిగినా.. ఐస్ ను ముఖానికి పెట్టినా ముఖంపై ఉండే ముడతలు, గీతలు చాలా వరకు తగ్గుతాయి. అంతేకాదు ఈ చల్లనీరు మీ ముఖానికి యంగ్ లుక్ ను తీసుకొస్తుంది.
చల్లనీరు ముఖంపై ఉండే డల్ నెస్ ను పోగొడుతుంది. అంతేకాదు ఈ నీళ్లు స్కిన్ ను కాంతివంతంగా చేస్తుంది. ఐస్ ను ఫేస్ కు పెట్టడం వల్ల ఫేస్ స్కిన్ కు బ్లడ్ సర్క్యూలేషన్ మెరుగ్గా జరుగుతుంది. దీంతో మీ ఫేస్ మరింత అందంగా తయారవుతుంది.
ICE Cube
ఐస్ క్యూబ్స్ వల్ల నల్ల మచ్చలు ఇట్టే తొలగిపోతాయి. మొటిమల సమస్యలు కూడా తగ్గుతాయి. ఐస్ క్యూబ్స్ ను నిత్యం ముఖానికి పెట్టడం వల్ల స్కిన్ కు ఎంతో మేలు జరుగుతుంది
చల్ల నీరు కంటి ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు సూర్యకిరణాల వల్ల కలిగే హానీ నుంచి రక్షిస్తుంది. సూర్యకిరణాల వల్ల తెరుచుకున్న రంధ్రాలను కూల్ వాటర్ బిగ్గరగా చేస్తుంది. చల్ల నీటితో లాభాలే తప్ప నష్టాలు ఉండవు.
ఆవిరి వల్ల ముఖానికి కలిగే లాభాలు.. ముఖానికి ఆవిరి పట్టడం వల్ల ముఖంపై పేరుకుపోయిన మురికంతా పోతుంది. అంతేకాదు ఇది మొటిమలకు కారణమయ్యే చెడు బ్యాక్టీరియాను చంపేస్తుంది.
ఆవిరి వల్ల చర్మ రంధ్రాలు ఓపెన్ అవుతాయి. అంతేకాదు ఆవిరి వల్ల ముఖంపై ఉండే వైట్, బ్లక్ హెడ్స్ వదిలిపోతాయి. ఆవిరి పట్టడం వల్ల విపరీతమైన చెమట ఏర్పడుతుంది. దీంతో రక్తనాళాలు విస్తరించి రక్త ప్రసరణ మెరుగవుతుంది. దీంతో చర్మానికి ఆక్సిజన్ ఎక్కువగా అందుతుంది. దీంతో స్కిన్ కాంతివంతంగా తయారవుతుంది.
ఆవిరి కారణంగా చెమట ఏర్పడటంతో .. ముఖ చర్మం తేమగా ఉండే నూనెలు రిలీజ్ అవుతాయి. ఇవి స్కిన్ ను హైడ్రేట్ గా ఉంచుతాయి. ఆవిరి వల్ల తలనొప్పి తగ్గుతుంది.
ఆవిరి పట్టడం వల్ల కలిగే నష్టాలు: ఆవిరి పట్టడం వల్ల కొందరి చర్మానికి నష్టం కలగొచ్చు. సున్నితమైన చర్మం గల వారికి ఆవిరి వల్ల నష్టమే తప్ప.. లాభం ఉండదు.
ముఖానికి వేడి వాటర్ అస్సలు మంచిది కాదు. వేడినీటితో ముఖం కడగడం వల్ల స్కిన్ ను తేమగా ఉంచే నేచురల్ ఆయిల్స్ తొలగిపోతాయి. దాంతో మీ ముఖం డ్రైగా మారుతుంది. కాబట్టి ముఖానికి చల్లని లేదా ఐస్ క్యూబ్స్ ను మాత్రమే ఉపయోగించండి.
steam
తామర లేదా రోసేసియా ఉన్న వారు ముఖానికి ఆవిరి పట్టకపోవడమే ఉత్తమం. ఆవిరిని ప్రతిరోజూ పట్టడం అంత మంచిది కాదు. వారానికి ఒకసారి మాత్రమే ఆవిరి పట్టాలి. అది కూడా పది నిమిషాలు మాత్రమే.