ఒక్క మచ్చకూడా లేని అందమైన ముఖం కావాలా? అయితే నెయ్యితో ఈ ఫేస్ ప్యాక్స్ ను ట్రై చేయండి
skin care: దుమ్ము, దూళి, కాలుష్యం ముఖ అందాన్ని తగ్గిస్తాయి. ఇక ముఖం అందంగా కనిపించాలని మార్కెట్ లో దొరికే రకరకాల క్రీమ్స్ ను వాడుతుంటారు. నిజానికి కెమికల్స్ మిక్స్ చేసే ఈ ప్రొడక్ట్స్ కంటే ఇంటి చిట్కాలే ఇందుకు బాగా ఉపయోగపడుతాయంటున్నారు నిపుణులు.
రోజుకు ఒక టీ స్పూన్ నెయ్యిని తీసుకుంటే మనం ఎన్నో రోగాలకు దూరంగా ఉండొచ్చంటారు నిపుణులు. నిజానికి నెయ్యి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. ఆయుర్వేదంలో కూడా నెయ్యి మంచి ఆరోగ్యకరమైన పదార్ధంగా ప్రసిద్ది చెందింది. నెయ్యిని తీసుకోవడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అయితే నెయ్యి ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అవును నెయ్యి ఫేస్ ప్యాక్స్ వల్ల ముఖంపై ఒక్క మచ్చ కూడా ఉండదు. అలాగే మీ ముఖం అందంగా మెరిసిపోతుంది కూడా. నెయ్యిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటుగా విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె లు పుష్కలంగా ఉంటాయి. మరి నెయ్యితో ఫేస్ ప్యాక్స్ ను ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
శెనగపిండి, నెయ్యి ఫేస్ ప్యాక్
మీ చర్మం మృదువుగా, తాజాగా ఉండటానికి.. రెండు టీస్పూన్ల శెనగపిండిలో రెండు టీస్పూన్ల నెయ్యిని కలిపి పేస్ట్ లా తయారుచేయండి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి 30 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత చేతులతో నెమ్మదిగా మసాజ్ చేసి నీళ్లతో కడగండి.
నెయ్యి , తేనె మాస్క్
వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంపై ముడతలు రావడం ప్రారంభమవుతుంది. ఇది చాలా కామన్. అయితే నెయ్యి ఫేస్ ప్యాక్ తో ఈ సమస్యను నెమ్మదింపజేయొచ్చు. ఇందుకోసం అర టీస్పూన్ నెయ్యిలో.. అర టీస్పూన్ తేనెను వేసి కలపండి. మీ చేతులతో దీన్ని ముఖానికి అప్లై చేసి కాసేపు మసాజ్ చేయండి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని కడగండి.
నెయ్యి, శెనగపిండి, మిల్క్ ప్యాక్
పాలు, నెయ్యిని మిక్స్ చేసి ముఖానికి రాసుకుంటే కూడా మీ ముఖం అందంగా, మచ్చలేకుండా తయారవుతుంది. ఇందుకోసం అర టీస్పూన్ నెయ్యిని తీసుకుని అందులో కొద్దిగా పచ్చిపాలు, 2 టీస్పూన్ల శెనగపిండి కలిపి చిక్కటి పేస్ట్ లా తయారుచేసుకోండి. దీన్ని మీ ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఇధి ఆరిన తర్వాత కొద్దిసేపు మసాజ్ చేసి చల్ల నీళ్లతో ముఖాన్ని కడుక్కోండి. ముఖంపై ఉన్న మచ్చలను పోగొట్టడానికి ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి 1 నుంచి 2 సార్లు ముఖానికి అప్లై చేయండి.
నెయ్యి, పసుపు ప్యాక్
మెరిసే, ట్యాన్ లేని చర్మాన్ని పొందడానికి నెయ్యి, పసుపును మిక్స్ చేసి పేస్ట్ లా తయారుచేయండి. దీన్ని మీ ముఖానికి అప్లై చేసి పూర్తిగా ఆరనివ్వండి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోండి.