డబ్బును ఎలా పొదుపు చేయాలో తెలుసా?
డబ్బును పొదుపు చేయాలని, అనవసర ఖర్చును తగ్గించుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ సరైన మార్గం తెలియక డబ్బును పోగొయ్యలేక పోతుంటారు. అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో మీ పొదుపును పెంచొచ్చు. ఇందుకోసం ఏం చేయాలంటే?
ప్రజా రవాణా
చాలా మంది సొంత వాహనాల్లోనే ఆఫీసులకు, పనులకు వెళుతుంటారు. ఎందుకంటే సౌకర్యవంతంగా ఉంటుందని. కానీ కారు, స్కూటీ, బైక్ ను నడపడానికి ఇందనం కావాలి. కానీ మీరు అత్యవసరం కాని సమయాల్లో ప్రభుత్వ బస్సులు, ట్రైన్స్ వంటి ప్రజా రవాణాను ఉపయోగిస్తే బైక్, కార్లు మొదలైన వాటి ఇంధన ధరలను ఆదా చేయవచ్చు. వీటికి పెట్టే ఖర్చు మీకు మిగుల్తుంది. డబ్బు కూడుతుంది.
డిస్కౌంట్ షాపింగ్
నెలలో రెండు మూడు సార్లు షాపింగ్ చేసేవారు కూడా ఉన్నారు. కానీ షాపింగ్ వల్ల డబ్బు చాలా ఖర్చైపోతుంది. అందుకే షాపింగ్ చేసేటప్పుడు డిస్కౌంట్ ధరకు వస్తువులను కొనండి. లేదా బై వన్ గెట్ వన్ లాంటి డిస్కౌంట్ లున్నప్పుడు కూడా కొనండి. వీటివలల్ మీ డబ్బు ఆదా అవుతుంది.
పార్ట్ టైమ్ జాబ్
ఎక్కువ డబ్బును సంపాదించాలంటే మాత్రం మీ ఆఫీసు పని తర్వాత ఏదైనా పార్ట్ టైమ్ పనిచేయండి. దీనివల్ల మీరు ఖాళీగా ఏం నట్టుగా ఉంటుంది. డబ్బును కూడా బాగా సంపాదిస్తారు. దీనివల్ల మీ పొదుపు బాగా పెరుగుతుంది.
సబ్ స్క్రైబ్ చేయడం ఆపండి
చాలా మందికి సినిమాలు చూసే అలవాటు ఎక్కువగా ఉంటుంది. ఇందుకోసం ఓటీటీ ప్లాట్ఫామ్ లను బాగా ఉపయోగిస్తారు. మీ డబ్బు ఆదా కావాలంటే మాత్రం ఇంటర్నెట్ సేవలకు సబ్స్క్రైబ్ చేయడం ఆపేయండి. దీనివల్ల ఎంతో డబ్బు కూడదుతుంది.
గడువులోగా చెల్లింపులు
ఏదైనా గడువులోగా చేయడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే కొన్నింటిపై గడువు తీరితే అదనపు డబ్బును చెల్లించాల్సి ఉంటుంది. అంటే విద్యుత్ బిల్లులు, క్రెడిట్ కార్డు బిల్లులను గడువులోపే చెల్లించండి. దీంతో మీరు పెనాల్టీ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇలా చేస్తే కూడా మీరు డబ్బును ఆదా చేసినవారవుతారు.
ఖర్చుకు కారణం
మీరు దేనికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారో ముందు తెలుసుకోండి. దీనివల్ మీరు దానిపై ఖర్చును తగ్గించుకోవచ్చు. దీంతో మీ డబ్బు అనవసరంగా ఖర్చు కాదు. మనీ కూడా సేవ్ అవుతుంది.
బయట తినడం మానుకోవాలి
పని చేస్తూ బయట తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. బయటి ఫుడ్ తినడం వల్ల మీకు తెలియకుండానే చాలా డబ్బు ఖర్చైపోతుంది. అందుకే బయట తినడానికి బదులుగా ఇంట్లోనే వంట చేసుకుని తినండి. దీనివల్ల ఫుడ్ ఖర్చు తగ్గుతుంది.