ఫోన్ చూస్తూ తింటే ఏమౌతుంది..?
పిల్లలకి.. సరిగా తినరు అని పేరెంట్సే స్వయంగా ఇస్తుంటే, పెద్దలు కూడా ఫోన్ చూస్తూనే భోజనం చేస్తున్నారు. బయటకు వెళ్లినా, ఇంట్లో ఉన్నా.. ఇదే ఫార్ములా ఫాలో అవుతూ ఉంటారు.
ఈ రోజుల్లో ఫోన్ అలవాటు లేనివాళ్లు ఎవరూ లేరనే చెప్పాలి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకూ అందరూ ఫోన్లు వాడే వారే. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ తోనే కాలం గడిపేస్తున్నారు. నిద్రపోతున్నప్పుడు తప్ప.. వాటిని క్షణం కూడా వదలకుండా వాడేస్తున్నారు. ఇక.. తినే సమయంలో ఫోన్ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు.
పిల్లలకి.. సరిగా తినరు అని పేరెంట్సే స్వయంగా ఇస్తుంటే, పెద్దలు కూడా ఫోన్ చూస్తూనే భోజనం చేస్తున్నారు. బయటకు వెళ్లినా, ఇంట్లో ఉన్నా.. ఇదే ఫార్ములా ఫాలో అవుతూ ఉంటారు. మరి.. ఫోన్ చూస్తూ.. టీవీ తినడం వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి.. అవేంటో ఇప్పుడు చూద్దాం...
ఫోన్ లేదంటే.. టీవీ చూస్తూ తింటున్నప్పుడు మనం ఎంత తింటున్నాం అనే విషయంపై శ్రద్ధ ఉండదు. ఫలితంగా ఎక్కువ తినేస్తూ ఉంటాం. దీని వల్ల.. అధిక బరువు పెరుగిపోతారు. ఒబేసిటీ ప్రాబ్లం ఎదుర్కోవాలసి వస్తుంది.
అంతేకాదు.. ఫోన్ చేస్తూ ఆహారం తినడం వల్ల.. ఎక్కువ మంది నవలడంపై దృష్టి పెట్టలేరు. ఫుడ్ ని నవలకుండానే మింగేస్తూ ఉంటారు. దీని వల్ల.. అరుగుదల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జీర్ణ సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు.
తినే సమయంలో ఫోన్ చూడటం వల్ల.. ఫోకస్ మొత్తం ఆహారం మీద కాకుండా.. ఫోన్ మీద ఉంటుంది. దాని వల్ల.. మనం ఎక్కువగా తిన్నా కూడా.. తిన్న అనుభూతి ఉండదు. తిన్నామనే సంతృప్తి ఉండదు.
ఇలా ఫోన్లు, టీవీలు చూస్తూ తినడం వల్ల.. అధిక బరువు పెరిగిపోతారు. నెమ్మదిగా మెటబాలిజం కూడా తగ్గిపోతుంది. దీని కారణంగా డయాబెటిస్ వచ్చే ఛాన్సులు ఎక్కువ అవుతాయి. కొలిస్ట్రాల్ కూడా పెరుగుతుంది.
ఎవరికి వారు.. ఫోన్లు చూస్తూ భోజనం చేయడం వల్ల.. కనీసం ఆ కాస్త సమయం కూడా కుటుంబంతో గడిపే అవకాశం ఉండదు.. ఎవరి ప్రపంచంలో వాళ్లు బతికేస్తారు. కుటుంబ బంధాలు మరింత హీనంగా మారిపోతాయి.