అరటిపండ్లను ఫ్రిజ్ లో పెడితే ఏమౌతుందో తెలుసా?
అరటిపండ్లలో మన శరీరానికి మేలుచేసే ఎన్నో రకాల పోషకాలుంటాయి. అయితే చాలా మంది ఈ పండ్లు పాడవకుండా ఉండటానికి ఇంట్లో ఫ్రిజ్ లో పెట్టేసి తింటుంటారు. కానీ ఇలా ఫ్రిజ్ లో పెడితే ఏమౌతుందో తెలుసా?
అరటి పండ్లు సీజన్లతో సంబంధం లేకుండా ప్రతి మార్కెట్ లో దొరుకుతాయి. ఈ పండ్లు చాలా చవకే అయినా ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే చాలా మంది ఈ పండ్లను డజన్లకు డజన్లు కొనేసి పాడవకుండా ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. కానీ ఇలా ఈ పండ్లను ఫ్రిజ్ లో పెడితే ఏమౌతుందో తెలుసా?
అరటిపండ్లు ఒక కంఫర్ట్ ఫ్రూట్స్. ఇవి తీయగా, టేస్టీగా ఉంటాయి. ఈ పండులో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లను తింటే బరువు తగ్గడం నుంచి పోషకాల లోపం పోవడం వరకు ఎన్నో ప్రయోజనాలను పొందుతారు.
అరటి పండ్లలో ఎన్నో రకాల పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాం. ఈ పండు మన శరీరానికి ఎలాంటి మేలు చేస్తుందంటే?
1. మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది.
2. ఇది డయాబెటీస్ పేషెంట్లకు మేలు చేస్తుంది. అంటే మొత్తం పండని అరటిపండ్లును తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి.
3. ఈ అరటిపండ్లను తింటే గుండె, మూత్రపిండాలు, గట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
4. ఇది మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఈ పండును తింటే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీంతో మీరు అతిగా తినలేరు.
5. అరటిపండ్లు వ్యాయామం తర్వాత బాడీ రికవరీకి సహాయపడుతుంది.
అరటిపండ్లను ఫ్రిజ్ లో పెట్టొచ్చా?
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. అరటిపండ్లతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా.. ఇవి మనశరీరానికి ఎలాంటి మేలు చేస్తాయనేది వీటిని నిల్వ చేసే పద్దతిపై ఆధారపడి ఉంటుంది. నిజానికి అరటిపండ్లు ఉష్ణమండల పండు. కాబట్టి ఇవి ఎక్కువ ఉష్ణోగ్రతకు సున్నితంగా ఉంటాయి. అంటే వీటిని ఎక్కువగా శీతలీకరిస్తే వాటి పక్వీకరణ, ఎంజైమ్ కార్యకలాపాలు, టేస్ట్, దానిలోని పోషకాల్లో మార్పులు వస్తాయి.
అరటి తొక్క నల్లబడిన పండ్లను ఫ్రిజ్ లో పెడితే ఆ పండు తొందరగా కుల్లిపోతుంది. అయితే పండని అరటిపండును ఆరుబయట అంటే సాధారణ ఉష్ణోగ్రత వద్ద పెడితే అది తొందరగా పండుతుంది. అదే మీరు పండని అరటిపండును రిఫ్రిజిరేటర్ లో పెడితే పండే ప్రక్రియ ఆగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
ఫ్రిజ్ లో అరటిపండ్లను పెడితే దానిలోని పోషకాలు తగ్గుతాయి. అలాగే పండు తీపి తగ్గుతుంది. రుచి మారుతుంది. ఆ పండు సాధారణ ఆకృతి కూడా ప్రభావితం అవుతుంది. ఫ్రిజ్ లో పెట్టిన అరటిపండు కొంచెం చేదుగా ఉంటుంది. అలాగే మరీ మెత్తగా అవుతుంది.
అంతేకాదు ఈ పండ్లు వాటి అసలు రంగును కూడా కోల్పోతాయి. దీనివల్ల అవి తొందరగా కుల్లిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే పండని అరటిపండ్లను ఫ్రిజ్ లో పెట్టడం మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు.