సారా టెండుల్కర్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే...!
ఈ జంట రహస్యంగా పెండ్లి కూడా చేసుకుందని అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. వాటిల్లో ఎంత వరకు నిజం ఉందో తెలీదు. కానీ... ఈ పుకార్లతో ఆమె నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.

ఇండియన్ క్రికెటర్, క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ గురించి తెలియనివారు ఎవరూ ఉండరేమో. ఆయన కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాగా.. ఆయన కుమార్తె సారా టెండుల్కర్ కి కూడా చాలా క్రేజ్ ఉంది. టాప్ సెలబ్రెటీ కిడ్స్ లో సారా అందరికన్నా ముందుంటారు. అంతేకాకుండా హీరోయిన్లను తలదన్నే.. అందంతో.. ఆమె అందరినీ ఆకట్టుకుంటున్నారు.
కాగా.. టీమిండియా యువ ఆటగాడు శుభమన్ గిల్, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ లు చాలా రోజులుగా ప్రేమించుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ జంట రహస్యంగా పెండ్లి కూడా చేసుకుందని అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. వాటిల్లో ఎంత వరకు నిజం ఉందో తెలీదు. కానీ... ఈ పుకార్లతో ఆమె నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.
ఈ విషయాలు పక్కన పెడితే... సారా టెండుల్కర్ ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆమె జిమ్ వేర్ లో చాలా సార్లు కెమేరాకు చిక్కారు. తన తండ్రి సచిన్ లాగానే ఆమె కూడా ఫిట్నెస్ పై ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు.
కేవలం జిమ్ లో కసరత్తులు చేయడమే కాదు... మారథాన్ రన్నింగ్ లోనూ ఆమె ఎక్కువగా పాల్గొంటారు. ఓ మంచి కాస్ కోసం చాలామంది మారథాన్ లు నిర్వహిస్తూ ఉంటారు. అలా నిర్వహించిన మారథాన్ లో సారా చాలాసార్లు పాల్గొన్నారు.
సారా తరచూ క్రమం తప్పకుండా యోగా కూడా చేస్తూ ఉంటుంది. తన తండ్రి సచిన్ తో కలిసి కూడా ఆమె యోగా ప్రాక్టీస్ చేసిన సందర్భాలు ఉన్నాయి.
ఇక సారా... బయటి ఆహారం కన్నా... ఇంట్లో తాయరు చేసిన ఆహారం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. తన డైట్ లో ఆమె ఎక్కువగా పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకుంటారు. అప్పుడప్పుడు తన కుటుంబసభ్యుల కోసం ఆమె కూడా వంట చేస్తూ ఉంటారు.
ఇదిలా ఉండగా... సారా టెండుల్కర్‌కి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. తండ్రితోపాటు వచ్చిన సెలబ్రిటీ హోదా నేపథ్యంలో ఆమె కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ నెటిజన్లని ఆకట్టుకుంటుంది. తన ఫాలోయింగ్‌ని బాగా పెంచుకుంటుంది.