రాఖీ పండుగ ఎప్పుడు? ఆగస్టు 30 లేక 31 తేదీన.. ఏ రోజు రాఖీ కట్టాలంటే?
ప్రతి ఏడాది శ్రావణ శుక్లపక్షం పౌర్ణమి రోజున రాఖీ పండుగను జరుపుకుంటారు. కానీ భద్రకాలం కారణంగా ఆగస్టు 30, 31 తేదీల్లో రెండు రోజుల పాటు రాఖీ పండుగ జరుపుకోనున్నారు. అయితే ఆగస్టు 30 న భద్రకాలం క్రియాశీలకంగా మారుతుంది. అందుకే ఈ రోజు..

హిందూ మతంలో రాఖీ పండుగ ఎంతో పవిత్రమైంది. ప్రత్యేకమైంది. ఈ పండుగ అన్నా చెల్లె, తమ్ముడు అక్కల మధ్య బంధాన్ని, అనురాగాన్ని, ప్రేమను తెలుపుతుంది. ఈ పండుగలో అక్కా, చెల్లెల్లు అన్నలు, తమ్ముల మణికట్టుకు రాఖీలు కడతారు. రాఖీ వారి దీర్ఘాయుష్షు, సంతోషాన్ని సూచిస్తుంది. అలాగే అన్నలు చెల్లెల్లకు బహుమతులు ఇస్తూ ఆమెకు ఎప్పుడూ అండగా, రక్షణగా ఉంటానని మాటిస్తారు.
హిందూ క్యాలెండర్ ప్రకారం.. రక్షా బంధన్ ప్రతి ఏడాది పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈ సారి రక్షా బంధన్ పండుగను భద్రకాలం కారణంగా ఆగస్టు 30, 31 తేదీన రెండు రోజుల పాటు జరుపుకోనున్నారు. అయితే వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రాఖీ పండుగను ఎప్పుడూ కూడా భద్రకాలం లేని కాలంలోనే జరుపుకోవాలి.
Raksha Bandhan 2023
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రాఖీపండుగ రోజున భద్రకాలం ఉండకూడదు. రాఖీ పండుగ రోజున భద్రకాలంలో రాఖీ కట్టకూడదు. ఎందుకంటే దీన్ని అశుభంగా భావిస్తారు. హిందూ పంచాంగం లెక్కల ప్రకారం.. భద్రకాలం ఈ ఏడాది ఆగస్టు 30 న శ్రావణ పూర్ణిమ తిథితో ప్రారంభమవుతుంది. ఇది ఆగస్టు 30 రాత్రి 09:02 గంటల వరకు ఉంటుంది.
శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ కట్టుకోవడానికి మధ్యాహ్నం సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ ఏడాది శ్రావణ పౌర్ణమి రోజైన ఆగస్టు 30 నుంచి రాఖీ పండుగ ప్రారంభమవుతుంది. అయితే ఆ రోజంతా భద్రకాలం ఉంటుంది. అందుకే ఆగస్టు 30 న రాఖీ కట్టకూడదు. అయితే ఆగస్టు 30 న రాత్రి 09.02 గంటల తర్వాత రాఖీ కట్టొచ్చు.
రక్షా బంధన్ శుభ ముహూర్తం
రాఖీ కట్టడానికి శుభముహూర్తం ఆగస్టు 31. శుభ సమయం ఉదయం 6:20 నుంచి 7:50 మధ్య ఉంటుంది. తర్వాత మహ్లీ ఉదయం 11:10 నుంచి 15:50 వరకు ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 12:45 గంటల నుంచి 2:15 గంటల వరకు ఉంటుంది. నిజానికి రాఖీ పండుగను సూర్యాస్తమయం తర్వాత జరుపుకోరు.