ఈ గిఫ్ట్ లకు రూ. 50 కూడా అవసరం లేదు.. కానీ వీటితో ప్రపోజ్ చేస్తే మీ లవ్ సక్సెస్..
Propose Day 2024 Gifts:వాలెంటైన్ వీక్ లో రెండో రోజు అంటే రేపు ప్రపోజ్ డేను జరుపుకుంటారు. మరి ఈ రోజు లవర్ కు ఏం గిఫ్ట్ ఇవ్వాలి? ఎలా ప్రపోజ్ చేయాలో తెలుసుకుందాం పదండి.
propose day
Propose Day 2024 Gifts: ఈ రోజు నుంచి వాలెంటైన్స్ వీక్ ప్రారంభమైంది. దీనిలో మొదటి రోజు రోజ్ డే జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 8న ప్రపోజ్ డే జరుపుకోనున్నారు. వాలెంటైన్స్ వీక్ లో రెండో రోజు ప్రపోజ్ డే. ఈ రోజు ప్రేమించిన అమ్మాయికి లేదా అబ్బాయికి ప్రపోజ్ చేస్తుంటారు. అయితే వన్ సైడ్ లవ్ చేసేవారు ప్రపోజ్ చేయడానికి భయపడుతుంటారు. ఎందుకంటే ఎక్కడ నో చెప్తారోనని భయంతో. కానీ ప్రపోజ్ చేసినప్పుడే కదా వారికి మీ ప్రేమ తెలిసేది. కాబట్టి ఎలాంటి భయం లేకుండా.. ఒక చిన్న బహుమతితో వెళ్లి ప్రొపోజ్ చేయండి. నిజానికి కొన్ని గిఫ్ట్స్ మీ లవ్ కు ఉపయోగపడతాయి. ఈ గిఫ్ట్ ల కోసం మీరు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అవును కేవలం 50 రూపాయలల్లో వచ్చే గిఫ్ట్ లను కూడా ఇవ్వొచ్చు. అవేంటో తెలుసుకుందాం పదండి.
గులాబీ
ఎర్ర గులాబీలను ప్రేమకు, ఇష్టానికి, కోరికలకు చిహ్నంగా భావిస్తారు. అందుకే మీ ప్రేమను తెలియజేయడానికి ఎర్ర గులాబీలతో కొన్ని గొప్ప బహుమతులు ఇవ్వండి. కావాలనుకుంటే మీరు గులాబీల బొకేనే గిఫ్ట్ గా ఇచ్చి ప్రపొజ్ చేయండి. అమ్మాయిలకు గులాబీలంటే చాలా చాలా ఇష్టం. ఈ గిఫ్ట్ ఇవ్వగానే వారి ముఖంలో చిరునవ్వు వస్తుంది తెలుసా?
చేతితో తయారు చేసిన కార్డులపై కవిత
మీలోని ప్రేమను, భావాలను తెలియజేయడానికి అందమైన కార్డును రెడీ చేయండి. అలాగే మీకు కవితలు వస్తే వారిపై ఒక కవిత్వం రాయండి. ఇది మిమ్మల్ని మరింత స్పెషల్ గా చేస్తుంది. ఒకవేళ మీకు కవితలు రాకపోతే చిన్న పెయింటింగ్ వంటివి ట్రై చేయండి. కవితలు, పెయింటింగ్స్ మీ మనస్సులోని భావాలను మీరు ప్రేమించిన వారికి తెలియజేస్తాయి తెలుసా..
గులాబీ పువ్వు లేదా ఫ్లవర్ బొకే
గులాబీ లేదా మరేదైనా పువ్వు మీ మధ్య శృంగార వాతావరణాన్ని, ప్రేమను వ్యక్తపరిచే ఉద్దేశ్యాన్ని సూచిస్తుంది. అందుకే మీరే స్వయంగా పూల బొకేను తయారుచేసి ప్రపోజ్ చేయండి. లేదా ఒక్క గులాబీతో వెళ్లి ప్రపోజ్ చేసినా మీ లవ్ దాదాపుగా సక్సెస్ అయినట్టే..
ఏ చిన్న గిఫ్ట్ అయినా..
చాక్లెట్ల బాక్స్, లేదా కీ రింగ్స్, క్యాండిల్స్ లేదా పుస్తకాలు వంటి వారికి నచ్చిన చిన్న చిన్న వస్తువులను కూడా మీరు గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. మీరు ప్రేమించిన వారికి మీ భావాలు తెలియడానికి ఒక చిన్న చాక్లెట్ ప్యాకెట్ లేదా చిన్న చాక్లెట్ బార్ ను ఇచ్చినా సరిపోతుంది. దీన్ని కేవలం 50 రూపాయల్లోనే కొనొచ్చు.
Image: Getty Images
ఇంట్లో వండిన ఫుడ్
మీ భాగస్వామికి ఇష్టమైన ఫుడ్ ను స్వయంగా మీరే వండి వారికి బహుమతిగా ఇవ్వండి. ఈ గిఫ్ట్ మీ ప్రియమైన వారికి బలే నచ్చుతుంది. దీన్ని వారు జీవితాంతం మర్చిపోలేరు. మీ హార్డ్ వర్క్, ప్రేమతో చేసిన వంటకం వారికి తప్పకుండా నచ్చి తీరుతుంది. కాబట్టి ఈ సారి ఈ గిఫ్ట్ ఇవ్వండి.