Oversleeping Effects: అతిగా నిద్రపోతున్నారా? ఆ రోగాలొస్తయ్ జాగ్రత్త..
Oversleeping Effects: రోజుకు 6 నుంచి 8 గంటలు నిద్రపోతే చాలా మన ఆరోగ్యానికి ఏ ఢోకా లేదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కానీ ఇన్ని గంటల కంటే నిద్ర తక్కువైనా, ఎక్కువైనా ప్రమాదంలో పడ్డట్టే అంటున్నారు. మరి అతిగా నిద్రపోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలొస్తాయో తెలుసా..

Oversleeping Effects: కంటినిండా నిద్రుంటే చాలు మనం ఆరోగ్యంగా ఉండేందుకు. మరి కంటినిండా నిద్ర అంటే 6 నుంచి 8 గంటలు నిద్రపోతే చాలు. ఇన్ని గంటల నిద్రతో ఆ రోజంతా హ్యాపీగా, ఉల్లాసంగా ఉండొచ్చు. ప్రతి రోజూ ఇన్ని గంటల నిద్రపోయే వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశమే లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అయితే 6 నుంచి 8 గంటల కంటే ఎక్కువ సేపు నిద్రస్తే మాత్రం అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవసరానికి మించిన నిద్ర మన ఆరోగ్యానికి హానీ చేస్తుందని పేర్కొంటున్నారు. మరి ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలొస్తాయో తెలుసుకుందాం పదండి..
తలనొప్పి: మన నిద్రను నియంత్రించడానికి మన శరీరంలో సెరోటోనిన్ అనే హర్మోన్ విడుదల అవుతుంది. అయితే ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల ఈ హార్మోన్ మనపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందట. దాంతో Neurotransmitters అంతరాయం కలిగి తలనొప్పి స్టార్ట్ అవుతుంది. అంతేకాదు గంటలకు గంటలకు ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల ఆకలి పెరుగుతుంది. దీంతో కూడా మీకు తలనొప్పి వచ్చే ప్రమాదం ఉంది.
back pain
వెన్ను నొప్పి: ఎక్కువ సేపు కూర్చోవడం వల్లే కాదు.. ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల కూడా వెన్ను నొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ సమయం పడుకునే వారు పక్కాగా వెన్ను నొప్పితో బాధపడతారట. ముఖ్యంగా సమాంతరంగా ఉండే ప్లేస్ లో కాకుండా ఎగుడు దిగుడు ఉన్న పరుపుపై పడుకోవడం వల్ల వెన్ను నొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎలా పడితే అలా పడుకోవడం వల్ల కూడా వెన్ను నొప్పి వస్తుందట.
డిప్రెషన్: డిప్రెషన్ చాలా డేంజర్ జబ్బు. దీని నుంచి సాధారణంగా బయటపడలేము. అయితే అతిగా నిద్రిస్తే కూడా డిప్రెషన్ బారిన పడతారట. సమయానికి మించి నిద్రపోవడం వల్ల డిప్రెషన్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఒత్తిడిని జయించడానికి 8 గంటల నిద్ర సరిపోతుంది. కానీ రోజంతా పడుకునే ఉంటే మాత్రం మీపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది.
అలసట: ఎక్కువగా నిద్రపోతే కూడా మీరు అలసిపోతారు. అతిగా నిద్రించడం వల్ల అలసట అనే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. శరీరానికి విశ్రాంతి అవసరమే గానీ తరచుగా అదే పనిచేస్తే మాత్రం మీరు విపరీతంగా అలసిపోతారు. ఎందుకంటే ఎక్కువ సమయం పడుకోవడం వల్ల మీ నరాలు, కండరాలు దృఢంగా మారతాయట. ఆ ప్రాసెస్ వల్లే మీరు అలసిపోతారు.
మధుమేహం వచ్చే చాన్సెస్: అతిగా నిద్రపోవడం వల్ల హర్మోన్లు అసమతుల్యంగా ఉంటాయి. అంతేకాదు ఇన్సులిన్ ను కంట్రోల్ చేసే హార్మోన్లు ప్రభావితం అవడంతో మీరు బాగా అలసిపోయినట్లుగా ఫీలవుతారు. దీంతో మీ శరీరంలో శక్తి తగ్గుతుంది. దాంతో మరీ ఎక్కువ కేలరీలు ఉండే, జంక్ ఫుడ్ ను తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. దాంతో మీరు మీ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది.