Gas stove: గ్యాస్ స్టవ్ మీద ఇవి మాత్రం పెట్టకూడదు, ఎందుకో తెలుసా?
మనం గ్యాస్ స్టవ్ మీద కొన్ని రకాల పాత్రలను ఉంచకూడదట. మరి, వేటిని పెట్టకూడదో తెలుసుకుందాం...

gas stove
ఈ రోజుల్లో ఇంట్లో గ్యాస్ స్టవ్ లేనివాళ్లు ఎవరు ఉన్నారు..? పూర్వం అందరూ మట్టి పొయ్యిల్లో వంట చేస్తూ ఉండేవారు. కానీ.. ఈ రోజుల్లో ఈ గ్యాస్ స్టవ్ ల పుణ్యామా అని వంట చేయడం చాలా సులభం అయిపోయింది. అంతేకాదు... ఇంట్లో వాడే పాత్రలు కూడా మారిపోయాయి. స్టీల్, అల్యూమినియం పాత్రలకు బదులు... నాన్ స్టిక్చ సిరామిక్, గాజు పాత్రలను వాడుతున్నారు. వీటిని వాడటం కూడా చాలా సౌకర్యవంతంగా మారిపోయింది. వాడే గ్యాస్ స్టవ్ కూడా మారిపోయింది. స్టీల్ గ్యాస్ స్టవ్ కాకుండా... గాజు గ్యాస్ స్టవ్ వాడుతున్నారు. మరి గాజు గ్యాస్ స్టవ్ మీద కొన్ని రకాల పాత్రలను ఉంచకూడదట. మరి, వేటిని పెట్టకూడదో తెలుసుకుందాం...

అన్నం వండినంత కామన్ గా రెగ్యులర్ గా పప్పు వండుకుంటూ ఉంటారు. ఇక పప్పు వండాలి అంటే కుక్కర్ ఉండాల్సిందే. అయితే.. కుక్కర్లు చాలా పెద్దగా ఉంటాయి. దానిని గ్యాస్ మీద ఉంచినప్పుడు అది బర్నర్ ని పూర్తిగా కప్పేస్తుంది. దీని కారణంగా, గ్యాస్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. దీని కారణనంగా మీ గ్యాస్ స్టవ్ పై ఉన్న గాజు ఈ వేడి కారణంగా పగిలిపోయే అవకాశం ఉంది. అందుకే... కుక్కర్ లాంటివి పెద్దవి గాజు గ్యాస్ స్టవ్ మీద ఉంచకూడదు.
పదునైన వస్తువులు...
, పొరపాటున కూడా గ్యాస్ స్టవ్ గాజు ఉపరితలంపై కత్తి, ఫోర్క్ వంటి పదునైన వస్తువును ఉంచవద్దు. ఇలా చేయడం వల్ల దానిపై గీతలు పడవచ్చు, లుక్ పాడౌతుంది.
వేడి వస్తువులు..
తరచుగా ప్రజలు గ్యాస్ బర్నర్ నుండి ఏదైనా తీసి వెంటనే గ్యాస్ ఉపరితలంపై ఉంచుతారు, కానీ గాజు గ్యాస్ స్టవ్‌తో అలాంటి పొరపాటు చేయవద్దు. మీరు దానిపై ఏదైనా వేడి వస్తువును ఉంచితే, గాజు వెంటనే పగిలిపోతుంది. దీని కారణంగా దానిపై వేడి వస్తువులను ఉంచవద్దు.
బరువైన వస్తువులను పడవేయవద్దు
తరచుగా వంటగదిలో పనిచేసేటప్పుడు, మన చేతుల్లో ఉన్నవన్నీ తొందరపడి పారేస్తాము, కానీ మీరు గాజు గ్యాస్ స్టవ్‌పై ఇలా చేస్తే, అది పగిలిపోవచ్చు. అటువంటి పరిస్థితిలో, దానిపై బరువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచండి.

