ఈ ముగ్గురితో మాత్రం సీక్రేట్స్ చెప్పకండి.. మిమ్మల్ని మోసం చేస్తారు
ఎవ్వరినీ గుడ్డిగా నమ్మి సీక్రేట్స్ ను చెప్పుకోకూడదు. ఇంట్లో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని కూడా పంచుకోకూడదు. ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని మోసం చేసి అందరికీ చెప్పే ప్రమాదం ఉంది.

ఇంట్లో జరిగే కొన్ని కొన్ని విషయాలను మనం తెలిసిన వారికి, చుట్టుపక్కల వారికి, బంధువులకు, ఫ్రెండ్స్ కు చెప్పుకుంటుంటాం. ఇది సర్వ సాధారణ విషయం. కానీ కొంతమంది ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని, సీక్రేట్స్ ను కూడా చెప్పుకుంటుంటారు. ఎందుకంటే వీళ్లను బాగా నమ్ముతారు కాబట్టి.
కానీ మీ ఇంట్లో జరిగే విషయాలను, మీ సీక్రేట్స్ ను అందరితో పంచుకోవడం అస్సలు మంచిది కాదు. నమ్మకమైన వ్యక్తులు వీళ్లు అనుకోవచ్చు. కానీ ఎంతటి నమ్మకమైన వ్యక్తులైనా కొన్ని కొన్ని సార్లు మీకు వ్యతిరేకంగా మారే ఛాన్స్ ఉండకపోలేదు. ముఖ్యంగా ముగ్గురితో సీక్రేట్స్ ను అస్సలు చెప్పుకోకూడదు.
ఎందుకంటే వీళ్లు మిమ్మల్ని చీట్ చేసే ఛాన్స్ ఉంది. దీనివల్ల మీ ఇంటి పరిస్థితి గురించి అందరికీ తెలిసిపోతుంది. దీనివల్ల మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఇంటి విషయాలను ఎవరికి చెప్పకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఇంటి విషయాలను ఎవరితో చెప్పుకోకూడదు?
పనిమనిషి లేదా ఇంటి సిబ్బంది
పనిమనుషులు ఒక్క ఇంట్లోనే కాకుండా రెండు మూడు ఇండ్లల్లో పనిచేస్తుంటారు. కానీ మీ ఇంటి ప్రైవసీని పనిమనిషికి లేదా ఇంటి సిబ్బందితో అస్సలు పంచుకోకూడదు. ఎందుకంటే వీళ్లు మీ ఇంట్లో పనిచేస్తారు. కానీ మీ వ్యక్తిగత జీవితం గురించి వారికి తెలుసుకోవడానికి అర్హత లేదు. ఎందుకంటే వీళ్లు మీ ఇంట్లో పని మానేసి వేరేవారి ఇంట్లో పనిచేస్తారు. దీనివల్ల వారే మీ సీక్రేట్స్ అననింటిని వారితో చెప్పే అవకాశం ఉంది. ఇది మీ ఇంటికి మంచిది కాదు.
ఫ్రెండ్స్
ఫ్రెండ్స్ తో కూడా మీ ఇంటి ప్రైవసీని షేర్ చేసుకోకూడదు. వీళ్లు మీ ఫ్రెండ్స్ కావొచ్చు. కానీ మీ ఇంటి సభ్యులైతే కారు. కాబట్టి వీరికి మీ ఇంటి గురించి ప్రతీదీ తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంటి ప్రైవసీనే మీ బలం. అందుకే మీ బలాన్ని ఇతరులతో పంచుకుంటే మీరు బలహీనులవుతారు.
పొరుగువారితో
మీ ఇంటి ప్రైవసీని పొరుగువారితో కూడా షేర్ చేసుకోకూడదు. ఎందుకంటే పొరుగువారితో చాలా సార్లు గొడవలు, విభేదాలు వస్తూనే ఉంటాయి. ఇలాంటప్పుడు వారు మీ ఇంటి సీక్రేట్స్ గురించి ఇతరుల ముందే చెప్పేస్తుంటారు. దీనివల్ల మీరు ఎంతో బాధపడాల్సి వస్తుంది. అందుకే మీ ఇంటి గోప్యతను కాపాడటానికి లేదా మీ లేదా మీ కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితం గురించి పొరుగువారితో పంచుకోకండి.