Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi mynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • మునగాకు, మునక్కాయలను పురుషులు తింటే ఏమౌతుందో తెలుసా?

మునగాకు, మునక్కాయలను పురుషులు తింటే ఏమౌతుందో తెలుసా?

మునక్కాయ పురుషుల లైంగిక పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తుంది. అంతేకాదు మానసిక సమస్యలను కూడా తొలగిస్తుంది.   

Mahesh Rajamoni | Published : Apr 08 2023, 12:02 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Moringa Leaves

Moringa Leaves

మునగకాయలు పురుష లైంగిక పనితీరును బాగా పెంచుతాయి. అంతేకాదు పురుషుల మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని నిపుణులు అంటున్నారు. మునక్కాయలను, మునగాకులను ఎన్నో ఏండ్లు భారతీయ వంటకాల్లో ఉపయోగిస్తున్నారు. మాంసం కూర, సూప్, ఊరగాయలు, సాంబార్ తో సహా వివిధ రకాల వంటకాలను తయారు చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. మోరింగా ఒక సూపర్ ఫుడ్. ఇది మెరుగైన మానసిక స్థితికి, మంచి శృంగారాన్ని ప్రోత్సహిస్తుంది. మునగాకుతో కలిగే కొన్ని సెక్స్ ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

26
Asianet Image

మునగాకులో యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన సహజ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడానికి, లైంగిక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. దీనిలో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచే,  లిబిడోను పెంచే, లైంగిక సామర్థ్యాన్ని పెంచే అద్భుతమైన కామోద్దీపన లక్షణాలు ఉంటాయి. మునగాకులో ఉండే లక్షణాలు లైంగిక పనిచేయకపోవడాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి, స్పెర్మ్ కౌంట్ ను పెంచడానికి, అంగస్తంభన (ఇడి) చికిత్సకు మునగ పువ్వులు, విత్తనాలు ఎంతో సహాయపడతాయి. అందుకే వీటిని ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. 

36
Asianet Image

విటమిన్ ఎ, విటమిన్ సి లు సమృద్ధిగా ఉన్న మునగాకు స్పెర్మ్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. అలాగే శరీరమంతా రక్త ప్రవాహం, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా పురుషాంగానికి. మునగాకు మానసిక స్థితిని కూడా పెంచుతుంది, ఇది సెక్స్  డ్రైవ్ ను పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. 
 

46
Asianet Image

టెరిగోస్పెర్మిన్ అనేది మునగ ఆకులలో కనిపించే సహజ పదార్ధం. ఇది గాఢంగా నిద్రపట్టడానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది కడుపు అసౌకర్యాన్ని కూడా తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. కేంద్ర నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది. కండరాల సడలింపుగా కూడా పనిచేస్తుంది.

56
Asianet Image

మునక్కాయ అద్భుత కూరగాయ. ఇది పురుష లైంగిక పనితీరుకు తోడ్పడటమే కాకుండా.. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం కూడా చేస్తుంది. అంతేకాదు మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. దీనిలో యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. 

66
Asianet Image

మునగాకును పచ్చిగా లేదా వండిన లేదా ఎండబెట్టి వివిధ మార్గాల్లో తినొచ్చు. కాండం, ఆకులు, పువ్వులు, విత్తనాలతో సహా ఈ మొక్క ప్రతి భాగం తినదగినది. దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
 
Recommended Stories
Top Stories