మగవారూ.. మీ పురుషాంగాన్ని వంగేలా చేసే పెరోనీ వ్యాధి గురించి జర జాగ్రత్త..
చాలా మంది పురుషులు ఈ రకమైన అనారోగ్య సమస్యతో బాధపడుతుంటారు. పెరోనీ వ్యాధి వల్ల పురుషాంగం వక్రంగా అంటే వంగిపోతుంది. అంతేకాదు ఇది అంగస్తంభనకు కూడా కారణమవుతుంది. ముఖ్యంగా కలయిక సమయంలో విపరీతమైన నొప్పి పుడుతుంది.

penis
సెక్స్ లైఫ్ గురించి చర్చించే వాళ్లు చాలా తక్కువే.. దీని గురించి మాట్లాడితే ఏదో తప్పు చేసిన వాళ్లలాగ ఫీలవుతుంటారు. నిజానికి దీని గురించి షేమ్ గా ఫీలవ్వడానికేం లేదు. ముఖ్యంగా ప్రైవేట్ ఫార్ట్స్ కు ఏదైన సమస్య వస్తే.. దానిగురించి ఇంట్లో వాళ్లకే కాదు డాక్టర్లకు చెప్పడానికి కూడా వెనకాడుతుంటారు. ఇలాంటి విషయంలో సిగ్గుగా భావిస్తే మాత్రం ఎన్నో తిప్పలు పడాల్సి వస్తుంది. ఇక అసలు విషయానికొస్తే ఈ మధ్యకాలంలో చాలా మంది మగవారు ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. అదే పెరోనీ వ్యాధి. ఇది పురుషుల శరీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాదు మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
penis
పెరోనీ వ్యాధి అంటే ఏమిటి?
మాయో క్లీనిక్ ప్రకారం.. పెరోనీ వ్యాధి పురుషాంగం పై అభివృద్ధి చెందే ఫైబరస్ మచ్చ కణజాలం కారణంగా ఏర్పడే సమస్య. దీనినే ప్లేక్ అని కూడా అంటారు. ఇది పురుషాంగంపైనే అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల పురుషాంగం వక్రంగా అంటే వంగుతుంది. అంతేకాదు ఇది అంగస్తంభన లోపానికి కూడా దారితీస్తుంది.
penis
ఇది చాలా అరుదుగా సంభవిస్తుంది. యునైటెడ్ స్టేట్ లో 0.5 శాతం వయోజనులను, 40 ఏండ్లున్న పురుషుల్లో 8 నుంచి 10 శాతం మందిని ఇది ప్రభావితం చేస్తుంది. అలా అని మీకు రాదు అనుకోకూడదు. ఈ అరుదైన వ్యాధి పురుషులను ఎన్నో విధాలుగా ఆందోళనకు గురిచేస్తుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ మెనేజ్డ్ కేర్ 2013 లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. పెరోనీ రోగుల్లో దాదాపుగా సగం మంది నిరాశతో బాధపడుతున్నారని కనుగొన్నారు. ఈ వ్యాధి వల్ల సైక్స్ లో పాల్గొనలేరు. అంతేకాదు ఇది అంగ స్తంభనకు దారితీస్తుంది. చివరకు ఇది మిమ్మల్ని తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తుంది.
లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది
పెరోనీ వ్యాధితో బాధపడే మగవాళ్ల పురుషాంగం క్రమంగా వంకరగా మారుతుంది. అంటే ఇది పైకి లేదా కిందికి వంగి ఉంటుంది. లేదా ఒక వైపునకు వంగి ఉంటుందని మాయో క్లీనిక్ తెలిపింది.
penis
గమనించాల్సిన ఇతర లక్షణాలు
పురుషాంగం వక్రంగా మారడానికి కారణం ఏంటి అని కాకుండా .. పెరోనీ వ్యాధి ఇతర లక్షణాలను కూడా కలిగిస్తుంది. అవేంటంటే..
పురుషాంగం చర్మం కింద మచ్చ కణాజాలం ఏర్పడుతుంది
అంగస్తంభన లోపం
పురుషాంగం కుదించుకుపోవడం
పురుషాంగం నొప్పి
PENIS
ఈ అరుదైన వ్యాధికి కారణం ఏంటి?
పెరోనీ వ్యాధి రావడానికి నిర్ధిష్ట కారణమంటూ ఏమీ లేదు. అయితే పురుషాంగంలో ఫలకం ఏర్పడటం వల్ల ఈ వ్యాధి బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు.
పెరోనీ వ్యాధి సాధారణంగా పురుషాంగానికి తరచుగా గాయం అయితే వస్తుందని నిపుణులు భావిస్తున్నారు. సెక్స్, అథ్లెటిక్ యాక్టివిటీ, ప్రమాదాలు తరచుగా జరిగినప్పుడు పురుషాంగం దెబ్బతినొచ్చు. ఏదేమైనా పురుషాంగానికి ఏ గాయం అయినా తొందరగా గుర్తింబడదని మాయో క్లీనిక్ చెప్తోంది.
penis
ప్రమాదంలో ఎవరున్నారు?
గాయం మాత్రమే పెరోనీకి కారణం కాదు. గాయాన్ని నయం చేస్తే.. మచ్చ కణజాలాలు ఏర్పడకుండా నిరోధించొచ్చు. అలాగే ఈ వ్యాధి పెద్దది కాదు. దీనికి ఇతర ప్రమాదకారకాలు కూడా ఉన్నాయి.
వంశపారంపర్యత.. అంటే మీ కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరికీ ఈ వ్యాధి ఉంటే.. మీకు కూడా వచ్చే అవకాశం ఉంది.
కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ తో బాధపడేవారు
ప్రమాద కారకాల్లో వయస్సు కూడా ఉంది
డాక్టర్ దగ్గరకు ఎప్పుడు వెళ్లాలి?
పెరోనీ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. అలాగే సెక్స్ లో పాల్గొనకపోవడం, అంగస్తంభన లోపం, లైంగిక పనితీరు గురించి ఆందోళన చెందడం, ఒత్తిడికి గురవ్వడం, సంతానోత్పత్తి సమస్యలు, పురుషాంగం నొప్పి వంటి సమస్యలొస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.