MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • శృంగారాన్ని మరింత ఆస్వాధించాలంటే.. దీన్నుంచి బయటపడాల్సిందే..!

శృంగారాన్ని మరింత ఆస్వాధించాలంటే.. దీన్నుంచి బయటపడాల్సిందే..!

లైంగిక అన్వేషన మానవ స్వభావంలో ఒక అంతర్భాగం. ఎందుకంటే ఇది మానసిక, శారీరక ఆరోగ్యాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. మీ సెక్స్ లైఫ్ లో కాస్త మసాలా జోడించాలంటే మాత్రం మీ కంఫర్ట్ జోన్ నుంచి ఖచ్చితంగా బయటపడాలంటున్నారు నిపుణులు. 
 

Mahesh Rajamoni | Published : May 28 2023, 10:52 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

సెక్స్ గుట్టుగా ఉంచాల్సిన విషయమని చాలా మంది భాగస్వామితో కూడా దీనిగురించి మాట్లాడరు. నిజానికి దీని గురించి ఒకొరికొకరు మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. దీని వల్ల వారు సెక్స్  లైఫ్ లో సంతోషంగా ఉన్నారో లేదో తెలుస్తుంది. నిజానికి లైంగిక జీవితం మీ బంధాన్ని పెంచడమే కాకుండా మీ ఇద్దరి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. సెక్స్ సాన్నిహిత్యం మిమ్మల్ని మీ భాగస్వామికి మరింత దగ్గర చేస్తుంది. సెక్స్ శారీరక సంతృప్తితో పాటుగా మీ రోజు వారి జీవితంలో మిమ్మల్ని ఆనందంగా ఉంచుతుంది. 
 

28
Asianet Image

శృంగారానికి ప్రాధాన్యతను ఇస్తే భార్యాభర్తల మధ్యలు గొడవలు జరిగే అవకాశం చాలా తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. పలు పరిశోధనల ప్రకారం.. విడాకులు తీసుకునే అవకాశం కూడా చాలా వరకు తగ్గుతుందట. నిజానికి సెక్స్ మిమ్మల్ని ఎన్నో రోగాల నుంచి కాపాడుతుంది కూడా.. 
 

38
Asianet Image

మీ కంఫర్ట్ జోన్ నుంచి ఎందుకు బయటకు రావాలి? 

సెక్స్ లో పాల్గొంటున్నామా అంటే పాల్గొంటున్నాం అన్నట్టు కాకుండా దీనికి కాస్త మసాలా జోడించడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. సెక్స్ సన్నిహితంగా ఉండొచ్చు. కానీ అభిరుచి లేకుండా ఉండే సెక్స్ బోరింగ్ గా ఉంటుంది. మీ సెక్స్ లైఫ్ ఇంట్రెస్ట్రింగ్ గా, మరింత ఆనందాన్ని కలిగించేదిగా ఉండాలంటే మీరు మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడటం చాలా ముఖ్యం. అంటే మీ సాధారణ దినచర్యను వదిలేయడం. మీరు సాధారణంగా చేయనిదాన్ని చేయడమే దీనర్థం. ఇందుకోసం ఏం చేయాలంటే?  

48
Asianet Image

ఏదైనా చిన్న పనిని చేయండి: అది మిమ్మల్ని ఎక్కడి వరకు తీసుకెళుతుందో చూడండి. అంటే మీరు ఒకరికొకరు బాడీ మసాజ్ లు చేసుకోవడం, లేదా నగ్నంగా పడుకోవడం వంటివి చేయండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మీ భాగస్వామికి మంచి సర్ప్రైజ్ ను ఇస్తాయి. 

కొత్త ప్లేస్ కు వెళ్లండి: అది విలాసవంతమైన హోటల్ రూం కావొచ్చు. లేదా మీ లివింగ్ రూమ్ లో  కూడా కావొచ్చు. లేదా మీరు సాధారణంగా చేసే దానికంటే భిన్నమైన ఫర్నిచర్ పై సెక్స్ ను ప్రయత్నించండి. ఇది మీకు మంచం మీదికంటే ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనేలా కూడా చేస్తుంది. 
 

58
Asianet Image

అయితే మీరు సెక్స్ చేసేటప్పుడు మీ లైంగిక అపోహల గురించి పూర్తిగా మర్చిపోండి. మీ భాగస్వామితో దీని గురించి సిగ్గుపడకుండా బోల్డ్ మాట్లాడటానికి ప్రయత్నించండి. ఇది మీరు సెక్స్ ను మరింత ఆస్వాధించేలా చేస్తుంది. 

68
Asianet Image

సెక్స్టింగ్ అనేది కేవలం యువత చేసే పని మాత్రమే అని చాలా మంది అనుకుంటారు. కానీ మీ వయస్సుతో సంబంధం లేకుండా మీరు దూరంగా ఉన్నప్పుడు మీ భాగస్వామికి మెసేజెస్ లేదా ఇమేజెస్ ను పంపండి. మీరు ఒకరినొకరు చూసే వరకు ఉత్సాహాన్ని, అభిరుచిని పెంచుతుంది.

78
sex

sex

మార్కెట్ లో  ఎన్నో రకాల శృంగార బొమ్మలు, యాక్సెసరీలు అందుబాటులో ఉన్నాయి. మీరు స్వయంగా బొమ్మలను ఉపయోగించొచ్చు లేదా శృంగారం చేసేటప్పుడు మీ ఆనందాన్ని రెట్టింపు చేయడానికి వీటిని ఉపయోగించండి. 

88
Asianet Image

సెక్స్ అనేది ఒక అద్భుతమైన అనుభవం. దీన్ని ఆస్వాధించాలంటే ఎన్నో మార్గాలను ప్రయత్నించాలి. మీ లైంగికతను అన్వేషించడం మరింత సంతృప్తికరమైన లైంగిక జీవితానికి దారితీస్తుంది. వ్యక్తులు కొన్ని లైంగిక పద్ధతులకు తమను తాము పరిమితం చేసుకున్నప్పుడు లేదా సిగ్గు లేదా అపరాధం కారణంగా ప్రయోగాలకు దూరంగా ఉన్నప్పుడు మీరు లైంగిక ఆనందాన్ని పొందలేరు. విభిన్న స్థానాలు, బొమ్మలు, పద్ధతులతో ప్రయోగాలు చేయడం , వారి శరీరాలు, ప్రాధాన్యతలను బాగా అర్థం చేసుకోవడం వారి భాగస్వాములతో మరింత సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడానికి సహాయపడుతుంది. మీ లైంగిక కంఫర్ట్ జోన్ నుంచి బయటపడటం మీకు ఇష్టమైన వంటకానికి అదనపు మసాలాను జోడించడం వంటిదే. ఇది రోజువారీ బోరింగ్ సెక్స్ లైఫ్ నుంచి మైండ్ బ్లోయింగ్ సెక్స్ కు తీసుకెళుతుంది. 

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
 
Recommended Stories
Top Stories