ఈ ఈకలతో ఇంట్లో ఒక్క బల్లి లేకుండా పోతుంది
ఇంట్లో బల్లులను వెళ్లగొట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఒక పక్షి ఈకలతో ఇంట్లో ఒక్క బల్లి కూడా లేకుండా చేయొచ్చు. ఇంతకీ అవి ఏ పక్షి ఈకలంటే?
ప్రతి ఇంట్లో ఈగలు, దోమలు, చీమలు ఉండటం ఎంత కామనో, బల్లులు ఉండటం కూడా అంతే కామన్. కానీ ఈ బల్లులు ఇంటిని మురికిగా మార్చడంతో పాటుగా చిరాకు కలిగిస్తుంటాయి. ముఖ్యంగా ఇవి బెడ్ రూం, బాత్ రూం, కిచన్ రూం, అల్మారా దగ్గర ఎక్కువగా ఉంటాయి. తరిమికొడదామంటే చటుక్కున దాక్కుంటాయి. అందుకే వీటిని ఇంట్లోంచి లేకుండా చేయడం పెద్ద టాస్క్ లాగే ఉంటుంది.
lizard
కొంతమందికి అయితే బల్లులంటే విపరీతమైన భయం కూడా ఉంటుంది. ఇంకొందరు వీటిని చూస్తూనే ముఖాన్ని వికారంగా పెడుతుంటారు. అందుకే వీటిని ఇంట్లోంచి తరిమికొట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాయి. అయినా బల్లులు మాత్రం ఇంటిని అస్సలు వదిలిపెట్టవు. కానీ మీరు ఒక పక్షి ఈకలతో మీ ఇంట్లో బల్లులు లేకుండా చేయొచ్చు. అంతేకాదు ఈ ఈకలు మీ ఇంటిని కూడా అందంగా చేస్తాయి. అవి ఏ పక్షి ఈకలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
నెమలి ఈకలతో బల్లులుండవ్..
నెమళ్లు ఎంతో అందంగా ఉంటాయి కదూ. ఇక వీటి ఈకలు కూడా చూడచక్కగా ఉంటాయి. ఎంతో అందంగా ఉండే ఈ నెమలి ఈకలు ఇంట్లో బల్లులను తరిమికొట్టడానికి కూడా ఉపయోగపడతాయి తెలుసా? అవును మీరు విన్నది అక్షరాల నిజమే.
మీ ఇంట్లో నెమలి ఈకలు ఉంటే మీ ఇంట్లోకి బల్లులు వచ్చే సాహసం చేయవు. ఇక ఇంట్లో ఉండే బల్లులు కూడా బయటకు పారిపోతాయి. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా మార్కెట్లో నెమలి ఈకలను కొని బల్లులు తిరిగే ప్రదేశంలో అతికించండి. అలాగే బల్లులు తిరిగే రూముల్లో ఉంచండి. అక్కడున్న బల్లులన్నీ పారిపోతాయి.
నెమలి ఈకలను ఎలా వాడాలి?
అయితే నెమలి ఈకలను గదుల్లో ఉంచేందుకు అవసరమైన స్థలం గనుక లేకపోతే టెన్షన్ పడకుండా టేప్ తో గోడకు అతికించండి.
ఇది కాకుండా.. మీరు తలుపులు, కిటికీలు ఇలా ఎక్కడో ఒక చోట నిమలి ఈకలను ట్రాప్ చేయొచ్చు. ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఈ ప్రదేశాల నుంచే ఇంట్లోకి బల్లులు వస్తాయి.
నెమలి ఈకలకు బల్లులు ఎందుకు పారిపోతాయి?
నెమలి ఈకలకు బల్లులు ఎందుకు పారిపోతాయనే డైట్ వస్తుంటుంది. అయితే నెమలి ఈకల నుంచి ఒక రకమైన సహజ వాసన వస్తుంది. ఈ వాసన బల్లులకు నచ్చదట. అలాగే ఈ పెద్ద పెద్ద ఈకలను బల్లులు చూసినప్పుడు వాటిని వేటాడే పక్షి వచ్చిందనే భయం కలుగుతుంది.
దీనివల్లే నెమలి ఈకల నుంచి బల్లులు ఎందుకు పారిపోతాయట. అలాగే నెమలి ఈకల రంగులు చాలా కలర్ ఫుల్ గా, ముదురు రంగులో ఉంటాయి. అయితే బల్లులు వీటికి దూరంగా ఉంటాయి కాబట్టి వాటికి దూరంగా పారిపోతాయి.