మగవారిలో శుక్రకణాల లోపానికి కారణం ఇదేనా..
Sperm Count: ప్రస్తుతం చాలా మంది మగవారు స్పెర్మ్ కౌంట్ లోపంతో బాధపడుతున్నారు. దీనికి కారణాలు ఏంటన్న విషయంపై చైనాలో ఓ అధ్యయనం నిర్వహించారు. అందులో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే..

Sperm Count: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది మగవారు లైంఘిక సమస్యలతో బాధపడుతున్నారని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఎక్కువ మంది పురుషులు శుక్రకణాల లోపంతో బాధపడుతున్నట్టు తేలింది. ఈ లోపంతో ఎంతో మంది దంపతులకు పిల్లలు కలగడం లేదు.
sperm
శుక్రకణాల లోపానికి రకరకాల కారణాలున్నాయి. ముఖ్యంగా కొంతమందిలో బలహీనమైన శుక్రకణాలు ఉండటం, అందులో తక్కువ మొత్తంలో ఉండటం వంటి సమస్యలు మనం తీసుకునే ఆహారంపై, వాతావరణంలో కలిగే మార్పుల వల్ల ఇలా జరుగుతుందని ఓ అధ్యయనం స్పష్టం చేసింది.
sperm
ఈ అధ్యయనం ప్రకారం.. మనం నివసించే ప్రాంతాన్ని బట్టి కూడా స్పెర్మ్ కౌంట్ ఆధారపడి ఉంటుందని తేల్చి చెబుతోంది. శుక్రకణాలు పెరగడం , తగ్గడం అనేది మనం నివసిస్తున్న ప్లేస్ ను బట్టి మార్పు చెందుతూ ఉంటాయట.
sperm
1970 లో యునైటెడ్ స్టేట్స్ లో నిర్వహించిన ఓ అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఈ అధ్యయనం ప్రకారం. యూరప్, ఉత్తర అమెరికా,ఆస్ట్రేలియాలో ఉంటున్న మగవారిలో sperm growth rate చాలా తగ్గిందని తేల్చి చెప్పింది. ఇందుకు కారణాలను లేకపోలేదు. అక్కడ పెరిగిన వాయు కాలుష్యం మూలంగానే అక్కడి పురుషుల్లో శుక్రకణాల రేటు తగ్గిందని శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తంచేశారు.
మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి ప్రధాన కారణం.. వారు కలుషితమైన గాలిని పీల్చడమేనని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. దీంతో పాటుగా ఒత్తిడితో కూడిన జీవిన విధానం వల్ల మెదడు పై జననేంద్రియాలపై చెడు ప్రభావం పడుతుందట. ఈ కారణంగా కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
sperm
Jama Newark Open Journal లో ప్రచురితమైన కొత్త అధ్యయనం ప్రకారం.. చైనాలోని 130 ప్రాంతాల్లో మగవారి ఆరోగ్య పరిస్థితిపై సమాచారాన్ని సేకరించి ఈ ఫలితాలను వెళ్లడించారు. ఈ పరిశోధనలో దాదాపుగా 34,000 మంది మగవారు Longevity పొందారని నిపుణులు వెల్లడించారు.
పురుషుల్లో శుక్రకణాలు దెబ్బతినడానికి ప్రధాన కారణం గాలి కాలుష్యమేనని అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. శుక్రకణాలు డెవలప్మెంట్ అవుతున్న సమయంలో తీవ్రమైన గాలి కాలుష్యం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చి స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నారు. మొత్తంగా వాయు కాలుష్యం శుక్రకాణాల కౌంట్ పై నేరుగానే ప్రభావం చూపెడుతుందనిన అధ్యయనాలు తేల్చి చెప్పడం గమనార్హం.