వేసవిలో అల్లం తింటే వేడి చేస్తుందా..? ఇంతకీ అల్లం తినాలా? వద్దా?
వేసవిలో అల్లం తింటే శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుందని చాలా మంది అల్లాన్ని పక్కన పెట్టేస్తుంటారు. మరి ఈ సీజన్ లో అల్లాన్నితినాలా? వద్దా అనే విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసా..

అల్లం ఎన్నో దివ్య ఔషదాల గణి. ఇందులో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి. అల్లంతో ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అందుకే ఈ అల్లాన్ని దశాబ్దాల నుంచి ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు.
ఎన్నో ఔషద గుణాలున్న ఈ అల్లం ప్రతి వంటగదిలో తప్పక ఉంటుంది. అయినా ఈ అల్లం మన వంటగదిలో ముఖ్యమైన పదార్థం కూడా ఆయే. దీనికి లవంగాలను, వెల్లుల్లిని కలిపితే ఎంతో రుచిగా మారుతుంది. అలాగే మన శరీరానికి కూడా ఎంతో మంచి చేస్తుంది.
అల్లంలో యాంటీ మైక్రోబయల్ పుష్కలంగా ఉంటుంది. అయితే అల్లంలో ఉండే Diaphoretic action వల్ల ఒంట్లో వేడి పెరుగుతుందని అంటుంటారు. అందుకే ఈ వేసవిలో చాలా మంది అల్లాన్ని పక్కన పెట్టేస్తుంటారు.
అల్లాన్ని రోజుకు ఎంత మొత్తం తీసుకుంటే మంచిది.. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతిరోజూ ఉదయాన్నే కాస్త అల్లం, తేనె, నిమ్మరసం కలుపుకుని తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే మీ ఆరోగ్యం కూడా బావుటుంది. అయితే అల్లం వల్ల శరీరంలో వేడి పెరిగి.. అది చెమట రూపంలో బయటకు వస్తుంది. ఆ చెమట మన శరీరాన్ని చల్లబడేలా చేస్తుంది. కాబట్టి వేసవిలో అల్లం తినడం మంచిదే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అలా అని అల్లాన్ని మోతాదుకు మించి అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సీజన్ లో 4 గ్రాముల అల్లం తీసుకుంటే సరి. ఇంత అల్లం ముక్క మన శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది.
ఈ సమస్యలున్నవారు తీసుకోవద్దు.. మధుమేహులు, రక్తస్రావం సమస్యతో బాధపడుతున్నవారు అల్లం తీసుకోకపోవడమే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఇది దీనివల్ల ఒంట్లో వేడి పెరిగి.. శరీరం అదుపుతప్పేలా చేస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలున్నవారు అల్లాన్ని తీసుకోవాలనుకుంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
అయితే ఈ సీజనల్ అల్లాన్ని తినడం వల్ల వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అల్లం ఒంట్లో వేడిని పెంచేసి చెమట బాగా పట్టేలా చేస్తుంది. దీంతో మీ వెయిట్ లాస్ ప్రక్రియ చాలా సులువు అవుతుంది.
అల్లం టీ ఉపయోగాలు.. అల్లం టీ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. ఇవి ఎన్నో ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. ముఖ్యంగా ఈ టీని తరచుగా తాగడం వల్ల ముఖం కాంతివంతంగా తయారవుతుంది. అలాగే కడుపు ఉబ్బరం, అజీర్థి వంటి ఎన్నో సమస్యలు దూరమవుతాయి.
ginger
అల్లం వల్ల కలిగే ఇతర లాభాలు.. అల్లాన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అజీర్థి సమస్యలు తొలగిపోతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. నోట్లో కాస్త అల్లం ముక్కను పెట్టుకుంటే వికారం కూడా తగ్గుతుంది.
కీళ్ల నొప్పులు, కీళ్ల వాపు , కండరాల నొప్పిని తగ్గించేందుకు అల్లం ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు జలుబు, గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యలను తగ్గిస్తుంది.
డయాబెటీస్ పేషెంట్లకు రోజు కొంత అల్లం ముక్కను తినడం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. కాబట్టి ఈ సీజన్ లో తింటే వేడి చేస్తుందని అల్లాన్ని పక్కన పెట్టేయకండి..