Independence Day Greetings 2022: స్వాతంత్య్ర దినోత్సవ విషెస్, కోట్స్, వాల్ పేపర్స్, వాట్సాప్ స్టేటస్ లు మీకోసం
Independence Day Greetings 2022: 1858 నుంచి 1947 వరకు మనదేశాన్ని పాలించిన బ్రిటీషర్ల పాలన నుంచి విముక్తి పొందినందుకు ప్రతి ఏడాది భారతదేశం స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంటుంది. ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా కోసం కొన్ని ఫోటోలు, కోట్స్, వాట్సాప్ స్టేటస్ లు.
1857 లో జరిగిన సిపాయిల తిరుగు బాటును మొదటి స్వాతంత్య్ర పోరాటంగా చెప్పుకుంటారు. ఈ తిరుగుబాటులో భారతీయులు విజయం సాధించకపోయినప్పటికీ.. చరిత్రలో ఇది ఎన్నటికీ మర్చిపోలేని ఘటనగా గుర్తుండిపోయింది. బ్రిటీష్ పాలకుల నుంచి విముక్తి కల్పించేందు ఎందరో మహానుభావులు ఎంతో త్యాగం చేశారు. వారిని స్మరించుకుంటూ ఈ ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఫ్రీడమ్ ఫైటర్స్ కు సెల్యూట్ చేద్దాం.. అయితే ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా మీ ప్రియమైన వారికి స్ఫూర్తినిచ్చే దేశభక్తి కోట్స్, శుభాకాంక్షలు, చిత్రాలు మీ కోసం..
మనకు ఈ స్వేచ్చా, స్వాతంత్య్రాలను అందించిన అమర వీరులకు పాదాభి వందనం.. స్వాతంత్య్ర దినోత్సవం శుభాకాంక్షలు..
ఇలా ఇండ్లలో మనం హాయిగా ఉండటానికి సైనికులే కారణం. మనకు స్వాతంత్య్రాన్ని ప్రసాదించిన బ్రేవ్ హార్ట్స్ కు సెల్యూట్ చేద్దాం.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు..
ఇప్పటిలాగే మన మాతృభూమి రాబోయే కాలంలో కూడా స్వతంత్య్రంగా, స్వేచ్ఛగా ఉండనీయండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే..
మన జాతీయ జెండా ఎగిరేది గాలి ద్వారా కాదు..
దానిని రక్షించడం కోసం ప్రాణాలను త్యాగం చేసిన ప్రతి సైనికుడి చివరి శ్వాస వల్ల ఎగురుతుంది. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
నేడు మనం జరుపుకుంటున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఎందరో వీరుల త్యాగ ఫలం.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
బానిన బతుకులను తెంచి.. స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను ప్రసాధించిన వీరుల త్యాగాలు వెలకట్టలేనివి.. ఎన్నటికీ ఇవి స్ఫూర్తిదాయకమే.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం ధన, మాన, ప్రాణ త్యాగం చేసిన యోధుల జీవితం ఎప్పటికీ చిరస్మరణీయమే.. వారి పోరాటాలు.. నేటి యువతకు మార్గదర్శకం. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
దేశభక్తి మీరు ధరించే బట్టల్లో, మనం అతికించుకునే స్టిక్కర్లల్లో కాదు.. మన గుండెలో ఉండాలి.. భారత మాతాకి జై.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు