మగవాళ్లు.. రాత్రిపూట పాలు, ఒక అరటిపండును తింటే ఏమౌతుందో తెలుసా?
రాత్రిపూట ఒక గ్లాస్ పాలను తాగి, ఒక అరటిపండును పురుషులు తింటే ఎన్నో లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసా?
ఆరోగ్యంగా ఉంటే ఏ జబ్బులు రావు. అందుకే ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ హెల్తీ ఫుడ్ ను తింటారు. అలాగే ప్రతిరోజూ వ్యాయామం చేస్తారు. ఆరోగ్యకరమైన వాటిలో పాలు, అరటిపండ్లు కూడా ఉన్నాయి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
పాలను, అరటిపండును ఉదయాన్నే తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరూ వీటిని విడిగానే తింటుంటారు. కానీ రాత్రిపూట అరటిపండును పాలలో కలిపి తింటే పురుషులకు ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా?
పాలు, అరటిపండు కాంబినేషన్ పురుషుల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అసలు పాలు, అరటిపండు పురుషులకు ఎలాంటి మేలు చేస్తాయి? ఏయే సమస్యలను తగ్గిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
అరటిపండు & పాలలోని పోషకాలు:
పాలు, అరటిపండు రెండింటిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అరటిపండులో విటమిన్ ఎ, విటమిన్ బి , విటమిన్ సి, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.
ఇకపోతే పాలలో విటమిన్ ఎ, విటమిన్ డి, ప్రోటీన్, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అరటి, పాలలో ఉండే ఈ పోషకాలన్నీ మన ఆరోగ్యానికి మెంతో మంచివి.
రాత్రిపూట పాలు, అరటిపండును కలిపి తింటే పురుషులకు కలిగే లాభాలు:
శక్తిని పెరుగుతుంది:
ఎప్పుడూ అలసిపోయినట్టుగా, బలహీనంగా ఉండే మగవారు రాత్రిపూట గ్లాస్ పాలలో ఒక అరటిపండు వేసుకుని తింటే చాలా మంచిది. ఎందుకంటే ఈ కాంబినేషన్ వారి ఒంట్లో శక్తి స్థాయిలను పెంచుతుంది. బలహీనతను తొలగిస్తుంది.
రక్తపోటును నియంత్రిస్తుంది:
అధిక రక్తపోటు ప్రాణాలను చాలా ప్రమాదకరం. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రాత్రిపూట పాలలో అరటిపండును వేసుకుని పడుకునే ముందు తింటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. అరటిపండు, పాలు రెండింటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది హై బీపీని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది.
బరువు పెరగడానికి మంచిది:
మరీ బక్కగా ఉన్నామనే వారికి కూడా ఈ కాంబినేషన్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వీళ్లు రాత్రి పడుకునే ముందు గ్లాస్ పాలలో ఒక అరటిపండును వేసుకుని తింటే బరువు పెరుగుతారు. దీనికోసం ఒక గ్లాసు పాలలో అరటిపండు, తేనె, డ్రై ఫ్రూట్స్ కలిపి తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.
జీర్ణక్రియకు మంచిది:
మగవారి జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా పాలు, అరటిపండు బాగా సహాయపడతాయి. పాలు, అరటిపండులో ఉండే ఫైబర్, విటమిన్లు, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అంతేకాదు రాత్రి పడుకునే ముందు పాలలో అరటిపండును వేసుకుని తింటే మలబద్దకం, ఎసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గిపోతాయి.
నిద్ర బాగుంటుంది:
పని ఒత్తిడి, ఇంటి బరువు బాధ్యతల వల్ల మగవారు బాగా ఆలోచిస్తుంటారు. దీనివల్ల రాత్రిపూట మగవారికి నిద్ర పట్టదు. మీరు కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటుంటే మాత్రం రాత్రిపడుకునే ముందు ఖచ్చితంగా ఒక గ్లాసు పాలు, ఒక అరటిపండును తినండి.
ఈ రెండింటిలో ఉండే పోషకాలు నిద్రలేమి సమస్యను తగ్గిస్తాయి. మీకు రాత్రిళ్లు బాగా నిద్రపట్టేటా చేయడానికి సహాయపడతాయి. అంతేకాదు ఇవి మీకు మంచి విశ్రాంతిని కూడా కలిగిస్తాయి.