హెన్నా, కలర్ పెట్టకుండా తెల్ల జుట్టు నల్లగా కావాలంటే ఇలా చేయండి
ఈ రోజుల్లో చాలా మందికి చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తోంది. ఈ తెల్ల వెంట్రుకలను దాచేందుకు హెన్నా లేదా కెమికల్ డై లను పెడుతుంటారు. కానీ మీరు కొన్ని సహజ పద్దతుల్లోనే తెల్ల వెంట్రుకలు కనిపించకుండా చేయొచ్చు. అలాగే తెల్ల వెంట్రుకలు రావడం కూడా ఆగుతుంది. అదెలాగంటే?
వయసు పెరిగిన వారికి తెల్ల జుట్టు రావడం చాలా కామన్. ఇది వృద్ధాప్యంలో ఎక్కువగా జరుగుతుంది. అయితే ఈరోజుల్లో చాలా చిన్న వయసు వారికి కూడా తెల్ల జుట్టు వస్తోంది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
తప్పుడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, మారుతున్న జీవనశైలి వల్ల చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
కారణమేదైనా తెల్ల వెంట్రుకలు ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తాయి. దీనివల్ల ఇష్టమున్న జుట్టును వేసుకోలేం. ఈ తెల్ల వెంట్రుకలు కనిపించకుండా ఎప్పుడూ కెమికల్ హెయిర్ కలర్ ను వాడాల్సి వస్తుంది.
ఇది కూడా వారం రోజుల్లోనే పోతుంది. కానీ వీటివల్ల జుట్టు బాగా దెబ్బతింటుంది. అయితే తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి కొన్ని కొన్ని నేచురల్ రెమెడీస్ బాగా ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
తెల్ల వెంట్రుకలు ఎందుకు వస్తాయి?
తెల్ల వెంట్రుకలు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. చెడు ఆహారపు అలవాట్లు, జెనెటిక్స్, ఒత్తిడి, వాతావరణ కాలుష్యం, కొన్ని రకాల మందులు, వ్యాధులు, వయస్సు పెరగడం వంటి కారణాల వల్ల తెల్ల జుట్టు వస్తుంది.
తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి నేచురల్ మార్గాలు
ఉసిరికాయ: ఉసిరికాయ మన ఆరోగ్యానికే కాదు జుట్టుకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఉసిరికాయను ఉపయోగించి మన జుట్టును బలంగా చేయొచ్చు.
అలాగే తెల్ల వెంట్రుకలను తిరిగి నల్లగాచేయొచ్చు. మీరు ఉసిరి పొడి లేదా తాజా ఉసిరికాయను జుట్టుకు అప్లై చేస్తే మీ జుట్టు ఎప్పటికీ నల్లగా ఉంటుంది. జుట్టు తెల్లబడే అవకాశం కూడా తగ్గుతుంది.
నిమ్మకాయ: నిమ్మకాయను జుట్టుకు మేలు చేస్తుందన్న సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. కానీ నిమ్మకాయను ఉపయోగించి మనం ఎన్నో జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు.
నిమ్మకాయలో ఉండే విటమిన్-సి జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే తెల్ల వెంట్రుకలు రావడాన్ని తగ్గిస్తుంది. తెల్ల జుట్టును నల్లగా చేస్తుంది. తేనెలో నిమ్మరసం మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేస్తే హెయిర్ కలర్ నల్లబడుతుంది.
కాఫీ పౌడర్: కాఫీలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీనిలో ఉండే కొన్ని మూలకాలు తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి సహాయపడతాయి. కాఫీ పౌడర్ ను నీటిలో మరిగించి దానితో తలస్నానం చేస్తే జుట్టు రంగు నల్లబడుతుంది.
బాదం నూనె: బాదం నూనె మన జుట్టుకు చేసే మేలు అంతా ఇంతా కాదు. బాదం నూనె మన జుట్టుకు మంచి పోషణను ఇస్తుంది. అలాగే జుట్టును బలంగా చేస్తుంది. గోరింటాకును బాదం నూనెలో మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
ఉల్లిపాయ రసం: ఉల్లిపాయ కూడా తెల్ల జుట్టు రాకుండా ఉండటానికి, తెల్ల బడిన వెంట్రుకలను నల్లగా మార్చడానికి సహాయపడుతుంది. ఉల్లిరసంలో సల్ఫర్ ఉంటుంది.
ఇది జుట్టు బాగా పెరగడానికి సహాయపడుతుంది. అలాగే జుట్టును నల్లగా చేస్తుంది. ఇందుకోసం ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు అప్లై చేయాలి. ఇది మీ జుట్టు రంగును నల్లగా చేస్తుంది.
పసుపు: అవును జుట్టు నల్లబడటానికి మీరు పసుపును కూడా ఉపయోగించొచ్చు. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. దీనిని పెరుగులో మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయాలి. ఇది మీ తెల్ల జుట్టును నల్లగా చేస్తుంది.
ఈ విషయాలను గుర్తుంచుకోండి
ఈ రెమెడీస్ ను మీరు రెగ్యులర్ గా చేస్తేనే మంచి ఫలితాన్ని చూస్తారు. అయితే ప్రతి వ్యక్తి జుట్టు భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఈ నివారణను ప్రతి ఒక్కరికీ ప్రయోజనకరంగా ఉంటాయని చెప్పలేం.
ఏదైనా నివారణ తీసుకునే ముందు ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్ చేయండి. అలాగే మీకు ఏదైనా అలెర్జీలు ఉంటే వీటిని ప్రయత్నించకపోవడమే మంచిది.