Beauty Tips: మిగిలిపోయిన సబ్బు ముక్కలతో.. హెయిర్ రిమూవల్ సోప్ తయారు చేద్దాం!
Beauty Tips: అవాంచిత రోమాలని తొలగించుకోవడం కోసం ఇంటిలో మిగిలిపోయిన సబ్బు ముక్కలతోనే అద్భుతమైన సోప్ తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
సాధారణంగా అవాంచిత రోమాలతో బాధపడే ఆడవాళ్లు వాటిని తొలగించుకోవడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేసే ఉంటారు. కొంతమంది రేజర్లు వాడతారు, కొంతమంది హెయిర్ రిమూవల్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తారు. అయితే వీటిని ఉపయోగించిన తరువాత చాలా సేపటి వరకు చికాకుగా, నొప్పిగా ఉంటుంది.
అంతేకాదు ఆ ప్రొడక్ట్స్ కోసం చాలా ఖర్చు పెట్టవలసి కూడా వస్తుంది. అయితే ఇంట్లోనే మిగిలిపోయిన సబ్బు ముక్కలతో ఎలాంటి ఖర్చు లేకుండా హెయిర్ రిమూవల్ సోప్ ని తయారు చేసుకోవచ్చు. దీనిని ఉపయోగించడం వలన ఎలాంటి బాధ, నొప్పి ఉండదు.
దీనివలన హెయిర్ తొలగించుకోవడం సులభం అవుతుంది. అయితే ఈ సబ్బు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం. మనం ఇంట్లో వాడే సబ్బు ముక్కలు ఆఖరు అయిపోయిన తర్వాత పారేస్తూ ఉంటాం. కానీ అలా చేయకుండా ఆ సబ్బు ముక్కలకి బేరియం సల్ఫేట్ పొడి, పసుపు కలిపితే హెయిర్ రిమూవల్ సోప్ తయారవుతుంది.
అదెలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మిగిలిపోయిన సబ్బు ముక్కలని తీసుకోండి. వాటిని వ్యాక్స్ హీటర్ ఆన్ చేసి అందులో వెయ్యండి. అది కరగడం ప్రారంభించినప్పుడు టెంపరేచర్ని తగ్గించండి. తద్వారా సబ్బు కలుగుతుంది. సబ్బు పూర్తిగా కరిగిపోయిన తర్వాత టేబుల్ స్పూన్ బేరియం సల్ఫేట్ పొడి, చిటికెడు పసుపు జోడించండి.
తర్వాత సబ్బులో బేరియం సల్ఫేట్ పొడి బాగా కలిసేలాగా చూసుకోండి. ఇప్పుడు దాన్ని ఏదైనా షేప్ బౌల్లో నింపి ఆరనివ్వండి. ఇప్పుడు మీ చేతిలో రెడీ అయిన హెయిర్ రిమూవల్ సోప్ ఉన్నట్టే. ఇక దీనిని ఎలా ఉపయోగించాలంటే ముందుగా మీ చర్మాన్ని తడి చేసుకోండి.ఆ తర్వాత సబ్బుని అప్లై చేయండి.
మీరు సబ్బుని రుద్దుతున్నప్పుడు జుట్టు నెమ్మదిగా రాలడం ప్రారంభించడాన్ని గమనిస్తారు. ఈ ప్రక్రియకు సమయం పట్టవచ్చు. కాబట్టి మీ సమయాన్ని వెచ్చించి నిదానంగా పనిచేయండి. జుట్టు రాలినప్పుడు నీళ్లతో కడిగేయాలి.కాళ్లు, చేతులు, పొత్తు కడుపు ప్రాంతాల్లో కూడా దీనిని అప్లై చేసుకోవచ్చు. కాకపోతే దీనిని వాడే ముందు చర్మానికి క్రీములు, ఆయిల్ వంటివి లేకుండా జాగ్రత్త పడండి.