ఇలా చేస్తే.. ట్యాంక్ లో నీళ్లు చల్లగా కాకుండా వెచ్చగా ఉంటాయి
చలికాలంలో ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్ లో నీళ్లు చాలా చల్లగా, ఐస్ లా మారిపోతాయి. వీటితో ఇంటిపనులను చేయడం చాలా కష్టం. అందుకే చలికాలంలో ట్యాంక్ లో నీళ్లు చల్లగా కాకుండా ఉండటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

ముందే ఇది చలికాలం. ఈ సీజన్ లో చల్ల నీళ్లను తాగడమన్నా, వాటితో పనులను చేయడమన్నా చాలా కష్టం. కానీ ఇంటిపై ఉన్న ట్యాంక్ లో నీళ్లు చల్లగా అయిపోతుంటాయి. దీనివల్ల కిచెన్, బాత్ రూం ఇలా ఇంట్లో ఉన్న ప్రతి ట్యాప్ నుంచి చల్లనీరే వస్తుంది. కానీ చలికాలంలో చల్లనీళ్లను వాడటం చాలా కష్టం. దీనివల్ల గిన్నెలు తోమడం, స్నానం చేయడం, బట్టలు ఉతకడం కష్టమవుతుంది. కానీ మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే గనుక వాతావరణం ఎంత చల్లగా ఉన్నా వాటర్ ట్యాంక్ లో నీళ్లు మాత్రం చల్లగా కాకుండా వెచ్చగా ఉంటాయి. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
Water Tank
ట్యాంక్ లో నీళ్లు చల్లబడకుండా ఉండటానికి ఏం చేయాలి?
చెక్క పెట్టె
చలి వల్ల నీళ్లు చల్లబడకుండా ఉండటానికి మీరు ట్యాంకును చెక్క పెట్టెతో కప్పొచ్చు. ఈ పెట్టె నీల్లు చల్లగా కాకుండా చేయడానికి సహాయపడుతుంది. దీనిని ఉపయోగించడం వల్ల నీటి ఉష్ణోగ్రత నార్మల్ గా ఉంటుంది. దీంతో మీ ఇంట్లోని అన్ని కుళాయిల నుంచి వచ్చే నీళ్లు చల్లగా ఉండవు. దీంతో మీరు ఏ ఇబ్బంది లేకుండా నీళ్లతో ఇంటి పనులన్నింటినీ చకచకా చేసుకోవచ్చు.
థర్మల్ ఇన్సులేషన్ లేదా ఫోమ్ కవర్
చలికాలంలో ట్యాంక్ వాటర్ గడ్డకట్టకుండా, మరీ చల్లగా కాకుండా ఉండటానికి మరొక సులువైన మార్గం కాయిల్ పై వాతావరణంలో ట్యాంక్ లోని నీరు గడ్డకట్టకుండా ఉండటానికి సులభమైన మార్గం ట్యాంక్ పై థర్మల్ ఇన్సులేషన్ లేదా ఫోమ్ సీట్ కవర్ ను కప్పడం. ఈ కవర్ మీకు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో ఈజీగా దొరుకుతుంది. ఈ కవర్ పొగమంచు, మంచు, చల్లని గాలులు వాటర్ ట్యాంకులోకి వెల్లకుండా చేస్తుంది. దీంతో నీటి ఉష్ణోగ్రత కంట్రోల్ లో ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో ఇవి బాగా ఉపయోగపడతాయి. వీటిని ఉపయోగిస్తే చలి కాలంలో ట్యాంకులోని నీరు చాలా చల్లగా కాకుండా ఉంటుంది.
పాత పరుపు, టార్పాలిన్
వాతావరణం మరీ చల్లగా ఉన్నప్పుడు ట్యాంకులోని నీళ్లు ఐస్ లా చాలా చల్లగా అవుతాయి. ఈ వాటర్ ను ఒక్క స్నానానికి మాత్రమే కాదు ఇంటి పనుల నుంచి దేనికీ ఉపయోగించలేం. ఇలాంటి నీటిని ఈ సీజన్ లో అస్సలు ముట్టుకోవాలనిపించదు. ట్యాంకులోని నీళ్లు చల్లగా కాకుండా ఉండటానికి ట్యాంక్ ను మీరు మీ ఇంట్లో ఉన్న పాత పరుపులతో కప్పొచ్చు. దీనివల్ల వల్ల చల్లగాలి ట్యాంక్ లోకి వెళ్లదు. దీంతో నీళ్లు చల్లబడవు. ఇందుకోసం ట్యాంక్ పైన టార్పాలిన్ పొరను ఉంచాలి. ఇది రాత్రిపూట వర్షం కురిసినప్పుడు లేదా మంచు కురిసినప్పుడు కూడా మీ ట్యాంక్ చల్లగా కాకుండా చేస్తుంది.