వాషింగ్ మెషిన్ ను ఎలా శుభ్రం చేయాలి?
వాషింగ్ ను మెషిన్ ను బాగా వాడేస్తుంటాం. కానీ దాన్ని మాత్రం శుభ్రం చేయం. కానీ శుభ్రం చేయకుండా వాషింగ్ మెషిన్ ను వాడితే అది తొందరగా పాడయ్యే అవకాశం ఉంది. అందుకే ఈజీగా వాషింగ్ మెషిన్ ను ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
washing machine
మన ఇంట్లో ఉపయోగించే ముఖ్యమైన వస్తువుల్లో వాషింగ్ మెషిన్ ఒకటి. ప్రస్తుత కాలంలో చాలా మంది బట్టలను ఉతకడానికి వాషింగ్ మెషిన్స్ నే వాడుతున్నారు. మురికి బట్టలను శుభ్రం చేసే వాషింగ్ మెషిన్ కు మురికి అంటుకోవడం చాలా సాధారణం. కానీ దీన్ని శుభ్రం చేయకుండా అలాగే వాడితే మాత్రం సమస్యలు రావడంతో పాటుగా వాషింగ్ మెషిన్ కూడా తొందరగా పాడవుతుంది. అందుకే దీన్ని ఎలా శుభ్రం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వాషింగ్ మెషిన్ ను క్లీన్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే?
1.బేకింగ్ సోడా
2. వెనిగర్
ఈ రెండింటితో వాషింగ్ మెషిన్ ను చాలా సులువుగా క్లీన్ చేయొచ్చు.
ముందుగా బేకింగ్ సోడాను, వెనిగర్ ను మిక్స్ చేసి మెత్తటి పేస్ట్ లా తయారుచేయండి. ఇప్పుడు ఈ పేస్ట్ ను వాషింగ్ మెషీన్ మీద అప్లై చేసి 15 నిముషాల పాటు అలాగే ఉంచండి. తర్వాత స్క్రబ్బర్ ను ఉపయోగించి వాషింగ్ మెషిన్ ను బాగా స్క్రబ్ చేయండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని.. దానిని నీటిలో ముంచి వాషింగ్ మెషీన్ ను తుడవండి.
washing machine
ఇలా కూడా క్లీన్ చేయొచ్చు
1-2 లీటర్ల నీటిని తీసుకుని వేడి చేసి గోరువెచ్చగా అయ్య వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు ఈ వాటర్ లో 2-3 చెంచాల బేకింగ్ సోడాను వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వండి. ఇప్పుడు ఈ నీటిలో కాటన్ క్లాత్ ను ముంచి.. వాషింగ్ మెషిన్ ను తుడవండి. ఇది వాషింగ్ మెషిన్ కు పట్టుకున్న మురికినంతా పోగొడుతుంది.