Negative Thoughts: నెగిటీవ్ ఆలోచనలతో సతమతమవుతున్నారా? అయితే ఇలా చేయండి..
Negative Thoughts: గతం తాలూకు అనుభవాల మూలంగానే నెగిటీవ్ థాట్స్ వస్తుంటాయి. ఈ నెగిటీవ్ థాట్స్ అంత తేలిగ్గా వదిలేయాల్సిన విషయమైతే కాదు. ప్రతికూల ఆలోచన వల్ల జీవితంలో ముందడుగు వేయలేరు. ముఖ్యంగా వీటి వల్ల మానసికంగా కుంగిపోయి, మీపై మీరు పూర్తిగా ఆత్మవిశ్వాసం కోల్పోతారు. కాబట్టి వీటినుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది.

negative thoughts
Negative Thoughts: గతంలో జరిగిన ఘటనలు, ఎదురైన అపజయాల మూలంగానే ప్రతికూల ఆలోచనలు వస్తుంటాయి. ఈ ప్రతికూల ఆలోచనలు అందరిలో సహజంగా వస్తుండేవే. అయితే కొందరు వీటిని తొందరగా మర్చిపోతే.. మరికొందరు మాత్రం వాటిని అలాగే గుర్తుంచుకుంటారు.
negative thoughts
గతంలో జరిగిన అపజయాల గురించే నిత్యం ఆలోచిస్తూ ఉంటారు. వారిని ఈ ఆలోచనలే వెంటాడుతూ వస్తుంటాయి. అలాంటి వారిలోనే నెగిటీవ్ థాట్స్ ఎక్కువగా వస్తుంటాయి. వీటివల్ల వారు పూర్తిగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. అంతేకాదు వీరు మానసికంగా కుంగిపోతారు. ఏ పని మొదలు పెడదామన్నా వారిలో నెగిటీవ్ థాట్సే యే ఉంటాయి.
negative thoughts
నెగిటీవ్ థాట్స్ నుంచి బయటపడటానికి మానసిక నిపుణులు కొన్ని సింపుల్ చిట్కాలను సూచిస్తున్నారు. వీటిని ఫాలో అయితే మాత్రం మీరు ఇంకెప్పుడూ ప్రతికూల ఆలోచనలు రావు.
గతం భవిష్యత్తుకు పునాది. కాబట్టి గతంలో జరిగిన అనుభవాలను, పరాజయాలను విజయాలుగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి కానీ వాటినే పట్టుకుని వేలాడకూడదు. గతాన్ని మార్చడం ఎవ్వరి వల్లా కాదు. కాబట్టి వాటిని ఓ పీడకలలా భావించి మర్చిపోవాలి.
ఇతరుల వల్ల మీరు ఎదుర్కొన్న ఇబ్బందులను, అవమానాలను గుర్తు చేసుకోవడం వల్ల మీ మనసు పాడవడమే తప్ప మరే లాభం ఉండదు. అలాగే మీ వల్ల ఇతరులకు హానీ కలిగితే అది మళ్లీ రిపీట్ కాకుండా జాగ్రత్తపడాలి.
నెగిటీవ్ థాట్స్ వచ్చినప్పుడు వాటన్నింటినీ ఒక నోట్ బుక్ లో రాయండి. అలాంటి ఆలోచనలు అసలెందుకు వస్తున్నాయో గమనించండి.
వీటినుంచి బయటపడాలంటే ముందుగా మీకు.. వాటినుంచి బయటపడాలనే బలమైన కోరిక, తపన ఖచ్చితంగా ఉండి తీరాలి. అప్పుడే మీరు ప్రతికూలంగా ఆలోచించలేరు.
=
ఫ్యూచర్ లో ఇలా జరగొచ్చు. అలా జరగొచ్చు.. అంటూ పదే పదే ఆలోచించడం వల్ల మీ మానసిక ఆరోగ్యంతో పాటుగా శారీరక ఆరోగ్యం కూడా పాడవుతుంది. కాబట్టి భవిష్యత్తులో అంతా మంచే జరుగుతుందని భావించండి. మీ మనస్సుకు సర్ది చెప్పండి.
మీకు తెలుసా.. మీపై మీకు నమ్మకం, ఇష్టం, గౌరవం లేనప్పుడే ఇలాంటి నెగిటీవ్ థాట్స్ వస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రేమించండి. గౌరవించుకోండి. అప్పుడు ప్రతికూల ఆలోచనలే రావు. అంతా సానుకూలంగానే ఆలోచిస్తారు.
నెగిటీవ్ నుంచి ఆలోచన నుంచి బయటపడాలంటే మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. ఇతరులతో మాట్లాడుతూ ఉండండి.. అప్పుడే మీరు ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంటారు.