నిద్రపోకుంటే కూడా భార్యాభర్తలకు ఇంత తిప్పలా?
పొద్దంతా పని చేసి.. రాత్రిపూట ఇంత తిని.. బెడ్ పై అలా వాలి.. ఇక ఫోన్ ను చేతిలోకి తీసుకుని ఇష్టం వచ్చింది చూస్తూ ఉంటారు.. ఫోన్ మాయలో పడి టైం కూడా చూసుకోరు. ఇంకే ఏ రెండింటికో, మూడింటికో టైం చూసి అప్పుడు నిద్రలోకి జారుకుంటాం. కానీ కంటి నిండా నిద్రలేకపోవడం వల్ల ఎన్నో శారీరక సమస్యలు వస్తాయి. ఇది అందరికీ తెలిసిందే.. కానీ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
Image: Getty
ప్రతివ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ ఎనిమిది గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలి. నిద్రే మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది. అలాగే మరెన్నో అనారోగ్య సమస్యలను నయం చేయడానికి సహాయపడుతుంది. మీరు కంటినిండా నిద్రపోకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇది అందరికీ తెలిసిందే. కానీ సరిగ్గా నిద్రపోకపోతే సంబంధం కూడా ప్రభావితం అవుతుందన్న ముచ్చట మీకు తెలుసా? అవును నిద్ర లేకపోవడం మీ సంబంధంలో ఒత్తిడి పెరుగుతుంది. అసలు నిద్రలేకపోతే మీ వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
కోపం పెరుగుతుంది
నిద్రలేమి మీ కోపాన్ని పెంచుతుందని కొత్త పరిశోధనలు సూచిస్తున్నాయి. అవును మీరు రాత్రిపూట సరిగ్గా పడుకోనప్పుడు మీరు ఉదయం లేచిప్పుడు మీ మానసిక స్థితి సరిగా ఉండదు. అలాగే ప్రతి చిన్న విషయానికి కోపంగా ఉంటారు. నిద్రలేకపోవడం వల్ల మీ మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల కోపం వస్తుంది.
సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది
కోపం, మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు కొట్లాటలు వస్తాయి. రాత్రిపూట సరైన నిద్ర లేకపోతే మూడ్ బాగుండదు. దీనివల్ల చిన్న చిన్న విషయాలకు మీరు మీ భాగస్వామితో గొడవ పడే అవకాశం ఉంటుంది.
పరిశోధన ఏమి చెబుతుంది?
ఈ విషయం గురించి 700 మందికి పైగా చేసిన పరిశోధన ప్రకారం.. నిద్ర లేకపోవడం సంబంధం నాణ్యతను తగ్గిస్తుందని తేలింది.
ప్రేమ తగ్గుతుంది
తగినంత నిద్ర పోని వ్యక్తులు ఎప్పుడూ మూడ్ ఆఫ్ లో ఉంటారు. వీరి మూడ్ సరిగ్గా ఉండదు. అంటే వీళ్లు కొత్త మూడ్ లో ఉండరు. ఎప్పుడూ వీరిలో మూడ్ మార్పులు జరుగుతూనే ఉంటాయి. దేనిపైనా ఆసక్తి ఉండదు. దీనివల్ల దంపతుల మధ్య ప్రేమ తగ్గుతుంది.
జీవిత భాగస్వామిపై ప్రభావం
నిద్రలేమి వల్ల ప్రతికూల భావోద్వేగాలు పెత్తనం చెలాయిస్తాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. నిద్రలేమి వల్ల మీరు మాట్లాడే విధానంలో మార్పులొస్తాయి. ఇది భాగస్వామిని ప్రభావితం చేస్తుంది.
నిద్రలేమి వల్ల ఏం జరుగుతుంది
నిద్రలేమి కూడా ఎన్నో అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఒత్తిడి, డిప్రెషన్ వంటి ఎన్నో మానసిక సమస్యలతో బాధపడతారు. ఇన్ని సమస్యలు ఉంటే కుటుంబం బాగుండదు. ఇదే ఎన్నో సమస్యలకు కారణమవుతుంది.
నిద్రరావాలంటే
మీరు కంటినిండా నిద్రపోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం అలవాటు చేసుకోండి. మీరు కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తగ్గించండి. అలాగే ప్రతి రోజూ వ్యాయామం చేయండి. మీ భాగస్వామితో కూడా మీకున్న సమస్యను పంచుకోండి. లేకపోతే మీ వైవాహిక జీవితం రిస్క్ లో పడే అవకాశం ఉంది.