MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • యవ్వనంగా ఉండాలంటే ఏం తినాలో తెలుసా?

యవ్వనంగా ఉండాలంటే ఏం తినాలో తెలుసా?

వయసు పెరుగుతున్న కొద్దీ మన శరీరంలో కొల్లాజెన్ తగ్గడం మొదలవుతుంది. దీనివల్ల మన చర్మం ముడతలు పడుతుంది. అయితే కొన్ని రకాల ఆహారాలను తింటే మీరు యవ్వనంగా ఉంటారు. ముడతలు కూడా తగ్గిపోతాయి.   

2 Min read
Shivaleela Rajamoni
Published : Jul 03 2024, 01:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
collagen

collagen

వయసు పెరుగుతున్న కొద్దీ మనం ముసలిగా కనిపించడం మొదలుపెడతాం. అంటే చర్మం చర్మంపై ముడతలు, మచ్చలు, మొటిమలు, సన్నని గీతలు కనిపించడం ప్రారంభమవుతాయి. దీనికి కారణం మన శరీరంలో కొల్లాజెన్ తగ్గడమే. మన శరీర ప్రోటీన్ లో కొల్లాజెన్  30% ఉంటుంది. ఇది మన చర్మానికి, ఎముకలకు, కండరాలకు చాలా అవసరం. 

28
Asianet Image

కొల్లాజెన్ మన చర్మాన్ని నిర్మించి బలంగా చేస్తుంది. అయితే 25 ఏండ్లు దాటిన తర్వాత శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గడం మొదలవుతుంది. దీనివల్ల ముఖంపై  ముడతలు ఏర్పడతాయి. అయితే సమతుల్య ఆహారం తింటే మీ వయసు కనిపించదు. ఎక్కువ వయసు ఉన్నా.. చిన్న ఏజ్ వాళ్లలాగే కనిపిస్తారు. అందుకే కొల్లాజెన్ ను పెంచే కొన్ని రకాల ఆహారాల గురించి  ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

38
Asianet Image

బెర్రీలు

బెర్రీల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి బాగా సహాయపడుతుంది. మీరు ప్రతిరోజూ ఒక కప్పు బెర్రీలను తింటే ఎక్కువ కాలం యవ్వనంగా ఉంటారు. ఇందుకోసం మీరు బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలు, స్ట్రాబెర్రీలలో దేనినైనా తినొచ్చు. 
 

48
Asianet Image

చేపలు

చేపలు మన ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. వీటిని తినడం వల్ల మన చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే మనం ఎన్నో అనారోగ్య సమస్యలకు కూడా దూరంగా ఉంటాం. చేపల ఎముక, చర్మం, నెత్తిమీద చాలా కొల్లాజెన్ ఉంటుంది. వీటిని తింటే మన ముఖంపై ముడతలు అస్సలు ఏర్పడవు.
 

58
Asianet Image

గుడ్డు

గుడ్డు సంపూర్ణ ఆహారం. దీనిలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. రెగ్యులర్ గా గుడ్డులోని తెల్లసొనను తినడం వల్ల శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. కాబట్టి దీన్ని మీ డైట్ ప్లాన్ లో చేర్చుకోండి. గుడ్డును తింటే మీరు ఎన్నో వ్యాధులకు కూడా దూరంగా ఉంటారు.
 

68
Asianet Image

చికెన్

చికెన్ ఆడవాళ్లకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖంపై ఉండే సన్నని గీతలు, ముడతలను తగ్గించుకోవడానికి కూడా చికెన్ సహాయపడుతుంది. అందుకే 39 ఏండ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు తప్పనిసరిగా చికెన్ తినాలని నిపుణులు చెబుతున్నారు.
 

78
Asianet Image

వెల్లుల్లి

వెల్లుల్లి ఒక మసాలా దినుసు మాత్రమే కాదు.. పోషకాలతో నిండిన దివ్య ఔషధం లాంటిది కూడా. దీన్ని రెగ్యులర్ గా ఉదయం పూట తినడం వల్ల శరీరంలో కొల్లాజెన్ తగ్గే అవకాశం ఉండదు. ఇది కూడా మీరు యవ్వనంగా కనిపించడానికి సహాయపడుతుంది. 

88
Asianet Image

ఆకుకూరలు

ఆకుకూరల్లో మినరల్స్, న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. శరీరంలో కొల్లాజెన్ కూడా బాగా పెరుగుతుంది. ఇది మిమ్మల్ని యంగ్ గా ఉంచుతుంది. 

Shivaleela Rajamoni
About the Author
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు. Read More...
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved