Beauty Tips: అందమైన ముఖానికి.. అద్భుతమైన ఆరెంజ్ పీల్ ఫేస్ ప్యాక్స్!
Beauty Tips: నారింజ పండు ఆరోగ్యానికి ఎంత ఉపయోగకరమో, నారింజ తొక్క అందానికి అంత ఉపయోగపడుతుంది. కాంతివంతమైన ముఖం కోసం ఈ నారింజ తొక్కని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.
నారింజ తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని బిగుతుగా మరియు టోన్ చేయడానికి సహాయపడతాయి. ఇది ఆరోగ్యకరమైన మెరుపుని ఇస్తుంది. అలాగే ఇందులోని సిట్రిక్ యాసిడ్ మీ చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేసి కాంతివంతంగా మారుస్తుంది.
అలాంటి నారింజ తొక్క పొడిని ఉపయోగించి ఫేస్ ప్యాక్ లు తయారు చేయాలో ఇక్కడ చూద్దాం. మొటిమలు లేని చర్మం కోసం ఆరెంజ్ పీల్ మరియు ఓట్మీల్ ఫేస్ ప్యాక్ బాగా పనిచేస్తుంది. దీనికోసం రెండు స్పూన్ల ఆరెంజ్ పీల్ పౌడర్, ఒక స్పూన్ ఓట్ మీల్, ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా కలిపి మందపాటి పేస్టులాగా తయారు చేయండి.
ఆ తర్వాత మీ ముఖానికి అప్లై చేసి వృత్తాకార కదిలికిలో మసాజ్ చేయండి. 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆపై చల్లని నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయడం వల్ల మొటిమలు లేని చర్మం మీ సొంతం అవుతుంది.
ఆరెంజ్ తొక్కలో ఉండే సి విటమిన్ చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ దెబ్బ తినకుండా కాపాడితే ఓట్ మీల్ చర్మం మీద ఉండే రంధ్రాలని లోతుగా శుభ్రపరుస్తుంది. అలాగే పొడిబారిన చర్మం కోసం ఆరెంజ్ పీల్ మరియు మిల్క్ ఫేస్ మాస్క్ తయారు చేద్దాం.
దీనికోసం ఒక చిన్న గిన్నెలో రెండు టీ స్పూన్ల ఆరెంజ్ తొక్కపొడి, ఒక టీ స్పూన్ పాలతో కలపండి. అలాగే ఈ మిశ్రమానికి ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వండి.
తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి. ఇలా చేయటం వలన నారింజ తొక్కలోని పొటాషియం చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. పాలు మూసుకుపోయిన రంధ్రాల నుంచి అదనపు నూనెలను బయటకు తీసి చర్మాన్ని హైడ్రేట్ చేసి పోషణ ఇస్తుంది.