పీరియడ్స్ టైం లో వచ్చే మొటిమల నివారణా చిట్కాలివిగో..
పీరియడ్స్ కు ఇంకా వారం రోజులు ఉందనగానే కొంతమందికి మొటిమలు వస్తుంటాయి. ముఖ్యంగా ఈ మొటిమలు ముఖం, మెడ, భుజాలపై వస్తుంటాయి. ఈ మొటిమలు రావడానికి ప్రధాన కారణం.. మన శరీరంలో హార్మోన్లు హెచ్చుతగ్గులుగా ఉండటమే. మరి ఈ మొటిమలను ఎలా పోగొట్టాలో తెలుసా..

నెలసరి సమయంలో కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, తిమ్మిరి, వాంతులు, వికారం వంటి సమస్యలు రావడం సాధారణ విషయమే. అయితే కొంతమందికి వీటితో పాటుగా రుతుస్రావం ప్రారంభమయ్యే వారం రోజుల ముందుగానే ముఖం, భుజం, మెడపై పింపుల్స్ వస్తుంటాయి. దీనికి అసలు కారణం.. ఆ సమయంలో హార్మోన్లు హెచ్చుతగ్గులుగా ఉండటమే. అయితే ఆ మొటిమలు పీరియడ్స్ టైం అయిపోగానే అవికూడా తగ్గిపోతుంటాయి.
పీరియడ్స్ టైం లో మొటిమలు ఎందుకు వస్తాయంటే.. ఆడవారిలో ఆండ్రోజెన్ల ఉత్పత్తి పెరగడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆండ్రోజన్ సెబాషియన్(సెబమ్) గ్రంధి ఎక్కువగా నూనెను స్రవిస్తుంది. ఈ సెబమ్ ఎక్కువగా ఉంటే చర్మంపై మొటిమలను ఏర్పరిచే బ్యాక్టీరియా పెరుగుతుంది. దాంతో మొటిమలు మొదలవుతుంటాయి.
ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో మొటిమలను ప్రేరేపించే ఆహారాలను తీసుకుంటే కూడా మొటిమలు మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి పీరియడ్స్ సమయంలో కొన్ని రకాల ఆహారాకు దూరంగా ఉండాలి. కాగా కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా మొటిమలను తగ్గించవచ్చు. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..
అవకాడో: అవకాడో పండులో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో మంచి కొవ్వులు కూడా మెండుగా ఉంటాయి. ఇవి పింపుల్స్ ను తగ్గించడంలో ముందుంటాయి. అవకాడోలో ఉండే పొటాషియం Urinationగా కూడా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇది అనేక రకాల చర్మ వ్యాధుకు కారణమయ్యే అదనపు సోడియంను మన శరీరం నుంచి ఇది బయటకు పంపుతుంది. కాబట్టి పీరియడస్స్ సమయంలో ఆవకాడోను తినండి.
కాలీఫ్లవర్: కాలీఫ్లవర్ లో Antioxidants మెండుగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంలో ముందుంటాయి. అంతేకాదు అనేక రకాల చర్మ వ్యాధులతో పోరాడటానికి ఇవి ఎంతో సహాయపడతాయి. ముఖ్యంగా కాలీఫ్లవర్ లో ఉండే పాలీఫెనాల్స్ సెబమ్ తక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అలాగే మొటిమలు రాకుండా అడ్డుగా నిలుస్తుంది.
దానిమ్మ గింజలు: దానిమ్మ గింజల్లో విటమిన్ సి, Antioxidants, ఫ్లెవనాయిడ్లు మెండుగా ఉంటాయి. ఇవి స్కిన్ సంబంధిత అనేక సమస్యలకు నివారణగా ఉపయోగపడుతుంది. ఈ పండులో ఉండే విటమిన్ సి మనలో రిలీజ్ అయ్యే సెబమ్ ను నియంత్రిస్తుంది. మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాలతో పోరాడటానికి యాంటీ ఆక్సిడెంట్స్ ఎంతో సహాయపడతాయి.
గ్రీన్ టీ: గ్రీన్ టీ ఫాలీఫెనాల్స్ సమ్మేళనం. ఇది పీరియడ్స్ సమయంలో వచ్చే చికాకును, మొటిమలను నివారించడానికి ఇదెంతో సహాయపడుతుంది. అంతేకాదు ఇది చర్మంలో సెబమ్ ఉత్పత్తిని కూడా తగ్గిస్తుందట.