Health care Tips: ఈ ఆయుర్వేద చిట్కాలతో స్మోకింగ్ కు గుడ్ బాయ్ చెప్పండి..
Health care Tips: స్మోకింగ్ కు అలవాటైన వారిని ఎవరైనా ఇంకెప్పుడు మానుతావురా..? అని అడిగితే వచ్చే మొదటి మాట ఇదే లాస్ట్ రా. ఇకనుంచి అస్సలు తాగను అంటూ చెప్తూ ఉంటారు. మళ్లీ తాగేస్తుంటారు. దాని నుంచి బయటపడాలనుకుంటారు కానీ ఆ అలవాటును ఎలా మానుకోవాలో తెలియక తాగేస్తుంటారు. అయితే కొన్ని ఆయుర్వేద చిట్కాలతో స్మోకింగ్ అలవాటును మానుకోవచ్చంటున్నారు నిపుణులు.

తులసి ఆకులు.. తులసి ఆకులు మనకు దివ్య ఔషదంతో సమానం. ముఖ్యంగా ఈ స్మోకింగ్ వ్యసనాన్ని వదిలించుకోవడానికి ఇది మంచి మెడిసిన్ లా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబున్నారు. స్మోకింగ్ ను మానేయాలనుకునే వారు ప్రతిరోజూ పరిగడుపున మూడు నాలుగు తులసి ఆకులను తినాలి. ఇలా చేస్తే స్మోకింగ్ వల్ల కలిగే హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయని చెబుతున్నారు.
వాము.. స్మోకింగ్ కు దూరం చేయడానికి మీకు వాము బాగా ఉపయోగపడుతుంది. నిత్యం ఉదయం పరిగడుపున కొంచెం వామును తీసుకుంటే సిగరేట్ ను కాల్చడం తక్కువ చేస్తారు.
ఆకు కూరలు.. ఆకు కూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. అయితే వీటిని మీ రోజు వారి ఆహారంలో తీసుకుంటే స్మోకింగ్ చేసే అలవాటు కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
రాగిపాత్రలో నీరు.. రాగిపాత్రలో ఉంచిన నీళ్లను తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది. ఈ వాటర్ ను తాగితే సిగరేట్ ను కాల్చే వ్యసనం నుంచి కూడా బయటపడొచ్చంటున్నారు నిపుణులు. ఈ నీటిని తాగితే మన శరీరంలో ఉండే ట్యాక్సిన్స్ కూడా బయటకుపోతాయి.
త్రిఫల.. స్మోకింగ్ చేయండి వల్ల వారి బాడీలో నికోటిన్ శాతం ఎక్కువయ్యే ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురుకావొచ్చు. కానీ ఈ సమస్యలను తగ్గించడానికి త్రిఫల బాగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. త్రిఫల చూర్ణాన్ని పడుకునే ముందు తీసుకుంటే చక్కటి ఫలితాలుంటాయి.