రోజూ 2 కిలోమీటర్లు నడిచినా ఏమౌతుందో తెలుసా?
నడక మన ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. రోజూ మీరు గనుక ఒక రెండు కిలో మీటర్లు నడిస్తే.. ఎన్నో జబ్బులకు దూరంగా ఉంటారు. అసలు రోజూ రెండు కిలో మీటర్లు నడిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వాకింగ్ మన శరీరానికి చాలా మంచిది. రోజూ నడిస్తే మన ఆయుష్షు పెరుగుతుంది. అలాగే గుండె మరింత మెరుగ్గా పనిచేస్తుంది. అలాగే బీపీ, షుగర్ లాంటి జబ్బులు అదుపులో ఉంటాయి. అంతేకాదు బరువు తగ్గడానికి కూడా ప్రయోజకరంగా ఉంటుంది.
మీరు గనుక రోజూ నడిస్తే టైప్ 2 డయాబెటీస్, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రోజుకు రెండు కిలోమీటర్లు నడిస్తే కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
రోజూ 2 కి.మీ. నడక ప్రయోజనాలు
గుండె ఆరోగ్యం
మీరు గనుక రోజూ రెండు కిలోమీటర్లు నడిస్తే మీ శ్వాసకోశ అవయవాలు బాగా పనిచేస్తాయి. అలాగే ఊపిరితిత్తులు మరింత మెరుగ్గా పనిచేస్తాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మీరు ఫాస్ట్ గా నడిచినప్పుడు మీ గుండె వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ చేస్తుంది. అలాగే రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది. మన గుండె, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపర్చడానికి నడక చాలా సహాయపడుతుంది.
బీపీ తగ్గుతుంది
రోజూ రెండు కిలోమీటర్లు ఫాస్ట్ ఫాస్ట్ గా నడిస్తే హైబీపీ కంట్రోల్ లో ఉంటుంది. దీంతో మీకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా వరకు తప్పుతుంది. అంతేకాదు ఇది మీ మానసిక స్థితి కూడా మెరుగుపరుస్తుంది. మానసిక ఒత్తిడి లేకుండా మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది.
బరువు తగ్గుతారు
రోజూ రెండు కిలో మీటర్లు నడిస్తే మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడం మొదలవుతుంది. వాకింగ్ వల్ల మీ శరీరం ఎక్కువ శక్తిని ఉపయోగిస్తుంది. అలాగే మీ జీవక్రియ కూడా పెరుగుతుంది. వీటన్నింటి వల్ల మీరు ఫాస్ట్ గా బరువు తగ్గుతారు. బరువు తగ్గాలనుకునే వారు రోజుకు 2 కిలోమీటర్లు నడిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. మీరు బరువు తగ్గడానికి వేరే ఏ వ్యాయామాలు చేయాల్సిన అవసరం కూడా ఉండదు.
పక్షవాతం రాదు
రెగ్యులర్ గా ఫాస్ట్ గా నడవడం వల్ల మీ శరీరం చురుగ్గా పనిచేయడం ప్రారంభిస్తుంది. అలాగే మెదడుకు రక్త ప్రసరణ కూడా సక్రమంగా జరుగుతుంది. దీంతో మీ మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అలాగే డే మొత్తం ఎనర్జిటిక్ గా ఉంటారు. దీంతో మీకు పక్షవాతం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.
కండరాలు బలంగా ఉంటాయి
మనం ఫాస్ట్ ఫాస్ట్ గా నడిచినప్పుడు కండరాల నష్టం జరిగే అవకాశం ఉండదు.ఎప్పుడూ నడిచేవారికి వృద్ధాప్యంలో కూడా వారి శరీర కండరాలు బలంగా ఉంటాయి. వీళ్లు ఎంత వయసొచ్చిన ఆరోగ్యంగా ఉంటారు. నడుస్తారు.
మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది!
నడక శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాదు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. నడుస్తున్నప్పుడు మానసిక స్థితిని మెరుగుపరిచే ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. దీంతో భయం, ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక సమస్యలు తగ్గుతాయి.
కీళ్ల ఆరోగ్యం
రోజూ నడిస్తే కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే కీళ్ల నొప్పులు కూడా తగ్గడం ప్రారంభమవుతాయి. వేగంగా నడవడం వల్ల మీరు చురుగ్గా ఉండటమే కాకుండా కీళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది
రోజూ తిన్న తర్వాత కొంచెం సేపు నడిస్తే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. అందుకే డయాబెటీస్ ఉన్నవారు తిన్న తర్వాత ఖచ్చితంగా నడవాలి అంటారు.
మంచి నిద్ర:
ఒక్క నిద్ర బాగుంటే మీరు ఎన్నో వ్యాధులను సులువుగా తగ్గించుకోగలుగుతారు. అలాగే ఎన్నో వ్యాధులను ముందుగానే రాకుండా చేయొచ్చు. గాఢ నిద్ర శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చాలా అవసరం. రోజూ ఉదయం రెండు కిలోమీటర్లు చురుగ్గా నడిచే వారికి రాత్రి పూట గాఢగా నిద్ర పడుతుంది.