శృంగారంలో భావప్రాప్తి సూపర్ హెల్తీ..!
శృంగారంలో భావప్రాప్తి పొందేందుకు భాగస్వామి ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం. ఏదేమైనా రెగ్యులర్ గా భావప్రాప్తిని పొందితే ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

శృంగారంలో క్లైమాక్స్ కు చేరుకోవడాన్నే భావప్రాప్తి అంటారు. శృంగార ఆనందాన్ని పొందేందుకు భావప్రాప్తిని కోరుకుంటారు చాలా మంది. ఈ సంగతి పక్కన పెడితే సెక్సతోనే కాదు భావప్రాప్తితో కూడా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవును సెక్స్ మీ సంబంధాన్ని బలపర్చడమే కాదు మీ భావోద్వేగ, శారీరక ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అసలు రోజూ భావప్రాప్తిని పొందడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
నిద్ర మెరుగుపడుతుంది
ఉద్వేగం మీ శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ను రిలీజ్ చేయడానికి సహాయపడుతుంది. ఈ హార్మోన్ ఆనందాన్ని కలిగిస్తుంది. ఆక్సిటోసిన్ నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా, రిలాక్స్ గా ఉంచుతుంది. ఇది నిద్ర హార్మోన్ అయిన మెలటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో మీరు ప్రశాంతంగా నిద్రపోతారు.
ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి
భావప్రాప్తి తర్వాత మీ శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. దీంతో మీ ఒత్తిడి స్థాయిలు తగ్గిపోతాయి. ఉద్వేగం మీ ఆలోచనలు ఒత్తిడి నుంచి ఆనందానికి తీసుకెళుతుంది. భావప్రాప్తి డోపమైన్ ను కూడా రిలీజ్ చేస్తుంది. ఇది మిమ్మల్ని ఆనందంగా ఉంచుతుంది. అలాగే సెక్స్ పై ఇంట్రెస్ట్ ను పెంచుతుంది.
కటి కండరాలు బలోపేతం అవుతాయి
భావప్రాప్తి మీ కటి కండరాలను కూడా బలోపేతం చేయడానికి సహాయపడతాయి. కెగెల్ వ్యాయామం వల్ల ఎలాంటి ప్రయోజనాలను పొందుతారో దీనిలో కూడా అలాంటి ప్రయోజనాలనే పొందుతారని నిపుణులు చెబుతున్నారు. జర్నల్ ఆఫ్ ఉమెన్స్ హెల్త్, ఇష్యూస్ అండ్ కేర్, రొటీన్ లో ప్రచురించబడిన ఒక వ్యాసం ప్రకారం.. భావప్రాప్తి కటి కండరాలను బలోపేతం చేస్తుంది. చలనశీలతను మెరుగుపరుస్తుంది. కటి కండరాలు బలపడితే ఆడవారి మూత్రాశయ పనితీరు మెరుగుపడుతుంది.
నొప్పి నుంచి ఉపశమనం
స్పర్శ, సెక్స్ సమయంలో మీ శరీరంలో ఎండార్ఫిన్లు రిలీజ్ అవుతాయి. ఈ ఎండార్ఫిన్లు శరీర నొప్పిని తగ్గిస్తాయి. ఉద్వేగంతో తలనొప్పి నుంచి ఆర్థరైటిస్ వరకు ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. పీరియడ్స్ టైంలో సెక్స్ పై ఇంట్రెస్ ఉంటే .. పీరియడ్స్ నొప్పి, తిమ్మిరి వంటి పీరియడ్స్ లక్షణాలు తగ్గుతాయి.
ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది
క్రమం తప్పకుండా సెక్స్ లో పాల్గొనడం, తరచుగా స్ఖలనం చేసే పురుషులకు ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందని పరిశోధకులు కనుగొన్నారు. అయితే తరచుగా స్ఖలనం ప్రొస్టేట్ క్యాన్సర్ నుంచి ఎంత రక్షణ కల్పిస్తుందో స్పష్టంగా తెలియదు. కానీ స్ఖలనం మీ శరీరం నుంచి విషయాన్ని బయటకు పంపడానికి, మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. ఎక్కువ స్ఖలనం చేసే పురుషులు ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను కలిగి ఉంటారని నిపుణులు చెబుతున్నారు.